AP Diwali Holidays: ఆంధ్రప్రదేశ్‌ దీపావళి సెలవు తేదీలో మార్పు.. స్కూళ్లకు సెలవులెప్పుడంటే..?

దీపావళి సెలవుల విషయంలో ఏపీ సర్కార్‌ ఈ రోజు కీలక ప్రకటన చేసింది. గతంలో దీపావళి సెలవుగా ప్రకటించిన తేదీని మార్చింది. ఈ మేరకు సెలవు దినాన్ని మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం నవంబర్ 12వ తేదీని దీపావళి సెలవుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ తేదీని మారుస్తూ ప్రకటన వెలువరించింది. తాజా ప్రకటన ప్రకారం దీపావళి సెలవును నవంబర్ 13కు మారుస్తూ సోమవారం (నవంబర్ 6) ఉత్తర్వులు..

AP Diwali Holidays: ఆంధ్రప్రదేశ్‌ దీపావళి సెలవు తేదీలో మార్పు.. స్కూళ్లకు సెలవులెప్పుడంటే..?
AP Diwali Holidays
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 06, 2023 | 7:03 PM

అమరావతి, నవంబర్‌ 6: దీపావళి సెలవుల విషయంలో ఏపీ సర్కార్‌ ఈ రోజు కీలక ప్రకటన చేసింది. గతంలో దీపావళి సెలవుగా ప్రకటించిన తేదీని మార్చింది. ఈ మేరకు సెలవు దినాన్ని మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం నవంబర్ 12వ తేదీని దీపావళి సెలవుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ తేదీని మారుస్తూ ప్రకటన వెలువరించింది. తాజా ప్రకటన ప్రకారం దీపావళి సెలవును నవంబర్ 13కు మారుస్తూ సోమవారం (నవంబర్ 6) ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు మార్చిన సెలవు దినాన్ని పాఠశాలలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, సంస్ధలు, ప్రైవేటు సంస్ధలకు కూడా దీన్ని అమలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏటా ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే సాధారణ సెలవుల జాబితాను అంతకు ముందు సంవత్సరం డిసెంబర్‌లోనే ప్రకటిస్తుంది. ఈ జాబితా ప్రకారం నవంబర్ 12నే దీపావళి సెలవు కూడా ఇచ్చారు. ఈ మేరకు అప్పట్లో ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే తాజాగా పండితుల సలహా మేరకు సెలవు దినాన్ని మార్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు నవంబర్ 13వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను సవరించింది. దీంతో నవంబర్ 13వ తేదీని ఉద్యోగులతో పాటు ఆఫీసులు, వ్యాపార సంస్ధలు పాఠశాలలకు కూడా నెగోషియబుల్ చట్టం కింద ఈ సెలవు వర్తించబోతోంది. నవంబర్‌ 13వ తేదీన (సోమవారం) ఆప్షనల్ హాలిడే బదులుగా సాధారణ సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేర‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీల‌క ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌, కాలేజీల‌కు రెండో శనివారం (నవంబర్‌ 11), ఆదివారం (నవంబర్‌ 12) ఆ మరుసటి రోజు సోమ‌వారం (నవంబర్‌ 13)తో కలుపుకుని వ‌రుసగా 3 రోజులు పాటు సెల‌వులు రానున్నాయి. కాగా ప్రతీ ఏటా దీపావళి సెలవును (తిథి ద్వయం నాడు) తిధుల ఆధారంగా నిర్ణయిస్తుంటారనే విషయం తెలిసిందే. ఈసారి కూడా ప్రభుత్వానికి వచ్చిన సలహాలు, వినతుల మేరకు దీపావళి సెలవు దినాన్ని మార్చినట్లు తెలుస్తోంది. దీంతో సాధారణ పరిపాలన శాఖ సీఎస్ జవహర్ రెడ్డి తాజా సెలవు ఉత్తర్వులను విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ‌లో దీపావళి సెలవులు ఎప్పుడంటే..

తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దీపావళి సెలవుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణలో కూడా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌, కాలేజీల‌కు కూడా అక్టోబ‌ర్ 13వ తేదీకి (సోమ‌వారం) సెల‌వు ఇచ్చే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం. అయితే తెలంగాణ ప్రభుత్వం దీనిపై అధికారికంగా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీపావళి పండుగకు ఆశ్వయుజ బహుళ చతుర్ధశి, అర్దరాత్రి అమావాస్య ప్రామాణికం. ఈ సారి చతుర్ధశి నవంబర్‌ 12 (ఆదివారం) మధ్యాహ్నం 1.53 నిమిషాల వరకు ఉంటుంది. రాత్రి అమావాస్య ఉంటుంది దీపావళి పండుగ నవంబర్‌ 12వ తేదీనే జరుపుకోవాలని పంచాగకర్తలు చెబుతున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.