AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care in Winter: చలి కాలంలో మీ స్కిన్ డ్రై అవ్వకుండా ఉండాలంటే సూపర్ చిట్కాలు!

సాధారణంగా శీతా కాలంలో ఎవరి స్కిన్ అయినా డ్రై అయిపోతూ ఉంటుంది. చలి గాలుల వలన చర్మం పగిలి పోవడం, దురద, అలర్జీ రావడం వంటివి ఉంటాయి. కాబట్టి స్కిన్ పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం బయట నుంచి క్రీములు వంటివి పూయడం కంటే.. సరైన ఆహారం తీసుకోవడం వల్లన లోపలి నుంచి స్కిన్ హైడ్రేట్ అవుతుంది. వింటర్ సీజన్ డ్రై స్కిన్ సమస్యను నివారించడానికి..

Skin Care in Winter: చలి కాలంలో మీ స్కిన్ డ్రై అవ్వకుండా ఉండాలంటే సూపర్ చిట్కాలు!
Skin Care
Chinni Enni
| Edited By: |

Updated on: Nov 02, 2023 | 9:50 PM

Share

సాధారణంగా శీతా కాలంలో ఎవరి స్కిన్ అయినా డ్రై అయిపోతూ ఉంటుంది. చలి గాలుల వలన చర్మం పగిలి పోవడం, దురద, అలర్జీ రావడం వంటివి ఉంటాయి. కాబట్టి స్కిన్ పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం బయట నుంచి క్రీములు వంటివి పూయడం కంటే.. సరైన ఆహారం తీసుకోవడం వల్లన లోపలి నుంచి స్కిన్ హైడ్రేట్ అవుతుంది. వింటర్ సీజన్ డ్రై స్కిన్ సమస్యను నివారించడానికి అద్భుతమైన చిట్కాలను ఇప్పుడు చూద్దాం.

పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి:

చలి కాలంలో పోషకాలు, శరీరాన్ని వేడిగా ఉంచే ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నువ్వులు, నెయ్యి, బెల్లం, కొబ్బరి ఉన్నటువంటి ఆహారాలు ఎక్కువగా చేర్చుకోవాలి. ఇలి చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

నూనెతో మసాజ్ చేసుకోవాలి:

చలి కాలం ఇప్పడే మొదలైంది కాబట్టి.. ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటే స్కిన్ పాడవకుండా ఉంటుంది. స్నానం చేసే ముందు నూనెతో బాడీ మొత్తం మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల రక్త ప్రసరణ జరుగుతుంది. అలాగే శరీరానికి తేమ అంది స్కిన్ మెరుస్తూ కనిపిస్తుంది.

నిద్ర:

నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యం. సరైన విధంగా నిద్ర పోవడం వల్ల అందంగా, ఆరోగ్యంగా ఉంటాం. రోజూ కనీసం 8 గంటల నిద్ర అవసరం. లేకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నిద్ర పోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

నీరు తాగాలి:

చలి కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి.. చాలా మంది నీరు తాగరు. కానీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు నీరు చాలా అవసరం. ఏ కాలం అయినా రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. అలాగే మీరు తాగే నీటిలో అల్లం, యాలకులు, దాల్చిన వంటివి చేర్చుకుంటే ఇమ్యూనిటీ అందుతుంది.

కెమికల్ సబ్బులు వాడవద్దు:

చలి కాలంలో స్కిన్ తేమ్ కోల్పోయి డ్రైగా అంద విహీనంగా మారుతుంది. కాబట్టి ఈ కాలంలో ఏ సోప్స్ పడితే వాటిని వాడకూడదు. మైల్డ్ గా, సహజ పదార్థాలు ఉన్న సబ్బులు, క్లెన్సర్లు వాడితే చాలా మంచిది. అలాగే శరీరాన్ని ఎప్పుడూ వేడిగా ఉంచేవిధంగా చూసుకోండి. అలాగే చల్లని గాలుల నుంచి రక్షించుకోవడానికి స్వెటర్లు, స్కార్ఫ్ వాడాలి.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించడం మేలు.