- Telugu News Lifestyle Food From Losing Weight To Maintaining Brain Health, Here Are 5 Benefits Of Brinjal Telugu News
Brinjal Benefits: వారేవ్వా వంకాయ.. టేస్ట్‌తో అదరగొడుతూనే.. గుండెపోటుతో పాటు ఈ 4 వ్యాధులు దూరం చేస్తుంది..!
ఫైబర్ పుష్కలంగా ఉండే వంకాయను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వంకాయలో పొటాషియం, విటమిన్ B6 మొదలైనవి ఉంటాయి. అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి వంకాయను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. మధుమేహం వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువగానూ, పీచుపదార్థాలు ఎక్కువగానూ ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని తినవచ్చు. అంతేకాదు.. వంకాయలతో జ్ఞాపకశక్తి , మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Updated on: Nov 01, 2023 | 9:45 PM

వంకాయలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని తినవచ్చు. మధుమేహం వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువగానూ, పీచుపదార్థాలు ఎక్కువగానూ ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని తినవచ్చు. అంతేకాదు.. వంకాయలతో జ్ఞాపకశక్తి , మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాల్షియం, ఇతరాలు కలిగిన వంకాయ ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. వంకాయలో కాల్షియం, ఇతర పోషకాలు ఉన్నందున ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

ఐరన్ అధికంగా ఉండే వంకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కూడా రక్తహీనతను నివారించవచ్చు. వంకాయలో ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి.. ఇది మెదడు పనితీరుకు సహాయపడే రసాయనం. మీ ఆహారంలో వంకాయలను తీసుకోవటం వల్ల జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఫైటోన్యూట్రియెంట్లు మెదడు చురుగ్గా ఉండేందుకు దోహదం చేస్తుంది.

ఐరన్ పుష్కలంగా ఉండే వంకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కూడా రక్తహీనతను నివారించవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వంకాయను ఆహారంలో చేర్చుకోవడం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వంకాయలు తింటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. బోలు ఎముకల వ్యాధికి ఇది గొప్ప ఔషధంగా ఉపయోగపడుతుంది.

క్యాలరీలు తక్కువగా ఉండటం, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి వంకాయ తినడం మంచిది. వంకాయలో క్యాలరీలు తక్కువ, పీచుపదార్థాలు పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి కూడా వంకాయ మంచిది.

వంకాయల వల్ల దురద కలుగుతుందని పుండ్లు, ఇన్ఫెక్లన్ల సమయంలో వంకాయ తినరు. వంకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు వాటిని త్వరగా మానిపోయేలా చేస్తాయి. అందుకే తగిన మోతాడులో తింటే మంచిది.





























