AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆపరేషన్ తెలంగాణ’.. ఇవాళ మూడు నియోజకవర్గాల్లో రాహుల్ సుడిగాలి పర్యటన.. ఎక్కడెక్కడంటే.?

కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజాభేరి సభకు హాజరైన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ బీఆర్‌ఎస్‌-బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రజా తెలంగాణ.. దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరగనున్నాయన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను, కేంద్రంలో బీజేపీని ఓడిస్తామన్నారు రాహుల్‌. తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

'ఆపరేషన్ తెలంగాణ'.. ఇవాళ మూడు నియోజకవర్గాల్లో రాహుల్ సుడిగాలి పర్యటన.. ఎక్కడెక్కడంటే.?
Rahul Gandhi
Ravi Kiran
| Edited By: TV9 Telugu|

Updated on: Nov 01, 2023 | 4:51 PM

Share

హైదరాబాద్, నవంబర్ 1: కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజాభేరి సభకు హాజరైన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ బీఆర్‌ఎస్‌-బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రజా తెలంగాణ.. దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరగనున్నాయన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను, కేంద్రంలో బీజేపీని ఓడిస్తామన్నారు రాహుల్‌. తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మ.2గంటలకు కల్వకుర్తి సభలో పాల్గొంటారు. సా.6 గంటలకు జడ్చర్లలో జరిగే కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు రాహుల్‌. కొల్లాపూర్‌లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభ తర్వాత ఆయన శంషాబాద్‌లో బస చేశారు. రాహుల్‌తో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఠాక్రే, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు.

అంతకు ముందు కొల్లాపూర్‌లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుబంధు నిలిచిపోతుందన్న ఆరోపణల్ని కొట్టిపారేశారు రాహుల్‌. ఢిల్లీలో ముఖ్యమైన సమావేశం ఉన్నా.. ప్రియాంక అనారోగ్యం వల్ల తాను తెలంగాణ పర్యటనకు వచ్చానన్నారు రాహుల్. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాకూడదని కుట్ర చేస్తున్నాయని ఆరోపించారాయన. సీఎం కేసీఆర్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు జరగకపోవడాన్ని ప్రశ్నించారు రాహుల్.

దొరల తెలంగాణ కాదు, ప్రజలు కలగన్న తెలంగాణ సాకారం కాబోతోందన్నారు రాహుల్ గాంధీ. ధరణి పోర్టల్‌తో రైతులకు అన్యాయం జరుగుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని.. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు రాహుల్. ఇందిరమ్మ స్కీమ్‌ కింద పేదలకు ఇళ్లు.. అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తామని స్పష్టం చేశారు రాహుల్‌గాంధీ. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒకటే. ఆ పార్టీలన్నీ కూడా కలిసి పనిచేస్తున్నాయని.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాకూడదని కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాహుల్‌ పర్యటనతో కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌లో మరింత జోష్‌ వస్తుందని పార్టీ వర్గాలు అంచనావేస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు