AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: ర్యాలీ, సభలకు ముందస్తు పర్మిషన్ తప్పనిసరి.. అసెంబ్లీ ఎన్నికల రూల్స్ ఇవే..!

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా సభలు సమావేశాలు ర్యాలీలకు ముందస్తుగా పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్. నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఎలక్షన్ కోడ్ పాటించాలని సూచించారు. ఇక కొత్త ఓటర్ నమోదు గడువు ముగిసిందని, నిబంధనలు పాటించకపోతే కటినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Telangana Election: ర్యాలీ, సభలకు ముందస్తు పర్మిషన్ తప్పనిసరి.. అసెంబ్లీ ఎన్నికల రూల్స్ ఇవే..!
Ghmc Commissioner Ronald Rose
Yellender Reddy Ramasagram
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 31, 2023 | 7:37 PM

Share

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా సభలు సమావేశాలు ర్యాలీలకు ముందస్తుగా పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్. నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఎలక్షన్ కోడ్ పాటించాలని సూచించారు. ఇక కొత్త ఓటర్ నమోదు గడువు ముగిసిందని, నిబంధనలు పాటించకపోతే కటినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఎన్నికల నియమావళిలో భాగంగా రాజకీయ పార్టీలు ఇతర పార్టీల పాలసీలు, కార్యక్రమాలను, గత రికార్డులను, పనులను విమర్శించకూడదన్నారు. నోటిఫికేషన్ తేదీ నుండి ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలన్నారు. ప్రచారంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు సువిధ యాప్ ద్వారా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించే స్థలం, సమయం తదితర వివరాలను స్థానిక పోలీస్ అధికారులకు తెలియజేయాలని తెలిపారు.

ముఖ్యంగా ప్రచారంలో భాగంగా ఉపయోగించే లౌడ్ స్పీకర్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు ఎన్నికల అధికారి. ఎవరైనా సభలో ఆటంకం కలిగించిన పోలీసు అధికారుల సహాయం తీసుకోవాలన్నారు. ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలు బ్యాడ్జెస్, ఐడెంటి కార్డులు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. రాజకీయ నాయకులు పంపిణీ చేసే ఓటరు స్లిప్ లో ఎటువంటి సింబల్ గానీ, పార్టీ గుర్తు ఉండకూడదన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు రాజకీయ నాయకులు ఎలక్షన్ కమిషన్ పరిశీలకులకు, రిటర్నింగ్ అధికారికి, జోనల్, సెక్టర్ మెజిస్ట్రేట్ కు, సీఈవో, ఈసీఐకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

రాజకీయ పార్టీ ప్రతినిధులు ప్రచారంలో కుల, మత, వర్గాల పై ఓటర్లను ఓట్లు అడగకూడదని పేర్కొన్నారు. కుల, మత, భాష లను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయకూడదని అన్నారు. ప్రార్థన స్థలంలో ఎటువంటి ప్రచారం నిర్వహించకూడదని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల లోపు రాజకీయ పార్టీ ప్రతినిధులు ఓటర్లకు ఉచితాలు అందించకూడదన్నారు. పోలింగ్ కు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం నిర్వహించకూడదని, ఏజెంట్లు, అభ్యర్థులు పెద్ద మొత్తంలో నగదును తీసుకెళ్లకూడదని, ఇతర పార్టీల పోస్టర్లను తొలగించకూడదని తెలిపారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లను వినియోగించకూడదు అని అన్నారు. ఎన్నికల సమయంలో లిక్కర్ ను పంపిణీ చేయకూడదని తెలిపారు.

నవంబర్ 3వ తేదీన రిటర్నింగ్ అధికారులు ఫారం-1 ద్వారా నోటిఫికేషన్ జారీచేసే నామినేషన్ల స్వీకరణ చేపడతారు.  నామినేషన్  ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకోవచ్చనీ వివరించారు. నవంబర్ 3వ తేదీ నుండి నవంబర్ 10వ తేదీ వరకు పనిదినాల్లో నామినేషన్లను స్వీకరించనున్నారు. అఫిడవిట్ లోని అన్ని కాలమ్స్‌ను తప్పనిసరిగా నింపాలని తెలిపారు. అభ్యర్థి నామినేషన్ తో పాటు ఎలక్టోరల్ పేరు ఉన్న కాపీ ని జతచేయాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థి గుర్తింపు పొందిన జాతీయ పార్టీ కానీ, రిజిస్ట్రేషన్ పార్టీ  చెందిన చో కేవలం ఒకరు మాత్రమే ప్రపోజ్ చేయవచ్చని, ఇండిపెండెంట్ లకు పది మంది ప్రపోజ్ చేయాలన్నారు. నామినేషన్ పత్రాలను ఆన్ లైన్ ద్వారా కూడా స్వీకరించడం జరుగుతుందన్నారు. నామినేషన్ పత్రాలు అభ్యర్థి కానీ, ప్రపోజల్ కానీ, ఎలక్షన్ ఏజెంట్ కానీ ఆథరైజ్డ్ పర్సన్ అందించాలన్నారు. హార్డ్ కాఫీని మాత్రం రిటర్నింగ్ అధికారి సూచించిన తేదీన హర్డు కాఫీ  సమర్పించాలని అన్నారు. నామినేషన్ వేసేటప్పుడు ఆర్.ఓ కార్యాలయంలో అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.

పోటీలో ఉండే అభ్యర్థులు తమ క్రిమినల్ రికార్డు లను  లీడింగ్ న్యూస్ పేపర్స్, టి.వి ఛానళ్ల లో పబ్లిష్ చేయాలని తెలిపారు. అభ్యర్థితో పాటు ఆర్.ఓ కార్యాలయానికి మూడు వాహనాలు మాత్రమే పర్మిషన్ ఉంటుందన్నారు. నామినేషన్ ముగిసిన అనంతరం ఓటరు స్లిప్ లను ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటికి Proud to be voter అనే అంశంతో స్టిక్కర్లు అతికించి అవగాహన కల్పించడంతో పాటు ఇంటికి కరపత్రాల ద్వారా ఓటు పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ను నోడల్ ఆఫీసర్ ద్వారా సిబ్బంది పేర్లను స్వీకరించి వారికి అందజేస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలు ప్రింటింగ్ మెటీరియల్ పై పబ్లిషర్ పేరు, అడ్రెస్ పొందుపర్చడంతో పాటు ఎన్ని ప్రతులను ప్రింటింగ్ చేస్తున్నారో వివరించి ప్రింటర్ పేరు అడ్రస్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.

రాజకీయ పార్టీలు ఎన్నికల్లో వినియోగించే పోస్టర్లు, బ్యానర్లు తదితర సామాగ్రి పై రేట్ చార్ట్ ప్రకారంగా ఖర్చులు జమ చేయాలని అన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల ఆర్.ఓ ల ఫోన్ నెంబర్లు పొలిటికల్ ఏజెంట్లకు ఆర్.ఓ ద్వారా ఈ.వీ.ఎం ల పనితీరు పై అవగాహన కల్పించాలని రాజకీయ పార్టీ లు కోరగా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. ఆగ్జిలరీ పోలింగ్ కేంద్రాల వివరాలు తెలిపారు. కొన్ని చోట్ల వాల్ పెయింటింగ్ లను తొలగించడం లేదని వాటి పై చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీ ప్రతినిధి కోరగా ఎక్కడ  ఖచ్చితమైన స్థలం ప్రదేశం తెలిపితే తొలగించడం జరుగుతుందన్నారు. అక్కడిక్కడే ఫ్లయింగ్ స్క్వాడ్ కు ఫోన్ చేసి తొలగింపు దృశ్యాలు సిసి టివి ద్వారా వారికి చూపించారు.

పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పోలింగ్ శాతం పెరిగేందుకు చర్యల పై రాజకీయ పార్టీకి చెందిన ప్రతినిధి కోరగా స్వీప్ కార్యక్రమంలో భాగంగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లకు ఓటరు అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు కళాశాలలో యువతీ యువకలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించామని తెలిపారు. ఏజెంట్ లకు, పార్టీ ప్రతినిధులకు ఈ.వి.ఎం ల పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని  కమిషనర్ తెలిపారు. నామినేషన్ సందర్భంగా  అభ్యర్థుల కోసం  ఆర్.ఓ కార్యాలయం వద్ద హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని ప్రతినిధులు కోరగా  ఏ ఆర్ ఓ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

ఇప్పటికీ జరిగిన ప్రాసెస్ ఒకెత్తు అయితే నవంబర్ 3వ తేదీ నుంచి జరిగే ప్రాసెస్ ఒకలా ఉంటుందన్నారు GHMC కమీషనర్ రోనాల్డ్ రాస్. ఇక ప్రతీ ఒక్కరూ నిబంధనలు పాటించాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..