Online Shopping: ఆన్ లైన్లో షాపింగ్ చేసేవారే స్కామర్ల టార్గెట్.. ఇవి పాటించకపోతే చాలా నష్టపోతారు..

ఈ-కామర్స్ ప్లాట్ ఫారాలు అన్నీ పలు ఫెస్టివల్ ఆఫర్లు ప్రకటిస్తుడటంతో ఎక్కువ వాటిల్లో కొనుగోళ్లు చేస్తున్నారు. అయితే ఇదే ఆన్ లైన్ స్కామర్లకు వరంలా మారింది. సులువుగా మోసం చేసేందుకు, వినియోగదారుల పర్సు ఖాళీ చేసేందుకు అవకాశం ఏర్పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఆన్ లైన్లో షాపింగ్ చేసేటప్పుడు కొన్ని సేఫ్టీ టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Online Shopping: ఆన్ లైన్లో షాపింగ్ చేసేవారే స్కామర్ల టార్గెట్.. ఇవి పాటించకపోతే చాలా నష్టపోతారు..
Online Shopping
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Nov 06, 2023 | 10:50 PM

పండుగలు, సెలవులు ఎక్కువగా వచ్చినప్పుడు సాధారణంగా మార్కెట్ కు జోష్ వస్తుంది. ఎందుకంటే ఆ సమయంలోనే అందరూ ఎక్కువగా షాపింగ్ లు చేస్తుంటారు. అది ఆన్లైన్ అయినా, ఆఫ్ లైన్ అయినా కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా అందరూ ఆన్ లైన్ బాట పడుతున్నారు. అందులోనూ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారాలు అన్నీ పలు ఫెస్టివల్ ఆఫర్లు ప్రకటిస్తుడటంతో ఎక్కువ వాటిల్లో కొనుగోళ్లు చేస్తున్నారు. అయితే ఇదే ఆన్ లైన్ స్కామర్లకు వరంలా మారింది. సులువుగా మోసం చేసేందుకు, వినియోగదారుల పర్సు ఖాళీ చేసేందుకు అవకాశం ఏర్పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఆన్ లైన్లో షాపింగ్ చేసేటప్పుడు కొన్ని సేఫ్టీ టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి క్రమం తప్పకుండా పాటిస్తే ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..

నార్టన్స్ నివేదిక ప్రకారం..

నార్టన్స్ హాలీడే సైబర్ సేఫ్టీ ఇన్ సైట్స్ అనే సంస్థ హాలిడే సీజన్లో డిజిటల్ భద్రతకు సంబంధించి వినియోగదారుల అనుభవాలు, వారు అనుసరిస్తున్న విధానాలను విశ్లేషిస్తుంది. ఆ సంస్థ అందించిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 98% మంది వినియోగదారులు తమ హాలిడే షాపింగ్‌లో కొంత భాగాన్ని ఆన్‌లైన్‌లో చేయాలనే యోచనలో ఉన్నారు. అయితే వీరిలో సగం కంటే ఎక్కువ మంది (56%) సైబర్‌క్రైమ్, ఏఐ షాపింగ్ స్కామ్‌లు లేదా థర్డ్-పార్టీ రిటైలర్‌ల బారిన పడటం గురించి ఇంకా ఆందోళన చెందుతున్నారని వివరించింది.

వీటి ద్వారానే స్కామర్ల దందా..

సైబర్ నేరగాళ్లు ప్రధానంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు (41%), థర్డ్-పార్టీ వెబ్‌సైట్‌లు (35%), ఈ-మెయిల్‌లు (32%), ఫోన్ కాల్‌లు (28%), టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా కనెక్ట్ చేయడం(26%) ద్వారా హాలిడే సీజన్‌లో వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నారు. స్కామర్లు చేసే మోసాలు ఆన్‌లైన్ షాపింగ్ స్కామ్‌లు (40%), ఫిషింగ్ స్కామ్‌లు (37%) ఉన్నాయి. ప్రతివాదులు పోస్టల్ డెలివరీ స్కామ్‌లు (31%), గిఫ్ట్ కార్డ్ స్కామ్‌లు (30%) ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

 భద్రతా చిట్కాలు..

ఈ సెలవు సీజన్‌లో సైబర్ నేరాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..

  • గుర్తింపు లేని రిటైలర్ల నుంచి ఎప్పుడూ కొనకండి. తెలియని స్టోర్‌లు, రేటింగ్‌లు, పునఃవిక్రేతల సమీక్షల వివరాలను తనిఖీ చేయండి. మీరు చాలా ఎక్కువ స్టార్ సమీక్షలను చూసినప్పుడు జాగ్రత్తగా ఉండండి.
  • నగదు చెల్లింపు పేజీలు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడంలో సహాయపడేందుకు వెబ్ సైట్లు httpsతో ప్రారంభమవుతున్నాయో లేదో తనిఖీ చేయండి.
  • ఆఫర్లు, డిస్కౌంట్ల విషయమై జాగ్రత్తగా ఉండండి. లేకుంటే నష్టపోయే అవకాశం ఉంది.
  • పబ్లిక్ వైఫై వినియోగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవకాశం ఉన్నంత వరకూ పబ్లిక్ వైఫై ద్వారా ఆన్ లైన్ షాపింగ్ చేయడకపోవడం ఉత్తమం. ఒకవేళ చేయాల్సి వస్తే మీ ఆన్‌లైన్ గోప్యతను, వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్)ని ఉపయోగించండి.
  • షాపింగ్ సైట్‌లు, ఈ-మెయిల్ ఖాతాలు, ఆర్థిక యాప్‌ల కోసం బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను సృష్టించండి.
  • సంభావ్య స్కామ్‌లను రక్షించడంలో మీకు సహాయపడే అలాగే మిమ్మల్ని హెచ్చరించడంలో సహాయపడటానికి ప్రొటెక్టింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడం ఉత్తమం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?