AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దోస్తీకి నజరానా చిరునవ్వు..! ఇది కదా స్నేహమంటే.. 3 రోజులుగా మిత్రుడు రాలేదని ఏం చేశారో చూడండి..!

వీడియో వైరల్‌ కావటంతో ఇలాంటి స్నేహానికి సంబంధించిన అనేక ఉదాహరణలు ఇస్తున్నారు చాలా మంది నెటిజన్లు. అయితే ఈ వీడియోను ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారనేది మాత్రం ధృవీకరించబడలేదు. కానీ, ఈ పోస్ట్‌కు మాత్రం ఇప్పటికే 4 లక్షలకు పైగా వీక్షణలు,వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. అలాగే వందలాది మంది కామెంట్లు కూడా చేశారు. ఇక్కడ కొందరు స్నేహితులు చేసిన పని మాత్రం నెక్ట్స్‌ లెవల్‌ అని చెప్పాలి. ఎందుకంటే..ఇక్కడ కొందరు ఫ్రెండ్స్‌ టీం అంతా కలిసి..

దోస్తీకి నజరానా చిరునవ్వు..! ఇది కదా స్నేహమంటే.. 3 రోజులుగా మిత్రుడు రాలేదని ఏం చేశారో చూడండి..!
Friends
Jyothi Gadda
|

Updated on: Nov 05, 2023 | 10:03 PM

Share

స్నేహితులు ఏదైనా చేయగలరు. నీడలా మన వెంటే ఉంటూ మన కష్ట సుఖాలను అర్థం చేసుకుని ఆసరాగా నిలుస్తుంటారు. దోస్తులు మనల్ని మస్తీ చేయగలరు. అవసర సమయాల్లో అండగా నిలబడి భరోసా నివ్వగలరు.. ఇక అందరం కలిసి సంతోషంగా ఉన్న సమయంలో వాళ్లు చేసే జోకులు, వేసే పంచ్‌ల సంగతి ఇక ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఇక్కడ కొందరు స్నేహితులు చేసిన పని మాత్రం నెక్ట్స్‌ లెవల్‌ అని చెప్పాలి. ఎందుకంటే..ఇక్కడ కొందరు ఫ్రెండ్స్‌ టీం అంతా కలిసి తమలోని ఒక స్నేహితుడి ఇంటికి పెళ్లి ఊరేగింపుతో బయల్దేరి వచ్చారు. బ్యాండ్‌ బాజాలతో ఫ్రెండ్స్‌ అంతా కలిసి తమ మిత్రుడిని కలవటానికి ఇంటికి వచ్చారు. కానీ, ఇది పెళ్లి ఊరేగింపు కాదండోయ్‌.. ఎందుకో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.. ఇలాంటి స్నేహితులు కూడా ఉంటారా..? అంటూ అవాక్కవ్వాల్సిందే..

ఎంతో అదృష్టవంతులైతే.. ఇంత మంచి మిత్రులు దొరుకుతారు..కొంతమంది స్నేహితులు మనల్ని తప్పుడు మార్గంలోకి తోసేస్తుంటారు. కానీ, మంచితనం, నిజాయితీ కలిగిన స్నేహితులు మనల్ని ఎల్లప్పుడూ సరైన మార్గంలో నడిపిస్తుంటారు. మన సంతోషం కోసం ఏదైనా చేస్తుంటారు.. అలాంటి ఘటనకు సంబంధించినదే ఈ వీడియో కూడా. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక స్నేహితుడి కోసం మిగతా ఫ్రెండ్స్‌ అంతా కలిసి ఎవరూ ఊహించని పని చేశారు. కొద్ది రోజులుగా తమకు దూరంగా ఉంటున్న మిత్రుడిని కలవటం కోసం ఇలాంటి వెరైటీ ప్లాన్‌ చేశారు. దాంతో వారు చేసిన పని ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తుంది.

ఇవి కూడా చదవండి

అసలు విషయం ఏంటంటే.. నిజానికి ఈ స్నేహితులంతా కలిసి ప్రతి రోజూ మార్నింగ్ వాక్ కి వెళ్లేవారట. అయితే, వీరిలో ఒక మిత్రుడు మాత్రం గత మూడు రోజులుగా రావడం లేదు. ఎవరినీ కలవటం లేదట. దాంతో వీళ్లంతా కలిసి అతనిని నిద్రలేపడానికి ఇలా బ్యాండ్‌తో అతని ఇంటికి చేరుకున్నారు. ఇది చూసిన ఆ వ్యక్తికి ఏం జరిగిందో అర్థం కాక గందరగోళంలో పడ్డాడు.. ఇంటికి వచ్చిన దోస్తులకు నమస్కారం చేస్తూ తెగ నవ్వుకుంటున్నారు.. ఇదంతా కెమెరాలో బంధించారు. వైరల్ క్లిప్‌లో బ్యాండ్ శబ్దం విన్న తర్వాత ఆ వ్యక్తి తన స్నేహితులను ఆపమని సంకేతిస్తూ చేతులు జోడిస్తున్నాడు. దాంతో ఆ స్నేహితులు కూడా నవ్వుకుంటున్నారు. వారంతా సరదాగా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి ఫన్నీ వీడియోని మీరూ చూసేయండి..

ఈ వీడియోని ఇంటర్‌ నెట్‌లో షేర్‌ చేస్తూ..ఒక వ్యక్తి వివరించాడు.. తన స్నేహితులతో మార్నింగ్‌కు రాని కారణంగానే ఇలా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మూడు రోజులుగా తమతో వెళ్లకపోవడంతో ఉదయం నిద్ర లేపేందుకు స్నేహితుల బృందం సంగీత వాయిద్యాలతో ఆయన ఇంటికి చేరుకుంది. వీడియో వైరల్‌ కావటంతో ఇలాంటి స్నేహానికి సంబంధించిన అనేక ఉదాహరణలు ఇస్తున్నారు చాలా మంది నెటిజన్లు. అయితే ఈ వీడియోను ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారనేది మాత్రం ధృవీకరించబడలేదు. కానీ, ఈ పోస్ట్‌కు మాత్రం ఇప్పటికే 4 లక్షలకు పైగా వీక్షణలు,వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. అలాగే వందలాది మంది కామెంట్లు కూడా చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..