మీరు గీజర్‌ ఆన్‌ చేసి బాత్రూంలోకి వెళ్తున్నారా..? ఒక్క క్షణం ఆగి ఈ వీడియో చూడండి..

స్నానానికి వెళ్ళే ముందు గీజర్‌ స్విచ్‌ ఆఫ్ చేయటం మంచిదని చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల పేలుడు ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడుతుంది. వైరల్‌ వీడియోలో భారీ శబ్ధంతో గీజర్ ఒక్కసారిగా పేలి మంటలు, వేడినీరు ఎలా వ్యాపించాయో వీడియోలో చూడవచ్చు. శీతాకాలంలో షేర్ చేయబడిన ఈ వీడియో చాలా మందిని హెచ్చరించడానికి షేర్ చేయబడింది. ఇంట్లో గీజర్లువాడే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉంది..

మీరు గీజర్‌ ఆన్‌ చేసి బాత్రూంలోకి వెళ్తున్నారా..? ఒక్క క్షణం ఆగి ఈ వీడియో చూడండి..
Geyser Explosion
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 06, 2023 | 8:56 AM

శీతాకాలం ఇప్పుడే వచ్చింది. దేశవ్యాప్తంగా చలి తీవ్రత మెల్లిమెల్లిగా పెరుగుతోంది. నవంబర్ నెల సగం తర్వాత దేశంలోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. చాలా మంది ఈ చలిలో స్నానం చేయడం తగ్గిస్తారు. ఈ చలిలో స్నానం చేయడానికి సాహసించే వారు కూడా ఉంటారు. గతంలో చాలా మంది గ్యాస్ స్టవ్ మీద నీటిని వేడి చేసేవారు. దీని తర్వాత వాటర్‌ హీటర్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు చాలా ఇళ్లలో గీజర్లను అమర్చారు. కానీ, పూర్తి చలికాలం రాకముందే సోషల్‌ మీడియాలో గీజర్లకు సంబందించిన భయానక వీడియోలు కనిపించడం ప్రారంభించాయి. తాజాగా మరో వీడియోలో గీజర్‌లో పేలుడు జరిగిన ఘటన ఒకటి బయటకు వచ్చింది. వీడియోలో గీజర్‌ను ఆన్ చేసి బాత్రూంలోకి ప్రవేశించిన వెంటనే మంటలు ఎలా చెలరేగాయో చూపించే దృశ్యాలను ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.

ఓ అమ్మాయి తన ఇంట్లో జరిగిన గీజర్ ప్రమాదానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తమ ఇంట్లోని బాత్‌రూమ్‌లో గీజర్‌ ఆన్‌ చేసి స్నానానికి వెళ్తున్నట్టయితే,.. అలా చేయడం మానుకోవాలని బాలిక ఇతరులను హెచ్చరించింది. బాత్రూంలో ఉన్న గీజర్ స్విచ్ ఆన్ చేయగానే చప్పుడుతో ఎలా పేలిపోయిందో బాలిక షేర్‌ చేసిన వీడియోలో చూపించింది. గీజర్‌ పేలుడుతో ప్రమాదంతో మరుగుతున్న వేడి నీరు బాత్‌రూమ్‌ అంతా వ్యాపించింది.

ఇవి కూడా చదవండి

మీరు గీజర్ ఉపయోగిస్తుంటే, బాత్రూమ్‌కి వెళ్లే ముందు స్విచ్ ఆఫ్ చేయండి అని అమ్మాయి చెప్పింది. గీజర్ నీరు కేవలం పది నిమిషాల్లో వేడిగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, లోపలికి వెళ్ళే ముందు నీటిని వేడి చేసుకుని, స్నానానికి వెళ్ళే ముందు గీజర్‌ స్విచ్‌ ఆఫ్ చేయటం మంచిదని చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల పేలుడు ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడుతుంది. వైరల్‌ వీడియోలో భారీ శబ్ధంతో గీజర్ ఒక్కసారిగా పేలి మంటలు, వేడినీరు ఎలా వ్యాపించాయో వీడియోలో చూడవచ్చు. శీతాకాలంలో షేర్ చేయబడిన ఈ వీడియో చాలా మందిని హెచ్చరించడానికి షేర్ చేయబడింది. ఇంట్లో గీజర్లువాడే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉంది..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!