Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: పురుషులు సెల్ ఫోన్ ని అక్కడ పెట్టుకోవడం వల్ల శుక్ర కణాలు తగ్గిపోతాయా?

సెల్ ఫోన్ ఇది లేనిదే ప్రస్తుతం ఏ పనీ అవడం లేదు. ప్రస్తుతం ఇప్పుడున్న యుగంలో రాణించాలంటే సెల్ ఫోన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. స్కూల్ కి వెళ్లే పిల్లలకు సైతం సెల్ ఫోన్ అవసరం అవుతుంది. స్మార్ట్ గా ఉండాంటే.. స్మార్ట్ ఫోన్ అవసరం పడుతుంది. అయితే దీన్ని ఎంత జాగ్రత్తగా వాడితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో.. అన్నే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సెల్ ఫోన్ వల్ల ఎక్కువగా మగవారికే నష్టం ఎక్కువగా ఉందని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే సెల్ ఫోన్ ని వారు ప్యాంట్..

Health Tips: పురుషులు సెల్ ఫోన్ ని అక్కడ పెట్టుకోవడం వల్ల శుక్ర కణాలు తగ్గిపోతాయా?
Phone
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 02, 2023 | 9:50 PM

సెల్ ఫోన్ ఇది లేనిదే ప్రస్తుతం ఏ పనీ అవడం లేదు. ప్రస్తుతం ఇప్పుడున్న యుగంలో రాణించాలంటే సెల్ ఫోన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. స్కూల్ కి వెళ్లే పిల్లలకు సైతం సెల్ ఫోన్ అవసరం అవుతుంది. స్మార్ట్ గా ఉండాంటే.. స్మార్ట్ ఫోన్ అవసరం పడుతుంది. అయితే దీన్ని ఎంత జాగ్రత్తగా వాడితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో.. అన్నే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సెల్ ఫోన్ వల్ల ఎక్కువగా మగవారికే నష్టం ఎక్కువగా ఉందని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే సెల్ ఫోన్ ని వారు ప్యాంట్ పాకెట్ లో పెట్టుకుంటారు. తాజాగా జరిగిన కొత్త అధ్యయనం ప్రకారం పురుషులు ఎంత ఎక్కువగా సెల్ ఫోన్ ని వినియోగిస్తారో.. వారి శుక్ర కణాల సంఖ్య అంత తొందరగా తగ్గిపోతుందని తేలింది.

హానికర ప్రభావం పడుతుంది:

ఫెర్టిలిటి అండ్ స్టెరిలిటీ జర్నల్ లో ప్రచురించబడిన కొత్త నివేదిక ప్రకారం.. తమ సెల్ ఫోన్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల 20 శాతం తక్కువగా స్పెర్మ్ సాంద్రతను కలిగి ఉంటారని వెల్లడైంది. సెల్ ఫోన్ నుంచి విడుదలయ్యే రేడియో ఫ్రీక్వెన్సీ విద్యుతయస్కాంత క్షేత్రాల హానికర ప్రభావం.. పురుషుల ఆరోగ్యం, ముఖ్యంగా పునరుత్పత్తి పని తీరుపై పడుతుందని పరిశోధకులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

వీర్య కణాల సాంద్రత 21 శాతం తక్కువగా ఉంటుంది:

18 నుండి 22 సంవత్సరాల వయస్సు గల 2,886 మంది పురుషుల నుండి వీర్యం సేకరించి టేస్టులు చేశారు. అలాగే సాధారణంగా రోజులో 20 సార్లు ఎక్కువగా వినియోగించే వారిలో వీర్య కణాల సాంద్రత 21 శాతం తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఏది ఏమైనప్పటికీ గతంలో పోల్చితే.. మగవారిలో వీర్య కణాల సంఖ్య అనేది తగ్గుతూ వచ్చింది. కాగా మొదట్లో 2జీ నుండి 3జీ, 4జీ ఆ తర్వాత ఇప్పుడు 5జీకి నెట్ వర్క్ కి మారింది. ఇప్పుడు మొబైల్ నెట్ వర్క్ లు RF-EMF అవుట్‌ పుట్ శక్తిని కలిగి ఉన్నాయని వారు వెల్లడించారు.

అయితే సెల్ ఫోన్ లను జేబులో పెట్టడం వల్ల.. శుక్ర కణాలు తగ్గుతున్నాయన్నదానిపై ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ.. పురుషులు తమ ఫోన్ లను శరీరానికి వీలైనంత వరకూ దూరంగా ఉంచితేనే బెటర్ అని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. అలాగే మొబైల్ ఫోన్ లు విడుదల చేసే మైక్రో వేవ్ లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలా ప్రభావం చూపుతాయి? సెల్ ఫోన్ వాడకం వల్ల వృషణాల ఉష్ణోగ్రతలో గణనీయమైన పెరుగుదలను కలిగిస్తాయా? అనే విషయాలు కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించడం మేలు.