AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Side Effect Of Raisins: ఒక రోజులో ఎండు ద్రాక్ష ఎంత మోతాదులో తీసుకోవాలి..? నిపుణులు ఏమంటున్నారు..?

సాధారణంగా రోజులో అరకప్పు నుంచి ఒక కప్పు ఎండుద్రాక్ష తీసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే దాదాపు 25 నుంచి 50 గ్రాముల ఎండుద్రాక్ష తినడం వల్ల మేలు జరుగుతుంది. ఇంతకంటే ఎక్కువ ఎండుద్రాక్ష తినడం ఆరోగ్యానికి హానికరం. కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్లు వంటి పోషకాలు ఎండుద్రాక్షలో ఉంటాయి. అందుకే దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల క్యాలరీలను పెంచుకోవచ్చు. ఒక రోజులో 50 గ్రాముల కంటే

Side Effect Of Raisins: ఒక రోజులో ఎండు ద్రాక్ష ఎంత మోతాదులో తీసుకోవాలి..? నిపుణులు ఏమంటున్నారు..?
Side Effect Of Raisins
Subhash Goud
|

Updated on: Nov 02, 2023 | 9:24 PM

Share

ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ఇందులో ఐరన్, ఫైబర్, ప్రొటీన్, క్యాల్షియం, కాపర్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని బలహీనత తొలగిపోవడమే కాకుండా జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. కానీ ఎండు ద్రాక్షను సరైన మోతాదులో తీసుకున్నప్పుడే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఎండుద్రాక్షను అధికంగాఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే మీరు ఎండు ద్రాక్షను రోజులో ఎంత మోతాదులో తినాలి? అని అనుకుంటే, ఎండుద్రాక్షను అధికంగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

ఒక రోజులో ఎండుద్రాక్ష ఎంత మోతాదులో తీసుకోవాలి?

సాధారణంగా రోజులో అరకప్పు నుంచి ఒక కప్పు ఎండుద్రాక్ష తీసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే దాదాపు 25 నుంచి 50 గ్రాముల ఎండుద్రాక్ష తినడం వల్ల మేలు జరుగుతుంది. ఇంతకంటే ఎక్కువ ఎండుద్రాక్ష తినడం ఆరోగ్యానికి హానికరం. కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్లు వంటి పోషకాలు ఎండుద్రాక్షలో ఉంటాయి. అందుకే దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల క్యాలరీలను పెంచుకోవచ్చు. ఒక రోజులో 50 గ్రాముల కంటే ఎక్కువ ఎండుద్రాక్షలను తినవద్దు. ముఖ్యంగా గర్భిణులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎండుద్రాక్ష తీసుకోవడం తగ్గించాలి.

ఎండుద్రాక్ష అధిక వినియోగం దుష్ప్రభావాలు:

  1. బరువు పెరుగుట: ఎండుద్రాక్ష ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. ఇది అధిక మొత్తంలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ కలిగి ఉంటుంది. దీని కారణంగా దాని అధిక వినియోగం వేగంగా బరువు పెరుగుటకు దారితీస్తుంది. ఎండుద్రాక్ష ప్రయోజనాలను పొందాలంటే వాటిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.
  2. డయాబెటిక్ రోగులకు హానికరం: ఎండుద్రాక్షలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు హానికరం. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎండుద్రాక్షను పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. లేకపోతే అది హానికరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
  3. ఇవి కూడా చదవండి
  4. కణాలు దెబ్బతింటాయి: ఎండుద్రాక్షలో పాలీఫెనాల్స్, బయోఫ్లేవనాయిడ్స్, ఫైటోన్యూట్రియెంట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కణాలకు హాని కలుగుతుంది.
  5. కడుపు సంబంధిత సమస్య: ఎండుద్రాక్షలో ఫైబర్, ఫ్రక్టోజ్ అధికంగా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఎండుద్రాక్షను ఎక్కువగా తిన్న తర్వాత మలబద్ధకం, గ్యాస్, కడుపు నొప్పి సమస్యలు కనిపిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి