Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIESC Meet: ఆస్ట్రేలియా-ఇండియా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు..

Australia India Education and Skills Council meeting: ఆస్ట్రేలియా-ఇండియా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ కౌన్సిల్ (AIESC) తొలి సమావేశం గుజరాత్‌లోని ఐఐటీ గాంధీనగర్‌లో ప్రారంభమైంది. ఆస్ట్రేలియా-ఇండియా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ కౌన్సిల్ సమావేశాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆస్ట్రేలియన్ విద్యా మంత్రి జేసన్ క్లేర్ ఐఐటీ గాంధీనగర్‌లో ప్రారంభించారు.

AIESC Meet: ఆస్ట్రేలియా-ఇండియా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు..
Dharmendra Pradhan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 06, 2023 | 2:05 PM

Australia India Education and Skills Council meeting: ఆస్ట్రేలియా-ఇండియా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ కౌన్సిల్ (AIESC) తొలి సమావేశం గుజరాత్‌లోని ఐఐటీ గాంధీనగర్‌లో ప్రారంభమైంది. ఆస్ట్రేలియా-ఇండియా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ కౌన్సిల్ సమావేశాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆస్ట్రేలియన్ విద్యా మంత్రి జేసన్ క్లేర్ ఐఐటీ గాంధీనగర్‌లో ప్రారంభించారు. ఆస్ట్రేలియన్ ఇండియా ఎడ్యుకేషన్ కౌన్సిల్ (AIEC) సమావేశం.. రెండు దేశాల మధ్య విద్య, శిక్షణ, పరిశోధన భాగస్వామ్యాల అంశంలో వ్యూహాత్మక దిశలో మార్గనిర్దేశం చేయడానికి 2011లో స్థాపించిన ద్వి-జాతీయ సంస్థ. ఈ సమావేశం అంతర్జాతీయీకరణ, టూ-వే మొబిలిటీ, విద్య, నైపుణ్యం, ఉపాధి, పర్యావరణ వ్యవస్థలో సహకారాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించడానికి రెండు దేశాల జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాయి. అంతేకాకుండా ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు దోహదపడుతుంది. ఆస్ట్రేలియా-ఇండియా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ కౌన్సిల్ (AIESC) తొలి సమావేశానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆస్ట్రేలియా విద్యా మంత్రి జాసన్ క్లేర్, ఆస్ట్రేలియా నైపుణ్యం, శిక్షణా శాఖ మంత్రి బ్రెండన్ ఓ’కానర్ సహ-అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆస్ట్రేలియన్ ఇండియా ఎడ్యుకేషన్ కౌన్సిల్ (AIEC), రెండు దేశాల మధ్య విద్య, శిక్షణను ప్రోత్సహించడానికి నిర్వహించారు.

తొలిసారిగా ఏఐఈఎస్సీ సమావేశం..

విద్య, నైపుణ్యాలను ఒకే సంస్థాగత వేదిక కిందకు తీసుకురావడం ఇదే తొలిసారి. ఈ పర్యటన విద్య.. నైపుణ్యాల రంగంలో పరస్పర ఆసక్తి ఉన్న ముఖ్యమైన రంగాలలో సహకారం, భాగస్వామ్యం.. సినర్జీని ప్రోత్సహించాలని భావిస్తున్నారు. సమావేశం ప్రారంభలో ఆస్ట్రేలియా-భారత విద్యా, నైపుణ్యాల మండలి సమావేశం ఫలితాలపై సంయుక్త మంత్రివర్గం మీడియాతో మాట్లాడారు. అంతకుముందు ఆస్ట్రేలియా మంత్రులకు ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతం పలికారు.

తరచుగా జరిగే ఈ సమావేశాలు భారతదేశం-ఆస్ట్రేలియా భాగస్వామ్యం, పెరుగుతున్న బలం, చైతన్యానికి నిదర్శనం. ఇటీవలి సమావేశాలలో అలాగే ఇతర ఆస్ట్రేలియన్ మంత్రులతో సమావేశాల సమయంలో గుర్తించిన సమస్యలపై, ప్రత్యేకించి అర్హతల పరస్పర గుర్తింపు, జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, జాయింట్ స్కిల్ సహకారాలు, జాయింట్ డిగ్రీల కోసం HEIల మధ్య సహకారంపై స్థిరమైన పురోగతిని సాధించినందుకు సంతోషిస్తున్నామంటూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించడం.. ECCEలో సహకారాలు, భారతదేశంలో అధ్యయనం, భారతదేశ విద్య అంతర్జాతీయీకరణ, భారతీయ విద్యార్థులు.. పరిశోధనా స్కాలర్‌లకు వీసా సంబంధిత సమస్యలు మొదలైన అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా విద్య, నైపుణ్యతలో ద్వైపాక్షిక సహకారాన్ని సమగ్రంగా సమీక్షించామని.. మా రెండు దేశాలలో ప్రజల చైతన్యం, ఉపాధి, శ్రేయస్సు కోసం జ్ఞానం.. నైపుణ్య భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయడానికి అంగీకరించామంటూ ధర్మంద్ర ప్రధాన్ తెలిపారు.

AIESC సమావేశం ఉద్దేశ్యం ముఖ్యమైన అంశాలను గుర్తించడం.. శిక్షణ ఇవ్వడం లాంటివి ఉన్నాయి. ఇందులో క్రియేటివ్ లెర్నింగ్ సెంటర్, ఐఐటీ గాంధీనగర్‌ను సందర్శించడం కూడా ఉంది. ఇది పరికరాల తయారీ, STEM కళలు, బొమ్మలు, సైన్స్ కేంద్రాల స్థాపన, ప్రయోగశాల పనులపై దృష్టి సారించే ఆలోచనలను వ్యాప్తి చేయడం ద్వారా విద్యార్థులు.. ఉపాధ్యాయులలో శాస్త్రీయ స్వభావాన్ని.. స్వాభావిక సృజనాత్మకతను ప్రోత్సహించడంలో పని చేస్తుంది. రెండు దేశాల మంత్రులు పండిట్ దీనదయాళ్ ఉర్జా విశ్వవిద్యాలయం (PDDU), విద్యా సమీక్షా కేంద్రాన్ని (VSK) కూడా సందర్శిస్తారు. జాతీయ విద్యా విధానం 2020 (NEP 2020) లక్ష్యాలను చేరుకోవడానికి, అకడమిక్ మరియు నాన్-అకడమిక్ కార్యకలాపాల కోసం పరస్పర సహకారంపై చర్చించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..