Actress Jeevitha Rajasekhar: సీనియర్‌ నటి జీవిత రాజశేఖర్‌పై ఫిల్మ్‌ బోర్డుకు ఫిర్యాదు.. ‘నాకు ఆపార్టీతో ఏ సంబంధం లేదు’

సీనియర్‌ నటి జీవిత రాజశేఖర్‌పై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్‌ సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆమెను తాత్కాలికంగా సెన్సార్ ఆర్‌సీ సభ్యత్వం నుంచి తొలగించాలంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘వ్యూహం’ సినిమాను సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ రిజెక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సెన్సార్ ఆర్‌సీకి ఈ సినిమాను రిఫర్‌ చేశారు. అక్కడ సెన్సార్‌ ఆర్‌సీలో సభ్యులుగా కొనసాగుతోన్న సీనియర్‌ నటి జీవిత రాజశేఖర్‌ వైసీపీ నేత అని, ఆమె గనుక..

Actress Jeevitha Rajasekhar: సీనియర్‌ నటి జీవిత రాజశేఖర్‌పై ఫిల్మ్‌ బోర్డుకు ఫిర్యాదు.. 'నాకు ఆపార్టీతో ఏ సంబంధం లేదు'
Actress Jeevitha Rajasekhar
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 03, 2023 | 7:44 AM

హైదరాబాద్‌, నవంబర్ 3: సీనియర్‌ నటి జీవిత రాజశేఖర్‌పై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్‌ సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆమెను తాత్కాలికంగా సెన్సార్ ఆర్‌సీ సభ్యత్వం నుంచి తొలగించాలంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘వ్యూహం’ సినిమాను సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ రిజెక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సెన్సార్ ఆర్‌సీకి ఈ సినిమాను రిఫర్‌ చేశారు. అక్కడ సెన్సార్‌ ఆర్‌సీలో సభ్యులుగా కొనసాగుతోన్న సీనియర్‌ నటి జీవిత రాజశేఖర్‌ వైసీపీ నేత అని, ఆమె గనుక అక్కడ ఉంటే ఈ సినిమాకు పారదర్శకంగా సెన్సార్‌ జరగదని, అందుకే ఆమెను ఈ సినిమా వరకు తాత్కాలికంగా సభ్యత్వం నుంచి తొలగించాలంటూ నిర్మాత నట్టి కుమార్‌ సెంట్రల్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘వ్యూహం’. ఈ సినిమా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం ఏపీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు వర్మ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు పూర్తిగా అనుకూలంగా, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను వ్యంగ్యంగా చూపిస్తూ ఈ సినిమాను రూపొందించారు. అందులోని పాత్రలను వారి పోలికలకు దగ్గరగా ఉన్న నటీనటులను ఎంపిక చేసుకుని, ఈ సినిమాలో వారి పాత్రలను వ్యంగ్యంగా చూపించారు. ఈ విషయం తాజాగా విడుదలైన వ్యూహం సినిమా టీజర్‌ చూస్తే  తెలుస్తుంది.

ఈ నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సినిమాను సెన్సార్ కోసం పంపించగా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించింది. దీంతో ఈ సినిమాను సెన్సార్ ఆర్‌సీకి రిఫర్‌ చేశారు. దీనిపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్‌ అభ్యంతరం తెలుపుతూ సెన్సార్‌ బోర్డుకు ఫిర్యాదు చేశాడు. ‘వ్యూహం సినిమా పూర్తిగా తెలుగు పొలిటికల్‌ ఫీచర్‌ సినిమా అని. ప్రస్తుతం తెలంగాణతోపాటు 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను విడుదల చేసినట్లయితే శాంతి భధ్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని ఎదురవుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా ప్రస్తుతం సెన్సార్‌ ఆర్‌సీకి ఈ సినిమాను రిఫర్‌ చేశారు. అక్కడ సభ్యురాలిగా కొనసాగుతోన్న నటి జీవితరాజశేఖర్‌ ఈ సినిమాకు సెన్సార్ చేయడానికి వీలులేకుండా సెన్సార్‌ ఆర్సీ తప్పించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. జీవిత రాజశేఖర్ వైసీపీ నేత అయినందు వల్ల ఈ సినిమాకు పారదర్శకంగా సెన్సార్ చేసే అవకాశం ఉండదని, పైగా ఆమె ఆర్‌జీవీ మంచి స్నేహితురాలని ఈ విషయాలన్నీ పరిగణనలోని తీసుకుని ఆమెను తప్పించాలని’ తన ఫిర్యాదులో నిర్మాత నట్టి కుమార్‌ వివరించారు. దీనిపై నటి జీవితా రాజశేఖర్‌ స్పందించారు. ప్రస్తుతం తాను బీజేపీలో ఉన్నానని, గతంలో వైసీపీలోపనిచేసిన సంగతి వాస్తవమేనని, అయితే ప్రస్తుతం ఆ పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవన్నారు. వ్యూహం సినిమా ఆర్సీకి వచ్చినప్పుడు అన్ని సినిమాలు చూసినట్టుగానే ఆ సినిమాను కూడా చూస్తానన్నారు. ఇప్పటి వరకైతే తనకు ఆఫీస్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని జీవిత అన్నారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..