Asthma Attacks During Diwali: దీపావళి పండుగ సమయంలో ఆస్తమా అటాక్స్ ని ఎలా నివారించాలి?

దీపావళి.. జీవితంలో వెలుగులు నింపే పండుగ. దీపావళి అన్ని వర్గాల వారూ ఎంతో సంబరంగా చేసుకుంటారు. కొంత మంది దీపాలతో దీపావళి చేస్తే.. మరి కొందరు బాణా సంచాతో దీపావళి చేస్తారు. బాణా సంచా కాల్చడం వల్ల వచ్చే కాలుష్యం అంతా ఇంతా కాదు. అది చుట్టు పక్కల ఉన్న గాలిని సైతం కలుషితం చేస్తుంది. ఈ గాలిని పీల్చడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సంవత్సరం దీపావాళి నవంబర్ 12న వచ్చింది. ఈ పండుగ వలన చాలా మంది ఇబ్బందులను..

Asthma Attacks During Diwali: దీపావళి పండుగ సమయంలో ఆస్తమా అటాక్స్ ని ఎలా నివారించాలి?
Asthma Attacks During Diwali
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 05, 2023 | 9:52 PM

దీపావళి.. జీవితంలో వెలుగులు నింపే పండుగ. దీపావళి అన్ని వర్గాల వారూ ఎంతో సంబరంగా చేసుకుంటారు. కొంత మంది దీపాలతో దీపావళి చేస్తే.. మరి కొందరు బాణా సంచాతో దీపావళి చేస్తారు. బాణా సంచా కాల్చడం వల్ల వచ్చే కాలుష్యం అంతా ఇంతా కాదు. అది చుట్టు పక్కల ఉన్న గాలిని సైతం కలుషితం చేస్తుంది. ఈ గాలిని పీల్చడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సంవత్సరం దీపావాళి నవంబర్ 12న వచ్చింది. ఈ పండుగ వలన చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

దీపావళి సమయంలో వాయు కాలుష్యం స్థాయిలు పెరగడం వల్ల ఆస్తమా ఉన్న వారికి.. మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. బాణా సంచా పేల్చినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, మినిట్ పర్టిక్యులేట్ అనే విషపూరితమైన పదార్థాలు విడుదల అవుతాయి. ఈ కాలుష్యమైన గాలిని పీల్చడం వల్ల శ్వాస పరమైన ఇబ్బదులు తలెత్తుతాయి. ఆస్తమా ఉన్న వారికి అయితే మరింత ప్రమాదం. అసలే ప్రస్తుతం శీతాకాలం.. ఈ సమయంలో క్రాకర్స్ కాల్చడం వల్ల గాలి కలుషితం అవుతుంది. ఈ గాలిని పీల్చడం వల్ల శ్వాస కోశ నాళాలను చికాకు పెడతాయి. శ్లేష్మం ఉత్పత్తికి కూడా దారి తీస్తుంది. ఉబ్బసం లక్షణాలను కలిగించడమే కాకుండా, ఈ కణాలు పెద్ద శబ్దాలు.. ఆందోళన, ఉద్రిక్తతను పెంచుతాయి.

దీపావళి సమయంలో ఆస్తమా ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే:

ఇవి కూడా చదవండి

– ఆస్తమాతో బాధ పడేవారు బయటకు వెళ్లాలనుకునే వారు N95 మాస్క్ లను ఉపయోగించడం చాలా మంచిది. దీని వల్ల హానికరమైన పొగ ముక్కులోకి వెళ్లకుండా ఉంటుంది. వీలైనంత వరకూ దీపావళి సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిది.

– ఆస్తమా బాధితులు ఎప్పుడూ చేతిలో ఇన్ హేలర్ ను ఉంచుకోవడం బెటర్. అలాగే దీపావళి సమయంలో పెయింటింగ్ వాసనలకు కూడా దూరంగా ఉండాలి.

– ఉబ్బసం ఉన్న వ్యక్తులు దీపావళి పండుగ సమయంలో స్వీటెనర్లు, మిఠాయిలకు దూరంగా ఉండటం బెటర్. అలాగే తీసుకునే ఆహార విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. చక్కెరతో చేసిన పదార్థాలకు దూరంగా ఉండటం చాలా అవసరం.

– ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు.. శ్వాస వ్యాయామాలు చేయడం చాలా అవసరం. దీంతో ఊపిరి తిత్తులు క్లియర్ గా ఉంటాయి.

– వైన్, బీర్, ఇతర ఆల్కాహాలిక్ పానీయాలు కూడా ఆస్తమా అటాక్ లను కలిగిస్తాయి. కాబట్టి దీపావళి సమయంలో ఆల్కాహాల్ కు దూరంగా ఉండటం చాలా మంచిది. ఒవేళ తీసుకున్నా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. లేదంటే ఇతర సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది.

నేను డిప్యూటీ సీఎం తాలుకా! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్
నేను డిప్యూటీ సీఎం తాలుకా! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ