Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: పండగ కోసం భర్తతో కలిసి షాపింగ్‌.. గంటల వ్యవధిలోనే బావతో జంప్‌!

పచ్చని కాపురంలో ఓ ఇల్లాలు నిప్పులు పోసుకుంది. భర్త, పిల్లలతో హాయిగా సాగుతోన్న వారి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. దీపావళికి భర్త, పిల్లలతో కలిసి షాపింగ్‌కు వెళ్లి ఇష్టమైనవన్నీ కొనింది. అనంతరం ఇంటికి వచ్చి ఎవరికీ చెప్పాపెట్టకుంటా పిల్లలను తీసుకుని కనిపించకుండా పోయింది. ఆనక వాకబు చేస్తే బావతో కలిసి మహిళ వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో సదరు భర్త.. భార్య, పిల్లల కోసం పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య వెనుదిరిగిరాకపోతే నిరాహర దీక్ష

Crime News: పండగ కోసం భర్తతో కలిసి షాపింగ్‌.. గంటల వ్యవధిలోనే బావతో జంప్‌!
Woman Elopes With Brother In Law
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 02, 2023 | 8:35 AM

మీరట్‌, నవంబర్‌ 2: పచ్చని కాపురంలో ఓ ఇల్లాలు నిప్పులు పోసుకుంది. భర్త, పిల్లలతో హాయిగా సాగుతోన్న వారి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. దీపావళికి భర్త, పిల్లలతో కలిసి షాపింగ్‌కు వెళ్లి ఇష్టమైనవన్నీ కొనింది. అనంతరం ఇంటికి వచ్చి ఎవరికీ చెప్పాపెట్టకుంటా పిల్లలను తీసుకుని కనిపించకుండా పోయింది. ఆనక వాకబు చేస్తే బావతో కలిసి మహిళ వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో సదరు భర్త.. భార్య, పిల్లల కోసం పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య వెనుదిరిగిరాకపోతే నిరాహర దీక్ష చేస్తానంటూ డిమాండ్‌ చేశాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..

మీరట్‌లోని జానీ ప్రాంతానికి చెందిన అశోక్‌తో 2019లో కల్పన (పేరు మార్చాం) అనే యువతికి వివాహం జరిగింది. వివాహం తర్వాత వీరి కాపురం ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా సజావుగా సాగింది. ఎంతో సంతోషంగా ఉండే ఈ జంటకు 18 నెలల కుమారుడు కూడా ఉన్నాడు. కర్వా చౌత్ పండుగ (ఉత్తరాది వివాహిత మహిళలు కర్వా చౌత్ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. భర్తల శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం భార్యలు పగటిపూట ఉపవాసం ఉండి పూజలు చేస్తారు) ఉండటంతో సదరు మహిళ తన భర్తతో కలిసి తాజాగా షాపింగ్‌కు వెళ్లింది. షాపింగ్‌ చేసిన కొన్ని గంటల తర్వాత కల్పన, ఆమె కుమారుడు కనిపించకుండా పోయారు. వరుసకు బావ అయ్యే రాహుల్‌ అనే వ్యక్తితో కలిసి ఆమె పారిపోయింది.

కులి పనులు చేసుకునే అశోక్‌.. తన పని ముగించుకుని ఇంటికి రాగా ఇరుగుపొరుగు ఈ చేదు వార్తను అతనికి తెలిపారు. దీంతో కుప్పకూలిపోయిన అశోక్‌ వెంటనే తేరుకుని స్థానికంగా ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తాను లేని సమయంలో తన ఇంటికి వచ్చిన రాహుల్‌ అనే వ్యక్తి తన భార్య, కుమారుడిని తీసుకుని వెళ్లిపోయినట్లు అశోక్‌ పోలీసులకు తెలిపాడు. కర్వా చౌత్ కోసం తన భార్యను షాపింగ్ కి కూడా తీసుకెళ్లానని, తన భార్య రూ. 15 వేల విలువైన బంగారు అభరణాలు కూడా తీసుకుని పారిపోయిందని తెలియజేశాడు. తన భార్య, తన పిల్లల ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను వేడుకున్నాడు. అశోక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు మీరట్ ఎస్పీ కమలేష్ బహదూర్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.