Avakaya Egg Fried Rice: ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ ని ఇలా టేస్టీగా చేయండి.. మెతుకు మిగల్చరు!

ఆవకాయ బిర్యానీ గురించి వినే ఉంటారు.. అలాగే ఇది ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్. అదేంటి కొత్తగా ఉందనుకుంటున్నారా.. దీని టేస్ట్ ఇంకా కొత్తగా ఉంటుంది. ఆవకాయతో చేసే ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా.. కారంగా ఒక వెరైటీ రుచి ఉంటుంది. ఉదయం టిఫిల్ లా.. లంచ్ బాక్స్ లోకి అయినా కొత్తగా ఉంటుంది. మిగిలిన అన్నంతో ఇలా ట్రై చేయవచ్చు. కూరగాయలు ఏమీ లేనప్పుడు.. ఫాస్ట్ గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు.. వంట ఏం చేయాలి అని అనుకున్నప్పుడు..

Avakaya Egg Fried Rice: ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ ని ఇలా టేస్టీగా చేయండి.. మెతుకు మిగల్చరు!
Cooking Tips
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 01, 2023 | 10:09 PM

ఆవకాయ బిర్యానీ గురించి వినే ఉంటారు.. అలాగే ఇది ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్. అదేంటి కొత్తగా ఉందనుకుంటున్నారా.. దీని టేస్ట్ ఇంకా కొత్తగా ఉంటుంది. ఆవకాయతో చేసే ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా.. కారంగా ఒక వెరైటీ రుచి ఉంటుంది. ఉదయం టిఫిల్ లా.. లంచ్ బాక్స్ లోకి అయినా కొత్తగా ఉంటుంది. మిగిలిన అన్నంతో ఇలా ట్రై చేయవచ్చు. కూరగాయలు ఏమీ లేనప్పుడు.. ఫాస్ట్ గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు.. వంట ఏం చేయాలి అని అనుకున్నప్పుడు.. ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయవచ్చు. ఈ ఫ్రైడ్ రైస్ ని కూడా ఎంతో సింపుల్ గా, ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి దీని టేస్ట్ చూస్తే మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు. ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు కూడా దీన్ని చేసుకోవచ్చు. మరి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు:

అన్నం, గుడ్లు, ఆవకాయ పచ్చడి, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తి మీర, నూనె.

ఇవి కూడా చదవండి

ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం:

ముందుగా అన్నాన్ని పొడి పొడిలాడేటట్టు ఉడికించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఈ అన్నం చల్లారాక.. ఆవకాయ పచ్చడి కొద్దిగా వేసుకుని చేత్తో.. మొత్తం అన్నం అంతా కలుపుకోవాలి.ఇప్పుడు ఒక బాండీ తీసుకుని ఆయిల్ వేసి వేడెక్కాక.. కోడి గుడ్లు చితక్కొట్టి ఆమ్లెట్ లా వేసుకోవాలి. ఇప్పుడే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. దీన్ని ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. మంట హై ఫ్లేమ్ లోనే పెట్టుకోండి. అలా చేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. ఆ తర్వాత పసుపు, ధనియాల పొడి, జీల కర్ర పొడి, సరిపడినంత ఉప్పు వేసుకుని మళ్లీ ఒకసారి కలుపు కోవాలి.

ఆ తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిర్చి వేసి మరోసారి కలుపుకోవాలి. ఇవి కాసేపు వేగాక.. ఆవకాయ కలుపుకున్న అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంట మీడియంలో పెట్టి.. మాడిపోకుండా ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ సిద్ధమవుతుంది. వెరైటీగా తినడం ఇష్టమున్నవాళ్లకు ఇది బాగా నచ్చుతుంది. మరింకెందుకు లేట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.

ధనుష్ నట విశ్వరూపాన్ని ఉదాహరణలు ఈ సినిమాలు..
ధనుష్ నట విశ్వరూపాన్ని ఉదాహరణలు ఈ సినిమాలు..
యూత్ ఫుల్ కంటెంట్‌కు మళ్లీ ఊపు.. వారం గ్యాప్‌లో రెండు చిత్రాలు..
యూత్ ఫుల్ కంటెంట్‌కు మళ్లీ ఊపు.. వారం గ్యాప్‌లో రెండు చిత్రాలు..
ఈ-బైక్ కొనాలనుకుంటున్నారా? దేశంలోని టాప్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..
ఈ-బైక్ కొనాలనుకుంటున్నారా? దేశంలోని టాప్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..
ఈ బూరెబుగ్గల బుజ్జాయి.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
ఈ బూరెబుగ్గల బుజ్జాయి.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
ఆ విషయంలో దళపతి విజయ్‌ను ఫాలో అవుతున్న కీర్తిసురేష్..
ఆ విషయంలో దళపతి విజయ్‌ను ఫాలో అవుతున్న కీర్తిసురేష్..
ఒంగోలులో ఘనంగా నిర్వహించిన 'ఆడికృత్తిక' మహోత్సవం.. ఫొటోలు
ఒంగోలులో ఘనంగా నిర్వహించిన 'ఆడికృత్తిక' మహోత్సవం.. ఫొటోలు
అందులో రాష్ట్రంలోనే నెం.1 స్థానంలో సిరిసిల్ల జిల్లా..
అందులో రాష్ట్రంలోనే నెం.1 స్థానంలో సిరిసిల్ల జిల్లా..
ఈ వారం ఇండియన్‌ ఐడిల్‌ మామూలుగా లేదుగా.. ఓసారి ప్రోమో చూసేయండి..
ఈ వారం ఇండియన్‌ ఐడిల్‌ మామూలుగా లేదుగా.. ఓసారి ప్రోమో చూసేయండి..
ముగ్గురూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు.. ఆ తర్వాత క్షణాల్లోనే విషాదం.
ముగ్గురూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు.. ఆ తర్వాత క్షణాల్లోనే విషాదం.
కొంపముంచిన ఫిజిక్స్ ప్రశ్న.. NEETకు దూరమైన తెలుగు విద్యార్ధులు
కొంపముంచిన ఫిజిక్స్ ప్రశ్న.. NEETకు దూరమైన తెలుగు విద్యార్ధులు
కనువిందు చేస్తున్న జలపాతలు.. తరలివస్తున్న పర్యాటకులు.!
కనువిందు చేస్తున్న జలపాతలు.. తరలివస్తున్న పర్యాటకులు.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!