Beauty Tips: ఓట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆరోగ్యమే కాదు.. వావ్‌ అనిపించే సౌందర్యం కూడా మీ సొంతం.. ఇలా ఫేస్‌ప్యాక్స్‌ ట్రై చేయండి..

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి. దీనికి ముందుగా తీసుకున్న ఓట్స్ పౌడర్ ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు కాస్త మందంగా అప్లై చేసుకుని అరగంటపాటు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి.. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే.. మీ ముఖం సహజంగానే కాంతివంతంగా మారుతుంది.

Beauty Tips: ఓట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆరోగ్యమే కాదు.. వావ్‌ అనిపించే సౌందర్యం కూడా మీ సొంతం.. ఇలా ఫేస్‌ప్యాక్స్‌ ట్రై చేయండి..
Beauty Benefits Of Oats
Follow us

|

Updated on: Nov 05, 2023 | 9:53 PM

ఓట్స్ ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు కూడా మేలు చేస్తుంది. ఓట్స్‌లో ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరానికి, చర్మానికి మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ ఇ కూడా ఉంది. ఇది చర్మ ఆరోగ్య ప్రయోజనాలకు అతి ముఖ్యమైన విటమిన్‌. ఇతర తృణధాన్యాలతో పోలిస్తే ఓట్స్‌ అధిక అమైనో ఆమ్లం, సిలికా కంటెంట్‌ను కలిగి ఉంటుంది. విటమిన్ ఇ ఒక యాంటీఆక్సిడెంట్. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి రక్షిస్తుంది. ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది పొడిబారుదనం, దురద చర్మాన్ని దూరంగా ఉంచుతుంది. మీ ముఖంపై ఉన్న ముడతలను తొలగించేందుకు ఓట్ మీల్ ఫేస్ ప్యాక్స్ ప్రయత్నించండి. బెస్ట్‌రిజల్ట్స్‌ని గమనిస్తారు.. ఓట్స్‌మిల్‌ ఫేస్‌ ప్యాక్‌ కోసం ముందుగా..ఒక చిన్న బొప్పాయి ముక్క, రెండు టేబుల్ స్పూన్ల గ్రౌండ్ ఓట్స్, కొంచెం నీరు, ఒక టీస్పూన్ బాదం నూనె వేసి ప్యాక్ తయారు చేయండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల బాగా ఆరనివ్వండి.. ఆ తర్వాత కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మచ్చలు తొలగిపోయి చర్మానికి మంచి మెరుపు వస్తుంది.

1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ ఓట్ మీల్, 1 టేబుల్ స్పూన్ తేనెను రోజ్ వాటర్ తో మిక్స్ చేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని మీ ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఈ ప్యాక్‌ని అన్ని చర్మ రకాల వారు ప్రయత్నించవచ్చు.

2 టేబుల్ స్పూన్ల ఓట్స్ మరియు 3 టేబుల్ స్పూన్ల పాలు మిక్స్ చేసి ప్యాక్ తయారు చేయండి. తర్వాత ఈ ప్యాక్‌ని మీ ముఖం, మెడకు అప్లై చేయండి. ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. డార్క్ స్కిన్, సన్ టాన్స్ తొలగించడానికి ఇది బెస్ట్ ఫేస్‌ ప్యాక్ అని చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

ఒక బౌల్లో రెండు టేబుల్‌ స్పూన్ల ఓట్స్‌ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న కీర దోసకాయ ముక్కలు, పుదీనా ఆకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి. దీనికి ముందుగా తీసుకున్న ఓట్స్ పౌడర్ ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు కాస్త మందంగా అప్లై చేసుకుని అరగంటపాటు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి.. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే.. మీ ముఖం సహజంగానే కాంతివంతంగా మారుతుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

దసరా సెలవులు అప్పటినుంచే.. 2024-25 అకడమిక్ క్యాలెండర్ విడుదల
దసరా సెలవులు అప్పటినుంచే.. 2024-25 అకడమిక్ క్యాలెండర్ విడుదల
ఈ టిప్స్ ట్రై చేస్తే.. ఇంట్లో ఒక్క బల్లి కూడా ఉండదు..
ఈ టిప్స్ ట్రై చేస్తే.. ఇంట్లో ఒక్క బల్లి కూడా ఉండదు..
పోస్ట్ ఆఫీస్‌కు అరుదైన సెక్యూరిటీ గార్డు..!
పోస్ట్ ఆఫీస్‌కు అరుదైన సెక్యూరిటీ గార్డు..!
పేరుకే విడాకులు.. కానీ కలిసే ఉంటున్నారట.! పూజా ఖేద్కర్‌ మోసం.!
పేరుకే విడాకులు.. కానీ కలిసే ఉంటున్నారట.! పూజా ఖేద్కర్‌ మోసం.!
రేయ్ ఎవుర్రా మీరంతా.. ఏంట్రా ఇది..? గుండు చేయించుకునేది ఇలాగా..?
రేయ్ ఎవుర్రా మీరంతా.. ఏంట్రా ఇది..? గుండు చేయించుకునేది ఇలాగా..?
వైజాగ్ జంట వెడ్డింగ్ కార్డు ఐడియా అదుర్స్..అచ్చం ఐఫోన్ మాదిరుందే!
వైజాగ్ జంట వెడ్డింగ్ కార్డు ఐడియా అదుర్స్..అచ్చం ఐఫోన్ మాదిరుందే!
పదవుల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న కొత్త ఎమ్మెల్యేలు..!
పదవుల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న కొత్త ఎమ్మెల్యేలు..!
అమెజాన్‌లో కళ్లు చెదిరే ఆఫర్స్‌-80 శాతం డిస్కౌంట్..ఎప్పుడో తెలుసా
అమెజాన్‌లో కళ్లు చెదిరే ఆఫర్స్‌-80 శాతం డిస్కౌంట్..ఎప్పుడో తెలుసా
ముచ్చటగా మూడో పతకంపై మను బాకర్ కన్ను... తదుపరి ఈవెంట్ ఎప్పుడంటే?
ముచ్చటగా మూడో పతకంపై మను బాకర్ కన్ను... తదుపరి ఈవెంట్ ఎప్పుడంటే?
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా లోకూర్
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా లోకూర్