Women Diet Tips: ప్రతి మహిళ తప్పనిసరిగా ఈ 5 రకాల ఆహారాలు తీసుకోవాలి.. ఎందుకంటే

మధుమేహ వ్యాధిగ్రస్తులు, పీసీఓడీతో బాధపడుతున్న వారు అందరినీ ఒకే విధమైన ఆహార నియమాలు పాటించకూడదు. అదేవిధంగా పురుషులు, స్త్రీల ఆహారం కూడా తేడాలుంటాయి. వయస్సు, బరువు, శారీరక స్థితిని పరిగణనలోకి తీసుకొని డైట్ చార్ట్‌ను తయారు చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ఆహారం అవసరం. ఇంట్లోని ప్రతి ఒక్కరి గురించి శ్రద్ధ తీసుకునే చాలా మంది మహిళలు తమ ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధ తీసుకోరు. అయితే మహిళలు తమ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన అనేక ఆహారాలు కొన్నింటిని..

Women Diet Tips: ప్రతి మహిళ తప్పనిసరిగా ఈ 5 రకాల ఆహారాలు తీసుకోవాలి.. ఎందుకంటే
Women Diet Tips
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 01, 2023 | 3:56 PM

మధుమేహ వ్యాధిగ్రస్తులు, పీసీఓడీతో బాధపడుతున్న వారు అందరినీ ఒకే విధమైన ఆహార నియమాలు పాటించకూడదు. అదేవిధంగా పురుషులు, స్త్రీల ఆహారం కూడా తేడాలుంటాయి. వయస్సు, బరువు, శారీరక స్థితిని పరిగణనలోకి తీసుకొని డైట్ చార్ట్‌ను తయారు చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ఆహారం అవసరం. ఇంట్లోని ప్రతి ఒక్కరి గురించి శ్రద్ధ తీసుకునే చాలా మంది మహిళలు తమ ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధ తీసుకోరు. అయితే మహిళలు తమ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన అనేక ఆహారాలు కొన్నింటిని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

గుడ్లు

ఈ ఆహారంలో ప్రొటీన్‌తో పాటు విటమిన్‌ డి అధికంగా ఉంటుంది. మహిళల్లో విటమిన్ డి సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. ఈ పోషకం రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముకల బలానికి, దంతాలను నిర్మించడానికి, థైరాయిడ్ హార్మోన్ పనితీరును సక్రమంగా నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి శరీరంలో విటమిన్ డి లోపాన్ని నివారించడానికి గుడ్లు తినడం చాలా అవసరం.

పెరుగు

పెరుగు అనేది ప్రోబయోటిక్స్‌తో నిండిన మంచి ఆహారం. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. పెరుగు జీర్ణశక్తిని పెంచడంతో పాటు అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా, పెరుగు నుంచి కాల్షియం అధికంగా లభిస్తుంది. ఇది బలమైన ఎముకలు, దంతాలను నిర్మించడంలో సహాయపడుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడే మహిళలు రోజూ పెరుగు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

తాజా కూరగాయలు

పీసీఓడీ, థైరాయిడ్, రక్తహీనత వంటి సమస్యలు మహిళల్లో సర్వసాధారణం. ఈ సమస్యలను నివారించడానికి కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలి. కూరగాయల్లో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్ వంటి అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి. అందమైన, మచ్చలేని చర్మాన్ని పొందడానికి కూడా సహాయపడుతుంది.

ఓట్స్

మహిళల బరువు నియంత్రణ చాలా ముఖ్యం. బరువు పెరిగితే మధుమేహం, పీసీఓడీ, కీళ్లనొప్పులు వంటి సమస్యలు వస్తాయి. బరువు తగ్గడానికి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అల్పాహారం కోసం ఓట్స్ తినవచ్చు. ఓట్స్‌లో విటమిన్స్‌తో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది బరువును అదుపులో ఉంచుతుంది.

డ్రైఫ్రూట్స్‌

వాల్‌నట్స్, బాదం, జీడిపప్పు వంటి వివిధ రకాల నట్స్‌లో మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి. ఉదయాన్నే లేచి నానబెట్టిన కొన్ని బాదంపప్పులు తింటే శరీరంలో పోషకాల లోపం ఉండదు. బాదంపప్పును స్నాక్‌గా కూడా తినవచ్చు. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. డ్రైఫ్రూట్స్‌తోపాటు చియా విత్తనాలు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు వంటి విత్తనాలను కూడా తినవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..