Watch Video: నిర్మాణంలో ఉన్న రోడ్డును దొంగిలించిన గ్రామస్థులు.. కాంట్రాక్టర్‌కు కళ్లు బైర్లు కమ్ముతున్నాయ్‌…వీడియో చూడండి!

అప్పుడే వేసిన సిమెంట్‌ కాంక్రీట్‌ పలుచగా మారటంతో పారాలు, గంపలతో ఎత్తుకుని తమ ఇళ్లకు తీసుకెళ్లడం మొదలుపెట్టారు. అందరూ చూస్తుండగానే కొత్తగా వేసిన కాంక్రీటు రోడ్డు మొత్తాన్ని ఖాళీ చేశారు గ్రామస్తులు. సుమారు రెండు గంటల తర్వాత కాంట్రాక్టర్ రోడ్డు పరిస్థితి చూసేందుకు వచ్చాడు.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు.. బిత్తరపోయిన ముఖంతో బిక్కుబిక్కుమంటూ నిల్చున్నాడు. రోడ్డు మొత్తాన్ని గ్రామస్తులు దొంగిలించారని గమనించాడు. కానీ, చేసేది లేక చేతులు కట్టుకుని తిరుగు బాటపట్టాడు.

Watch Video: నిర్మాణంలో ఉన్న రోడ్డును దొంగిలించిన గ్రామస్థులు.. కాంట్రాక్టర్‌కు కళ్లు బైర్లు కమ్ముతున్నాయ్‌...వీడియో చూడండి!
Stealing Road
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 06, 2023 | 11:10 AM

దొంగతనాలకు సంబంధించిన అనేక సంఘటనలు మనం ప్రతినిత్యం మీడియా, సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటాం.. కొన్నిసార్లు దొంగతనాలకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన సంఘటనలు, షాకింగ్‌ విషయాలను మనం అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. అవి కూడా కొన్నిసార్లు వీడియోల ద్వారా చూస్తుంటాం. ఇలాంటి ఘటనల్లో దొంగలు ఎంత తెలివిగా తమ పనిని పూర్తి చేస్తారో మీరు కూడా చూసే ఉంటారు. ఒక్కోసారి ఇలాంటి చోరీ ఘటన చూసినప్పుడు మన కళ్లను మనమే నమ్మలేక పోతుంటాం.. అలాంటి చోరి ఘటనే ఇక్కడ కూడా జరిగింది. నిర్మాణంలో ఉన్న రోడ్డునే గ్రామస్తులు దొంగిలించిన షాకింగ్‌ చోరీ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వినడానికి వింతగా అనిపించినప్పటికీ… ఈ దోపిడీ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన బీహార్‌లోని జెహనాబాద్‌లో జరిగినట్టుగా తెలుస్తోంది.

ఇక్కడ చెప్పుకుంటున్న ఈ వీడియోలో కూలీలు రోడ్డును నిర్మిస్తుండగా గ్రామస్థులు దాన్ని దొంగిలించడం కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతసేపటి తర్వాత రోడ్డు కాంట్రాక్టర్‌ అక్కడికి చేరుకోగా ఆ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు . ఇదంతా వీడియో తీసని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది కాస్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మీడియా కథనాల ప్రకారం, జహానాబాద్‌లోని మఖద్దుంపూర్‌లోని ఔదానా భేగా గ్రామంలో ముఖ్యమంత్రి గ్రామ సడక్ యోజన కింద రహదారి నిర్మాణం జరగాల్సి ఉంది. అనుమతి లభించడంతో గ్రామంలో కాంక్రీట్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. గ్రామంలో కాంక్రీటు ఏయే భాగాల్లో వేయాలో ఆ ప్రాంతాన్ని గుర్తించారు. కాంట్రాక్టర్ సమక్షంలో ఆ స్థలాల్లో కాంక్రీట్ వేసే పనులు ప్రారంభించారు. అతి తక్కువ సమయంలోనే పూర్తి కాంక్రీట్ రోడ్డు సిద్ధం చేశారు. రోడ్డు నిర్మాణం అనంతరం కార్మికులు, కాంట్రాక్టర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత జరిగిన రోడ్డు లూటీ చూస్తే మీరు కూడా షాక్ అవుతారు.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో గ్రామస్తులు ముందుగా కొత్తగా వేసిన రోడ్డుపై నీటిని చల్లారు.. దాంతో అప్పుడే వేసిన సిమెంట్‌ కాంక్రీట్‌ పలుచగా మారటంతో పారాలు, గంపలతో ఎత్తుకుని తమ ఇళ్లకు తీసుకెళ్లడం మొదలుపెట్టారు. అందరూ చూస్తుండగానే కొత్తగా వేసిన కాంక్రీటు రోడ్డు మొత్తాన్ని ఖాళీ చేశారు గ్రామస్తులు. సుమారు రెండు గంటల తర్వాత కాంట్రాక్టర్ రోడ్డు పరిస్థితి చూసేందుకు వచ్చాడు.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు.. బిత్తరపోయిన ముఖంతో బిక్కుబిక్కుమంటూ నిల్చున్నాడు. రోడ్డు మొత్తాన్ని గ్రామస్తులు దొంగిలించారని గమనించాడు. కానీ, చేసేది లేక చేతులు కట్టుకుని తిరుగు బాటపట్టాడు.

ఈ రోడ్డు చోరీ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లోని పలు ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. @UtkarshSingh_ హ్యాండిల్ ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో వీడియో షేర్ చేయబడింది. దుమ్ములేపుతూ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్