UPI: యూపీఐ సేవలు ఇక మరింత సులువు.. ఏప్రిల్ నుంచి ‘హలో యూపీఐ’ ఫీచర్.
చిన్న టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద దుకాణాల వరకు అందరూ యూపీఐ పేమెంట్స్‌ను స్వీకరిస్తున్నారు. మార్కెట్లో అనేక రకాల యూపీఐ యాప్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. యూపీఐ యాప్స్ మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో యాప్స్ సైతం కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా యూపీఐ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది...
నగదు లావాదేవీల్లో యూపీఐ పేమెంట్స్ విధానం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోని మారుమూల గ్రామాల్లో కూడా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. అందరికీ స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి రావడం, ఇంటర్‌నెట్ ఛార్జీలు భారీగా తగ్గడంతో యూపీఐ సేవలు విస్తరిస్తున్నాయి.
చిన్న టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద దుకాణాల వరకు అందరూ యూపీఐ పేమెంట్స్‌ను స్వీకరిస్తున్నారు. మార్కెట్లో అనేక రకాల యూపీఐ యాప్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. యూపీఐ యాప్స్ మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో యాప్స్ సైతం కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా యూపీఐ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వాయిస్ కమాండ్ ఆధారిన చెల్లింపులను ప్రవేశపెట్టనున్నారు.
దీంతో ఇకపై వాయిస్ కమాండ్ ద్వారానే యూపీఐ సేవలు చేసే అవకాశం లభించనుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ గత సెప్టెంబర్‌లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మార్చిన 31 నాటికి ఈ ఫీచర్‌ను యాప్‌లలో తీసుకురానున్నారు. ఈ విషయాన్ని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)’ తెలిపింది. ఇదే విషయమై ఉత్తర్వులు సైతం జారీ చేసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగానే ‘హలో.. యూపీఐ’ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నారు.
బ్యాలెన్స్ ఎంక్వైరీ, కొత్త యూజర్ల చేరిక, ట్రాన్సాక్షన్స్, ఫిర్యాదులకు సంబంధించిన అన్ని పరిష్కారాలను వాయిస్ కమాండ్స్ ద్వారా జరిగేలా యాప్‌లో మార్పులు తీసుకురానున్నారు. హలో యూపీఐతో పాటు.. యూపీఐ లైట్ ఎకస్, ట్యాప్ అండ్ పే, బిల్‌పే కనెక్ట్ వంటి కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నట్లు గతేడాది సెప్టెంబర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..