Hyderabad: ‘ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నా.. అమ్మానాన్న క్షమించండి’ కలకలం రేపుతోన్న ఇంటర్‌ విద్యార్ధి సూసైడ్ నోట్

మీర్‌పేటలోని గౌతంనగర్‌కు చెందిన పాల వ్యాపారి మంచన ఆనంద్, కృష్ణవేణి దంపతుల పెద్ద కుమారుడు వైభవ్‌ (16) చైతన్యపురిలోని నారాయణ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ (ఎంపీసీ గ్రూపు) చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా కాలేజీ యాజమన్యం అధిక మార్కులు తెచ్చుకోవాలంటూ ఒత్తిడి చేయసాగారు. దీంతో బాలుడు డిప్రెషన్‌లోకి వెళ్లాడు. తండ్రి పాల వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండే వైభవ్‌ మంగళవారం (అక్టోబర్‌ 31) తెల్లవారుజామున తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు..

Hyderabad: 'ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నా.. అమ్మానాన్న క్షమించండి' కలకలం రేపుతోన్న ఇంటర్‌ విద్యార్ధి సూసైడ్ నోట్
Narayana College Student Suicide
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 01, 2023 | 8:50 AM

మీర్‌పేట్‌, నవంబర్‌ 1: ప్రైవేట్‌ చదువుల ఒత్తడికి మరో విద్యా కుసుమం బలైంది. తాజాగా నారాయణ విద్యార్ధి ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అధికమార్కులు తెచ్చుకోవాలని కాలేజీ యాజమాన్యం చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నానంటూ సూసైడ్‌ లెటర్‌ రాసి ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మీర్‌పూటలో సోమవారం రాత్రి (అక్టోబర్‌ 30) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మీర్‌పేటలోని గౌతంనగర్‌కు చెందిన పాల వ్యాపారి మంచన ఆనంద్, కృష్ణవేణి దంపతుల పెద్ద కుమారుడు వైభవ్‌ (16) చైతన్యపురిలోని నారాయణ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ (ఎంపీసీ గ్రూపు) చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా కాలేజీ యాజమన్యం అధిక మార్కులు తెచ్చుకోవాలంటూ ఒత్తిడి చేయసాగారు. దీంతో బాలుడు డిప్రెషన్‌లోకి వెళ్లాడు. తండ్రి పాల వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండే వైభవ్‌ మంగళవారం (అక్టోబర్‌ 31) తెల్లవారుజామున తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పని ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బెడ్‌రూంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని వైభవ్‌ విగత జీవిగా కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులు బాలుడిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంట్లో వైభవ రాసిన సూసైడ్‌ నోట్‌ లభించింది. అందులో తన మృతికి గత కారణాన్ని బాలుడు వివరించాడు. తన ఆత్మహత్యకు కాలేజీ ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ కారణమని వారి పేర్లను పేర్కొన్నాడు.

అసలు సూసైడ్‌ నోట్‌లో ఏముందంటే..

ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని నారాయణ జూనియర్‌ కాలేజీలోని టీచర్లు, ప్రిన్సిపల్, వైస్‌ ప్రిన్సిపల్‌ టార్చర్‌ చేస్తున్నారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నాను. సారీ అమ్మానాన్న, తమ్ముడు. ఇదే నా చివరి రోజు. దయచేసి ఎవరూ నారాయణ కాలేజీలో చేరొద్దు. తమ్ముడిని మంచి కాలేజీలో చేర్పించండి. తమ్ముడి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా’ అని తన సూసైడ్‌ నోట్‌లో ఉన్నట్లు మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ కె కిరణ్‌కుమార్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

దీంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు, స్థానికులునారాయణ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్‌స్టేషన్‌ వద్దకు ర్యాలీ నిర్వహించారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు. కాలేజీ యాజమాన్యంపై IPC సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపణ) కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.