Amazon Festival Sale: స్టోరేజ్ డివైజ్‌లపై టాప్ డీల్స్.. అదనపు స్టోరేజ్ కావాలనుకునేవారు మిస్ చేసుకోవద్దు..
పలు కంపెనీలకు చెందిన స్టోరేజ్ డివైజ్‌లపై కూడా మంచి డీల్స్ ఉన్నాయి. ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ డ్రైవ్‌లు, ఎస్ఎస్డీ కార్డులు మనకు కంప్యూటర్లు వాడే వారికి చాలా అవసరం. సీగేట్, వెస్ట్రన్ డిజిటల్, తోషిబా వంటి అగ్ర బ్రాండ్‌లకు చెందిన స్టోరేజ్ పరికరాలపై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో భారీ తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
ఫెస్టివ్ సీజన్లో అన్ని రంగాల్లోని వస్తువులపై ఆఫర్లు ప్రకటిస్తాయి. ఆఫ్ లైన్, ఆన్ లైన్ ప్లాట్ పారాల్లోనూ పలు డిస్కౌంట్లు లభిస్తాయి. ఈ ఏడాది కూడా వినాయక చవితి, దసరా, దీపావళి నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారాలు అయిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటివి ఆకర్షణీయ డీల్స్ ప్రకటించాయి. వాటిల్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఇంకా కొనసాగుతోంది. అక్టోబర్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కు ప్రారంభమైన ఈ సేల్ ఇంకా వినియోగదారులకు అందుబాటులోనే ఉంది. ఈ సేల్లో అన్ని రకాల వస్తువులపై మంచి ఆఫర్లు లభిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ కన్సోల్‌లు, పీసీ ఉపకరణాలు, ట్యాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌ల వంటి వాటిపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. అదే క్రమంలో పలు కంపెనీలకు చెందిన స్టోరేజ్ డివైజ్‌లపై కూడా మంచి డీల్స్ ఉన్నాయి. ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ డ్రైవ్‌లు, ఎస్ఎస్డీ కార్డులు మనకు కంప్యూటర్లు వాడే వారికి చాలా అవసరం. సీగేట్, వెస్ట్రన్ డిజిటల్, తోషిబా వంటి అగ్ర బ్రాండ్‌లకు చెందిన స్టోరేజ్ పరికరాలపై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో భారీ తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
అధిక స్టోరేజ్ కోసం..
అధిక నిల్వ అవసరాలు కలిగిన కంప్యూటర్ వినియోగదారులకు ఎక్స్ టర్నల్ చాలా అవసరం. వీడియో ఎడిటర్‌లు, గేమర్‌లు, డిజైనర్‌లు తమ ఫైల్‌లను ఒకే చోట ఉంచడానికి ఎక్స్ టర్నల్ డ్రైవ్ లను వినియోగిస్తారు. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఫైనల్ డేస్ దశలో ఉంది. ఈ సమయంలో ఈ డివైజ్ లపై ఆఫర్లు ఉన్నాయి. వాటిల్లో రూ. 32,000 విలువైన శాన్ డిస్క్ 1టీబీ పోర్టబుల్ ఎస్ఎస్డీ కార్డును మీరు రూ. 7,749 కొనుగోలు చేయొచ్చు. అలాగే రూ. 34,999 విలువైన శామ్సంగ్ టీ7 షీల్డ్ 2టీబీ పోర్టబుల్ ఎస్ఎస్డీని రూ. 12,399కి కొనుగోలు చేయొచ్చు. దీపావళి సందర్భంగా అమెజాన్ ఈ సేల్ ని పొడిగించింది. కాబట్టి మరికొన్ని రోజుల మాత్రమే ఈ ధరలు అందుబాటులో ఉంటాయి.
బ్యాంకు ఆఫర్లు కూడా..
ఈ-కామర్స్ సైట్ సేల్ లాస్ట్ డేస్ దశలో కొత్త బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్లు ఈ డీల్స్‌పై రూ. 3,500 వరకూ 10 శాతం అదనపు తగ్గింపును పొందుతారు. అలాగే అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డు హోల్డర్లు వారి కొనుగోలుపై ఐదు శాతం తక్షణ తగ్గింపు, అపరిమిత ఐదు శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కస్టమర్‌లు క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 1,750 వరకు 10 శాతం తగ్గింపును పొందుతారు.
వీటిపై ఆఫర్లు..
- శ్యాన్ డిస్క్ 1టీబీ ఎక్స్‌ట్రీమ్ పోర్టబుల్ ఎస్ఎస్డీ అసలు ధర రూ. 32,000కాగా.. అమెజాన్ సేల్లో రూ. 7,749కే కొనుగోలు చేయొచ్చు.
- శామ్సంగ్ టీ7 షీల్డ్ 2టీబీ పోర్టబుల్ ఎస్ఎస్డీ అసలు ధర రూ రూ. 34,999కాగా అమెజాన్ డీల్స్ లో మీరు దీనిని రూ. 12,399కే దక్కించుకోవచ్చు.
- రూ. 7,905 విలువైన వెస్ట్రన్ డిజిటల్ డబ్ల్యూడీ 2టబీ ఎలిమెంట్స్ పోర్టబుల్ హార్డ్ డిస్క్ డ్రైవ్ ఈ సేల్లో రూ. 6,199కి పొందొచ్చు.
- తోషిబా కాన్వియో బేసిక్స్ 1టీబీ పోర్టబుల్ ఎక్స్ టర్నల్ హెచ్డీడీ రూ. 5,600కాగా రూ. 4,312కే ఆఫర్లో కొనుగోలు చేయొచ్చు.
- రూ. 5,600 విలువైన వెస్ట్రన్ డిజిటల్ డబ్ల్యూడీ 1.5టీబీ ఎలిమెంట్స్ పోర్టబుల్ హార్డ్ డిస్క్ డ్రైవ్ ను కేవలం రూ. 4,998కే దక్కించుకోవచ్చు.
- రూ. 24,400 విలువైన వెస్ట్రన్ డిజిటల్ డబ్ల్యూడీ 8టీబీ మై బుక్ డెస్క్‌టాప్ ఎక్సటర్నల్ హార్డ్ డిస్క్ డ్రైవ్ ను రూ. 16,999కే కొనుగోలు చేయొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..