Vitamin C Deficiency: శరీరంలో ‘విటమిన్-సి’ లోపిస్తే వ్యాధుల తిష్టే..! ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు విస్మరించకండి..

హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి మన శరీరాన్ని రక్షిస్తుంది. ఇంకా, కణజాలం, అవయవాలను కలిపి ఉంచే కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఉత్పత్తికి ఇది చాలా అవసరం. కాబట్టి శరీరానికి అవసరమైన ఈ పోషకం లేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది..అన్ని ఇతర పోషకాల మాదిరిగానే, మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ సి చాలా అవసరం. శరీరంలో విటమిన్ సి లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

Vitamin C Deficiency: శరీరంలో ‘విటమిన్-సి’ లోపిస్తే వ్యాధుల తిష్టే..! ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు విస్మరించకండి..
Follow us

|

Updated on: Nov 06, 2023 | 12:02 PM

విటమిన్ సి లోపం: మంచి ఆరోగ్యానికి శరీరానికి సరైన మోతాదులో పోషకాలు అవసరం. శరీరంలో ఏ పోషకం లోపం ఏర్పడినా కూడా అనేక రోగాలను ఆహ్వానిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలలో విటమిన్ సి చాలా ముఖ్యమైన పోషకం. విటమిన్ సి అనేది మన శరీరం ఇనుమును గ్రహించడంలో సహాయపడే ఒక ముఖ్యమైన పోషకం. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి మన శరీరాన్ని రక్షిస్తుంది. ఇంకా, కణజాలం, అవయవాలను కలిపి ఉంచే కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఉత్పత్తికి ఇది చాలా అవసరం. కాబట్టి శరీరానికి అవసరమైన ఈ పోషకం లేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది..అన్ని ఇతర పోషకాల మాదిరిగానే, మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ సి చాలా అవసరం. శరీరంలో విటమిన్ సి లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, మన శరీరంలో కనిపించే కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యలు విటమిన్ సి లోపం లక్షణాలు కూడా కావచ్చు . వీటిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. శరీరంలో విటమిన్ సి లోపంతో కనిపించే ఈ లక్షణాలను విస్మరించకూడదు..

అలసట- బలహీనత:

ఇవి కూడా చదవండి

మీరు తరచుగా చాలా అలసటగా, బలహీనంగా ఉంటుంటే.. ఇది కూడా విటమిన్ సి లోపం లక్షణం. నిజానికి, విటమిన్ సి అనేది మన శరీరం శక్తిని ఉత్పత్తి చేయడానికి సహాయపడే ఒక పోషకం.

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ:

మీరు తరచుగా జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లకు గురవుతుంటే, అది కూడా విటమిన్ సి లోపం లక్షణమని గుర్తుంచుకోండి. శరీరంలో విటమిన్ సి లేనప్పుడు, ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది.

డ్రై స్కిన్:

ముందుగా చెప్పినట్లు, శరీరానికి అవసరమైన ప్రొటీన్ అయిన కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి అవసరం. ఇది ఆరోగ్యకరమైన చర్మానికి మద్దతు ఇస్తుంది. అయితే విటమిన్ సి లోపం వల్ల శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది పొడి చర్మం సమస్యను పెంచుతుంది. చర్మంపై ముడతలు లేదా యవ్వనంలోనే వృద్ధాప్య సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి.

కీళ్ల నొప్పులు:

విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. ఇది మన శరీరం మంటతో పోరాడటానికి సహాయపడుతుంది. అయితే, విటమిన్ సి లోపం ఉన్నప్పుడు, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌