AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Skin Care: పాలను, టమాటాను రాత్రి ఇలా రాస్తే.. గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం!

శరీరంలో ముందుగా, ఆకర్షణీయంగా కనిపించేది ముఖమే. ఫేస్ ఆకర్షణీయంగా ఉంటే.. సగంల లక్ మనతో ఉన్నట్టే అని ఫీల్ అవుతున్నారు ఇప్పటి జనరేషన్. అందంగా ఉండాలని, కనిపించాలని అందరికీ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని రకాల టిప్స్ ని ఫాలో అయితే మాత్రం మంచి స్కిన్ మన సొంతం అవుతుంది. ప్రస్తుతం ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. గంటలు గంటలు ల్యాప్ ట్యాప్స్, కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల ఆరోగ్యమే కాదు....

Winter Skin Care: పాలను, టమాటాను రాత్రి ఇలా రాస్తే.. గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం!
Skin Care Tips
Chinni Enni
| Edited By: |

Updated on: Nov 02, 2023 | 9:57 PM

Share

శరీరంలో ముందుగా, ఆకర్షణీయంగా కనిపించేది ముఖమే. ఫేస్ ఆకర్షణీయంగా ఉంటే.. సగంల లక్ మనతో ఉన్నట్టే అని ఫీల్ అవుతున్నారు ఇప్పటి జనరేషన్. అందంగా ఉండాలని, కనిపించాలని అందరికీ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని రకాల టిప్స్ ని ఫాలో అయితే మాత్రం మంచి స్కిన్ మన సొంతం అవుతుంది. ప్రస్తుతం ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. గంటలు గంటలు ల్యాప్ ట్యాప్స్, కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల ఆరోగ్యమే కాదు.. అందం కూడా దెబ్బతింటుంది. ముఖంలో గ్లో తగ్గిపోయి.. నిర్జీవంగా మారుతుంది. ఇక దీని కోసం వరుసగా బ్యూటీ పార్లర్స్ కి క్యూ కడుతూంటారు. అలా కాకుండా మన ఇంట్లోనే కొన్ని రకాల ఇంగ్రీడియన్స్ వలన స్కిన్ గ్లోని పెంచుకోవచ్చు. ముఖాన్ని అందంగా మార్చడంలో పాలు బాగా హెల్ప్ చేస్తాయి. ఆ పాలతో పాటు ఇంకొన్ని పదార్థాలను మిక్స్ చేసి అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మరి అవేంటో ఓ లుక్కేసేయండి!

మిల్క్ – హనీ:

పాలు, తేనె ఈ రెండూ మన ఇంట్లో ఉంటాయి. ఒక చిన్న బౌల్ లోకి రెండు స్పూన్ల పాలు, కొద్దిగా తేనె కలుపుకుని ముఖానికి రాస్తే.. మంచి గ్లో వస్తుంది. పాలలో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ ని, మలినాలను తొలగిస్తుంది. వీటి వల్ల ఫేస్ సాఫ్ట్ గా కూడా తయారవుతుంది. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మచ్చలు, పింపుల్స్ ని దూరం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

రాత్రి పడుకునే ముందు శుభ్రంగా ఫేస్ ని వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, అవసరం అయితే చేతులు, కాళ్లకు కూడా అప్లై చేసుకోడి. ఓ 15 నుంచి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. సోప్ అస్సలు వాడకూడదు. ప్రస్తుతం చలి కాలం కాబట్టి.. స్కిన్ పగులుతుంది. పాలు-తేనె కలిపి రాసుకోవడం వల్ల స్కిన్ కి తేమ అంది.. పగలకుండా ఉంటుంది.

టమాటా – పంచదార:

ఇవి కూడా వంటింట్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక టమాటాను తీసుకుని అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న బౌల్ లోకి పంచదారను తీసుకోవాలి. టమాటాను పంచదార అద్ది.. ముఖంపై, కాళ్లూ, చేతులపై స్క్రబ్ చేసినట్టుగా.. సున్నితంగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల.. ఫేస్ పై ఉండే మలినాలు, డెడ్ స్కిన్ సెల్స్, మచ్చలు వంటివి పోతాయి. ఈ స్క్రబ్ ఫేస్ పై ట్యాన్ కూడా పోగొడుతుంది.

ఈ టిప్ ఎప్పుడైనా పాటించవచ్చు. కానీ మంచి రిజల్ట్స్ కోసం రాత్రి పడుకునే ముందు ఇలా చేసుకుంటే.. ఉదయం లేచే సరికి మీ స్కిన్ మెరిసిపోతుంది. వారానికి ఒక్కసారైనా ఇలా చేస్తే.. మంచి మచ్చలు, పింపుల్స్ కూడా పోయి స్కిన్ మెరుస్తూ షైనీగా ఉంటుంది.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో చేసే ముందు నిపుణులను సంప్రదించండి.

వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
ఆ రైతులు కాలర్ ఎగరేస్తున్నారు.. ఏకంగా టన్ను రూ. 2 లక్షలు..
ఆ రైతులు కాలర్ ఎగరేస్తున్నారు.. ఏకంగా టన్ను రూ. 2 లక్షలు..
ఆ హీరో నమ్మకమే నా కెరీర్ అంటున్న అనిల్ రావిపూడి
ఆ హీరో నమ్మకమే నా కెరీర్ అంటున్న అనిల్ రావిపూడి
కొంటె చూపులతో కట్టిపడేస్తు్న్న ముద్దుగుమ్మ.. అనికా స్టన్నింగ్..
కొంటె చూపులతో కట్టిపడేస్తు్న్న ముద్దుగుమ్మ.. అనికా స్టన్నింగ్..
టీమిండియాకు గుడ్ న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన తెలుగబ్బాయ్..?
టీమిండియాకు గుడ్ న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన తెలుగబ్బాయ్..?