Kotha Prabhakar Reddy: నిలకడగా కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్యం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Kotha Prabhakar Reddy health bulletin: మెదక్ ఎంపీ, దుబ్బాక BRS అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యయత్నం జరిగిన విషయం తెలిసిందే. ప్రచారంలో ఉండగా.. దుండగుడు కత్తితో దాడి చేశాడు. దీంతో కడుపులో తీవ్రగాయం కాగా.. యశోద ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. సర్జరీ అనంతరం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

Kotha Prabhakar Reddy health bulletin: మెదక్ ఎంపీ, దుబ్బాక BRS అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యయత్నం జరిగిన విషయం తెలిసిందే. ప్రచారంలో ఉండగా.. దుండగుడు కత్తితో దాడి చేశాడు. దీంతో కడుపులో తీవ్రగాయం కాగా.. యశోద ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సర్జరీ అనంతరం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. వైద్యుల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు చికిత్సను అందిస్తున్నారు. అయితే, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు మంగళవారం ప్రకటించారు. నాలుగు రోజులు ఐసీయూలోనే ఉండాలని సూచించారు. వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని యశోద వైద్యులు సూచించారు.
దర్యాప్తు వేగవంతం..
కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో సిద్ధిపేట పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటన సమయంలో రాజుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సర్పంచ్ నరసింహులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రాజుపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. హత్యాయత్నం వెనుక కుట్ర దాగి ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజు గత వారం రోజులుగా మాట్లాడిన కాల్ డేటాపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం నిందితుడు రాజుకి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడు కోలుకున్న తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
మంత్రి హరీష్ రావు ఫైర్..
ఓ ప్రజాప్రతినిధిపై దాడి జరిగితే.. ఖండించాల్సిన ప్రతిపక్షాలు కోడికత్తి అనడం తగదని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కత్తి దాడిలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డిని మంత్రి పరామర్శించారు. ఘటనకు సంబంధించి నిందితుడి కాల్ డేటాను పోలీసులు సేకరించారని.. ఒకటి రెండు రోజుల్లో పోలీసులు కుట్ర కోణాన్ని ఛేదిస్తారని ఆశిస్తున్నామన్నారు.
ఎమ్మెల్యేలు, ఎంపీల భద్రతను పెంచిన ప్రభుత్వం..
కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడితో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రభుత్వం భద్రతను పెంచింది. ప్రస్తుతం ఉన్న 2+2గా ఉన్న భద్రతను 4+4కు పెంచింది. అన్ని జిల్లాల అధికారులకు ఇంటెలిజెన్స్ డీజీ ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
