Mysore Bonda: మైదా లేకుండా మైసూర్ బజ్జీలను ఇలా చేయండి.. చాలా హెల్దీ!

ఉదయం టిఫిన్స్ లో మనం తినే వాటిల్లో మైసూర్ బోండాలు కూడా ఒకటి. వీటి టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఇంట్లో కూడా చేసుకుని ప్లేట్ ల మీద పేట్లు లాగించేస్తారు. అయితే వీటిని మైదా పిండితో తయారు చేస్తారు. మైదా పిండితో చేసిన ఏ ఆహార పదార్థమైనా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే మైదా పండి తినడం వల్ల ఊబకాయం, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. మైసూర్ బోండాలను కేవలం మైదా..

Mysore Bonda: మైదా లేకుండా మైసూర్ బజ్జీలను ఇలా చేయండి.. చాలా హెల్దీ!
Mysore Bonda
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 02, 2023 | 9:49 PM

ఉదయం టిఫిన్స్ లో మనం తినే వాటిల్లో మైసూర్ బోండాలు కూడా ఒకటి. వీటి టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఇంట్లో కూడా చేసుకుని ప్లేట్ ల మీద పేట్లు లాగించేస్తారు. అయితే వీటిని మైదా పిండితో తయారు చేస్తారు. మైదా పిండితో చేసిన ఏ ఆహార పదార్థమైనా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే మైదా పండి తినడం వల్ల ఊబకాయం, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. మైసూర్ బోండాలను కేవలం మైదా పిండితోనే కాకుండా.. గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. వీటితో తయారు చేసినవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మరి గోధుమ పిండితో మైసూర్ బోండాలను ఎలా తయారు చేసుకుంటారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మైసూర్ బోండాలకు కావాల్సిన పదార్థాలు:

గోధుమ పిండి, పుల్లటి పెరుగు, జీల కర్ర, డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె, ఉప్పు, బియ్యం పిండి, వంట సోడా.

ఇవి కూడా చదవండి

మైసూర్ బోండాలు తయారు చేయు విధానం:

వీటిని తయారు చేసుకోవడానికి ముందు రాత్రే పిండిని నాన బెట్టుకోవాలి. ముందుగా ఒక లోతైన పాత్ర తీసుకోవాలి. ఇందులో గోధుమ పిండి, రెండు స్పూన్ల బియ్యం పిండి, ఉప్పు, పుల్లటి పెరుగు, కొద్దిగా జీల కర్ర, కొద్దిగా వేడి నూనె వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకుంటూ పిండిలా కలుపు కోవాలి. ఈ పిండిని అప్పటికప్పుడు కూడా కలుపుకోవచ్చు. అప్పటికప్పుడు కలుపుకుంటే మాత్రం అరగంట ముందే వంట సోడా వేసి, కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. కానీ ముందు రోజు రాత్రి కలుపుకుంటే మాత్రం ఎంతో టేస్టీగా ఉంటాయి.

ఇప్పుడు ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక పిండి తీసుకుని కొద్దిగా వంట సోడా వేసుకుని బాగా కలుపు కోవాలి. తర్వాత పిండిని తీసుకుని గుండ్రంగా నూనెలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండాలు రెడీ అవుతాయి. వీటిని ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. బోండాలను గోధుమ పిండితో తయారు చేసి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. ఇంకెందుకు లేట్.. మీరు కూడా ఒకసారి వీటిని తయారు చేసి చూడండి. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. వీటిని పిల్లలకు ఎలాంటి డౌట్స్ లేకుండా పెట్టవచ్చు.

డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!
బిస్కెట్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి వచ్చి ఎలుగుబంటి.. ఆపై
బిస్కెట్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి వచ్చి ఎలుగుబంటి.. ఆపై
షిర్డీకి రూ.కోట్లలో ఆదాయం.! సాయినాథునికి 3 రోజులకు రూ.6.25 కోట్లు
షిర్డీకి రూ.కోట్లలో ఆదాయం.! సాయినాథునికి 3 రోజులకు రూ.6.25 కోట్లు
నేను డిప్యూటీ సీఎం తాలుకా! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్
నేను డిప్యూటీ సీఎం తాలుకా! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!