Bengaluru: మహిళ అధికారిని హత్య కేసును ఛేదించిన పోలీసులు..నిందితుడు అరెస్ట్.. ట్విస్ట్ ఏంటంటే..
45 ఏళ్ల ప్రతిమ తన నివాసంలో కత్తితో పొడిచి హత్యకు గురైన విషయం తెలిసిందే. బెంగళూరులోని సుబ్రమణపోరా ప్రాంతంలోని ఇంట్లో 45 ఏళ్ల ప్రతిమ, ఆమె కుటుంబం గత ఎనిమిదేళ్లుగా నివసిస్తున్నారు. గనులు, భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రతిమ భర్త, కుమారుడు శనివారం ఇంట్లో లేరు. మహిళా అధికారిని హత్య జరిగిన సమయంలో ఆమె భర్త, కుమారుడు బెంగళూరుకు 300 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉన్నారు. ఆమె శివమొగ్గలో ఎంఎస్సీ డిగ్రీ పూర్తి చేసి, గత ఏడాదిన్నరగా బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది.
బెంగళూరులో కర్నాటక ప్రభుత్వ మైనింగ్ అండ్ జియాలజీ డిపార్ట్‌మెంట్ అధికారి ప్రతిమ కెఎస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆమెను తన ఇంట్లోనే గొంతు కోసి హత్య చేశారు దుండగులు. రక్తపు మడుగులో పడివున్న ఆమె మృతదేహాన్ని చూసిన తన సోదరుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించటంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, బెంగళూరులో ప్రభుత్వ మహిళా అధికారిని హత్య కేసులో మాజీ డ్రైవర్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. అధికారి మాజీ డ్రైవర్‌గా ఉన్న కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, పది రోజుల క్రితం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించినందుకు ప్రతీకారంగానే కిరణ్ హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రతిమ భర్త, పిల్లలు ఇంట్లో లేని సమయం చూసి ప్రతిమను హత్య చేసినట్టుగా కిరణ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. హత్యానంతరం తాను బెంగళూరు నుంచి పరారైనట్టుగా చెప్పాడు. ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిరణ్‌ను చామరాజనగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.
అధికారిణి ప్రతిమ కేఎస్ హత్యకేసులో కాంట్రాక్ట్ డ్రైవర్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా… తాను గత ఐదేళ్లుగా కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్నానని, అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించడంతో అధికారిని హత్య చేసినట్లు డ్రైవర్ అంగీకరించాడు. నిందితుడు కిరణ్ కర్నాటక ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగి అని, కొద్ది రోజుల క్రితం ప్రతిమ అతన్ని సర్వీస్ నుండి తొలగించినట్లు పోలీసులు తెలిపారు. సర్వీస్ నుంచి తొలగించిన తర్వాత ప్రతిమపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుని అధికారిని హత్య చేసి చామరాజ్‌నగర్‌కు పారిపోయాడు. ఈ నిందితుడిని చామరాజ్‌నగర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని, ఉద్యోగం నుంచి తొలగించినందుకు కోపంతోనే ప్రతిమను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
45 ఏళ్ల ప్రతిమ తన నివాసంలో కత్తితో పొడిచి హత్యకు గురైన విషయం తెలిసిందే. బెంగళూరులోని సుబ్రమణపోరా ప్రాంతంలోని ఇంట్లో 45 ఏళ్ల ప్రతిమ, ఆమె కుటుంబం గత ఎనిమిదేళ్లుగా నివసిస్తున్నారు. గనులు, భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రతిమ భర్త, కుమారుడు శనివారం ఇంట్లో లేరు. మహిళా అధికారిని హత్య జరిగిన సమయంలో ఆమె భర్త, కుమారుడు బెంగళూరుకు 300 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉన్నారు. ఆమె శివమొగ్గలో ఎంఎస్సీ డిగ్రీ పూర్తి చేసి, గత ఏడాదిన్నరగా బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి హత్యపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి స్పందిచారు. అధికారి హత్యపై ముమ్మర దర్యాప్తు, విచారణ వేగ వంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..