Kitchen Tips: అసలు ఏ పాత్రల్లో వండిన ఆహారాలు ఆరోగ్యానికి మంచిది? ఇప్పుడు తెలుసుకోండి!
ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే తీసుకునే ఆహారమే ఆరోగ్యంగా ఉంటే సరిపోదు.. దాన్ని ఎలా తయారు చేస్తున్నారన్నది కూడా చాలా ముఖ్యం. ఆహారాల్లో సరైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటే సరిపోదు. దాన్ని తయారు చేయడానికి తగిన పాత్ర కూడా కావాలి. ఆహారాలు ఫ్రెష్ గా ఉంటే మాత్రమే సరిపోదు.. వండే పాత్రలు కూడా నాణ్యంగా ఉంటేనే అసలైన ఆరోగ్యం మన సొంతం అవుతుంది. మరి ఎలాంటి పాత్రల్లో వండితే..
ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే తీసుకునే ఆహారమే ఆరోగ్యంగా ఉంటే సరిపోదు.. దాన్ని ఎలా తయారు చేస్తున్నారన్నది కూడా చాలా ముఖ్యం. ఆహారాల్లో సరైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటే సరిపోదు. దాన్ని తయారు చేయడానికి తగిన పాత్ర కూడా కావాలి. ఆహారాలు ఫ్రెష్ గా ఉంటే మాత్రమే సరిపోదు.. వండే పాత్రలు కూడా నాణ్యంగా ఉంటేనే అసలైన ఆరోగ్యం మన సొంతం అవుతుంది. మరి ఎలాంటి పాత్రల్లో వండితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
వెండి:
బంగారం తర్వాత విలువైన లోహం వెండి. సిల్వర్ లో యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇందులో ఆహారం తింటే చాలా మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వెండి పాత్రల్లో తయారు చేసిన ఆహారం తీసుకోవడం వల్ల మంచి శరీరాన్ని చల్ల బరుస్తుంది.
రాగి:
ఇప్పుడంటే స్టీల్, అల్యూమినియం వంటి పాత్రలు వచ్చాయి. కానీ పూర్వం మాత్రం రాగి పాత్రల్లో వంటలు చేసేవారు. రాగిలో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు మెండుగా ఉంటాయి. అందుకే రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగమనేవారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి. ఆహారంలో, నీటిలో ఉన్న బ్యాక్టీరియను నశింప చేసే గుణం రాగిలో ఉంది. కాబట్టి రాగి పాత్రల్లో చేసుకున్న ఆహారం తినడం చాలా మంచింది.
స్టీల్ :
స్టీల్ పాత్రలు ఇప్పుడు అందరి గృహాల్లో సాధారణంగా ఉంటే వస్తువులు. స్టీల్ పాత్రల్లో కూడా వంటలు చేసుకుని తింటే ఎలాంటి నష్టాలు లేవు. ఇందులో వంట చేసుకుని తినడం వల్ల ఎలాంటి విష పూరిత పదార్థాలు విడుదల కావు. అందులోనూ స్టీల్ ఇప్పుడు ఇది అందరికీ అందుబాటు ధరలో ఉంది. కాబట్టి వంట కోసం సురక్షితమైన లోహాల్లో ఇది కూడా ఒకటి.
ఇత్తడి:
ఇత్తడి లేదా బ్రాస్ అని కూడా పిలుస్తారు. ఇవి కూడా అందరి ఇళ్లల్లో విరివిగా ఉంటాయి. పూర్వం పెద్దలు ఈ పాత్రల్లోనే ఎక్కువగా వంటలు చేసేవారు. కానీ ఇప్పుడు వీటి ధర చాలా ఎక్కువ. కానీ ఈ పాత్రల్లో వంట చేసుకుని తినడం వల్ల చాలా మంచిది. జీర్ణ క్రియని మెరుగు పరిచి, ప్రేగు ఆరోగ్యానికి సహాయ పడుతుంది. అలాగే ఆహారాన్ని కూడా పోషకాలతో నింపుతుంది.
అల్యూమినియం:
స్టీల్ పాత్రలు వచ్చాక వీటి డిమాండ్ తగ్గింది కానీ.. ఒకప్పుడు వీటికి చాలా డిమాండ్ ఎక్కువ. తక్కువ ధరలో లభిస్తాయి. అల్యూమినియం పాత్రల్లో వంట చేయడం వల్ల.. ఆహారంలోకి అల్యూమినియం విడుదల అవుతుంది. ఇది ఫుడ్ ని అత్యంత విష పూరితం చేస్తుంది. కాబట్టి వీటికి వీలైనంత వరకూ దూరగా ఉంటేనే బెటర్.
ఇనుము:
ఇనుముతో తయారు చేసిన పాత్రల్లో వంట చేయడం వల్ల ఆరోగ్యానికి సమానంగా ఉపయోగ పడుతుంది. ఆహారంలో పోషకాలను నిలుపుకోవడం హెల్ప్ అవుతుంది. కానీ ఇనుము పాత్రల్లో ఎక్కువ శాతం వంట చేయడం, నిల్వ చేయడం మంచిది కాదు. ఆహారం రుచిని పాడు చేస్తుంది.
నాన్ స్టిక్:
ఇప్పుడు వీటి డిమాండ్ కాస్త తగ్గింది కానీ.. ఇంతకు ముందు ఎవరి ఇంట్లో చూసిన నాన్ స్టిక్ పాత్రలు కనిపించేవి. వీటిల్లో వంట మాడకుండా ఈజీగా అయిపోతాయి. ఇవి చాలా ప్రమాదం. టెఫ్లాన్ అనే విషపూరిత రసాయనం విడుదల అవుతుంది. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకూ దీనికి దూరంగా ఉండండి.
గ్లాస్:
చూడటానికి లగ్జరీగా కనిపించే వస్తువు. ఆహారన్ని సర్వ్ చేయడానికి, తినడానికి గ్లాస్ ఐటెమ్స్ ని ఉపయోగిస్తారు. అయితే మరీ వేడి వేడి పదార్థాలు వేసి ఉపయోగించకూడదు. అలాగే సరుకులను నిల్వ చేయడానికి ఇది సరైన ఎంపిక.
గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించడం మేలు.