APPSC Group 1 and Group 2: నవంబర్‌ నెలాఖరులోగా ఏపీపీఎస్సీ గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు.. మొత్తం 1603 పోస్టులకు వరుసగా..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 1,603 ఉద్యోగాల భర్తీకి ఈ నెలాఖరులోగా వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపీపీఎస్సీ) వెల్లడించిన సంగతి తెలిసిందే. వీటిల్లో గ్రూపు-1 కింద 88 పోస్టులు, గ్రూపు-2 కింద 989 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్‌ బుధవారం (నవంబర్‌ 1) విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. గ్రూపు-1 పోస్టుల సంఖ్య మరిన్ని పెరిగే అవకాశం ఉన్నట్లు కమిషన్‌ పేర్కొంది. అంతేకాకుండా ఈ సారి జరగనున్న గ్రూపు-1 పరీక్షలు, మూల్యాంకనానికి కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నామని స్పష్టం..

APPSC Group 1 and Group 2: నవంబర్‌ నెలాఖరులోగా ఏపీపీఎస్సీ గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు.. మొత్తం 1603 పోస్టులకు వరుసగా..
APPSC
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 02, 2023 | 1:54 PM

అమరావతి, నవంబర్‌ 2: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 1,603 ఉద్యోగాల భర్తీకి ఈ నెలాఖరులోగా వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపీపీఎస్సీ) వెల్లడించిన సంగతి తెలిసిందే. వీటిల్లో గ్రూపు-1 కింద 88 పోస్టులు, గ్రూపు-2 కింద 989 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్‌ బుధవారం (నవంబర్‌ 1) విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. గ్రూపు-1 పోస్టుల సంఖ్య మరిన్ని పెరిగే అవకాశం ఉన్నట్లు కమిషన్‌ పేర్కొంది. అంతేకాకుండా ఈ సారి జరగనున్న గ్రూపు-1 పరీక్షలు, మూల్యాంకనానికి కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేసింది. నిపుణుల సలహాలతో సిలబస్, పరీక్ష విధానాల్లో సమూల మార్పులు తెస్తామని తెల్పింది. గ్రూపు-1, గ్రూపు-2 తోపాటు ఏయే నోటిఫికేషన్లు, ఎన్ని పోస్టులకు విడుదలవుతాయో ఆ వివరాలు మీకోసం..

వెలువడ నున్న 23 నోటిఫికేషన్ల వివరాలు

  • ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 పోస్టులు: 90
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 పోస్టులు: 900
  • లైబ్రేరియన్‌ ఇన్‌ ఏపీ కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ పోస్టులు: 23
  • డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టులు పోస్టులు: 267
  • ఏపీ రెసిడెన్షియల్‌ కాలేజీ జేఎల్‌ పోస్టులు: 10
  • ఏపీ రెసిడెన్షియల్‌ కాలేజీ డీఎల్‌ పోస్టులు: 5
  • టీటీడీ డీఎల్స్‌, జేఎల్స్‌ పోస్టులు: 78
  • పాలిటెక్నిక్‌ కళాశాలల అధ్యాపకులు-99
  • ఇంగ్లిష్‌ రిపోర్టర్స్‌ (లిమిటెడ్‌) పోస్టులు: 10
  • జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు పోస్టులు: 47
  • అసిస్టెంట్‌ కెమిస్ట్స్‌ ఇన్‌ గ్రౌండ్‌ వాటర్ సర్వీస్‌ పోస్టులు: 1
  • జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌ పోస్టులు: 6
  • అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు: 3
  • అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు: 1
  • టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు: 4
  • సంక్షేమ శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్ పోస్టులు: 2
  • జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ (కేటగిరి 2) పోస్టులు: 1
  • సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ (కేటగిరి 4) పోస్టులు: 4
  • జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ (కేటగిరి 4) పోస్టులు: 6
  • డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ పోస్టులు:38
  • ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్స్‌ పోస్టులు: 4
  • జూనియర్‌ అసిస్టెంట్‌ (జైళ్లు) పోస్టులు: 1

ఈ మొత్తం 23 నోటిఫికేషన్లు ఏడాది నవంబర్‌ నెలాఖరులోగా వెలువరించనున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యాసంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.