AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Vs China: చైనాకి చెక్ పెడుతూపెరుగుతున్న భారత్ వెల్లుల్లి ఎగుమతి.. మన దేశానికి డంప్ చేస్తున్న డ్రాగన్ కంట్రీ

భారతదేశంలో దాదాపు 32.7 లక్షల టన్నుల వెల్లుల్లి ఉత్పత్తి అవుతుంది. భారతదేశంలో అత్యధికంగా వెల్లుల్లిని మధ్యప్రదేశ్ ఉత్పత్తి చేస్తుంది. అయితే చైనాలో ఉత్పత్తి పడిపోయినప్పటికీ.. ప్రపంచంలోనే చైనా వెల్లుల్లిని ఎగుమతి చేయడంలో నంబర్-1. చైనాలో ప్రతి సంవత్సరం 2 నుండి 25 మిలియన్ టన్నుల వెల్లుల్లిని ఉత్పత్తి చేస్తారు. భారతదేశపు వెల్లుల్లి పరిమాణం చైనా కంటే కొంచెం చిన్నది. అదే సమయంలో.. దీని రేటు చైనా కంటే చాలా తక్కువ.

India Vs China: చైనాకి చెక్ పెడుతూపెరుగుతున్న భారత్ వెల్లుల్లి ఎగుమతి.. మన దేశానికి డంప్ చేస్తున్న డ్రాగన్ కంట్రీ
India Vs China
Surya Kala
|

Updated on: Nov 02, 2023 | 11:40 AM

Share

వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో ఒకటి వెల్లుల్లి.. తినే ఆహారంలో రోజూ ఉపయోగించే ఈ ‘వెల్లుల్లి’ రెండు దేశాల మధ్య కొత్త ‘యుద్ధానికి’ కూడా కారణం అయ్యేటట్లుంది. అయితే వెల్లుల్లి కోసం ఆయుధాలతో యుద్ధం చెయ్యరు.. వ్యాపార అభివృద్ధి కోసం జరనున్నది అని తెలుస్తోంది. ఒకానొక సమయంలో ప్రపంచ దేశాలకు వెల్లుల్లిని ఎక్కువగా చైనా ఎగుమతి చేసేది. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ కోసం భారత్ పోటీపడుతోంది. మన దేశంలో పండిస్తున్న వెల్లుల్లి ఎగుమతులు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి. దీంతో ఇప్పుడు చైనాకు సమస్యగా మారింది.

ప్రస్తుతం వెల్లుల్లి ఎగుమతిలో చైనా ఇప్పటికీ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందనడంలో సందేహం లేదు. ఒకప్పుడు ప్రపంచంలోని 80% వెల్లుల్లిని చైనా ఎగుమతి చేసేది.. అయితే ఇటీవలి సంవత్సరాల్లో 70-75%కి ఆ ఎగుమతి పడిపోయింది. అదే సమయంలో భారత్‌ నుంచి వెల్లుల్లి ఎగుమతులు పెరిగాయి.

భారతదేశం వెల్లుల్లి ఎగుమతి

ప్రపంచంలోని సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో భారతదేశం అగ్రగామిగా ఉంది. పురాతన సుగంధ ద్రవ్యాల వ్యాపార విధానం భారతదేశం నుంచే దాదాపు అన్ని ఆదేశాలు నేర్చుకున్నారు. గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే భారతదేశ మసాలా దినుసుల ఎగుమతుల్లో వెల్లుల్లి వాటా వేగంగా పెరిగింది. స్పైస్ బోర్డ్ డేటా ప్రకారం, 2022-23 ఏప్రిల్ నుండి జనవరి వరకు కేవలం 10 నెలల్లో వెల్లుల్లి ఎగుమతిలో 165% వృద్ధి నమోదైంది.

ఇవి కూడా చదవండి

ఈ కాలంలో భారతదేశం 47,329 టన్నుల వెల్లుల్లిని ఎగుమతి చేసింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఈ ఎగుమతి  57,346 టన్నులు.. అంటే 2021-22 కంటే 159% ఎక్కువ. 2023-24 గణాంకాలు ఇంకా రావాల్సి ఉంది. మన దేశం నుంచి వెల్లుల్లి ఎగుమతులు భారీగా పెరుగుతుంటే.. అందుకు విరుద్ధంగా చైనాలో వెల్లుల్లి ఉత్పత్తిలో 25% వరకు క్షీణత నమోదైంది. భారతీయ వెల్లుల్లి పాశ్చాత్య ఆసియా, ఆఫ్రికా దేశాలలో బాగా ప్రాచుర్యం పొందింది.

మనదేశంలో 32 లక్షల టన్నుల వెల్లుల్లి పండుతుంది

భారతదేశంలో దాదాపు 32.7 లక్షల టన్నుల వెల్లుల్లి ఉత్పత్తి అవుతుంది. భారతదేశంలో అత్యధికంగా వెల్లుల్లిని మధ్యప్రదేశ్ ఉత్పత్తి చేస్తుంది. అయితే చైనాలో ఉత్పత్తి పడిపోయినప్పటికీ.. ప్రపంచంలోనే చైనా వెల్లుల్లిని ఎగుమతి చేయడంలో నంబర్-1. చైనాలో ప్రతి సంవత్సరం 2 నుండి 25 మిలియన్ టన్నుల వెల్లుల్లిని ఉత్పత్తి చేస్తారు.

భారతదేశపు వెల్లుల్లి పరిమాణం చైనా కంటే కొంచెం చిన్నది. అదే సమయంలో.. దీని రేటు చైనా కంటే చాలా తక్కువ. ప్రపంచ మార్కెట్‌లో చైనీస్ వెల్లుల్లి ధర టన్నుకు 1250 డాలర్లు ఉండగా, భారతీయ వెల్లుల్లి టన్నుకు 450 నుంచి 1000 డాలర్లకు లభిస్తోంది. అందువల్ల పేదల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన వెల్లుల్లిని ధనిక దేశాలకు భారతదేశం అందించగలదు. చైనా వెల్లుల్లికి అమెరికా, యూరప్ దేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండగా, భారత్ వెల్లుల్లిని మలేషియా, థాయ్ లాండ్, నేపాల్, వియత్నాంలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తోంది.

డంపింగ్‌ చేస్తున్న చైనా వెల్లుల్లి

దేశీయ రైతుల ఆర్ధికాభివృద్ధి కోసం చాలా కాలం నుంచి భారతదేశం..  చైనా నుంచి వెల్లుల్లిని దిగుమతి చేసుకోవడం లేదు. అదే సమయంలో.. చైనా అడ్డదారిలో తరచుగా నేపాల్, బంగ్లాదేశ్ ద్వారా మన దేశానికి డంప్ చేస్తుంది. ఈ రెండు దేశాలతో భారతదేశం వెల్లుల్లిలో సుంకం రహిత వ్యాపారం చేస్తుంది. చైనీస్ వెల్లుల్లి భారతదేశానికి చేరుకోవడంతో రైతులకు నష్టం మాత్రమే కాదు.. ఈ వెలుల్లితో అనేక బ్యాక్టీరియాలు, వ్యాధులను తీసుకుని వస్తున్నాయి. ఈ వెల్లుల్లి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇటీవల, చైనాలో ‘మురుగు నీటిలో’ వెల్లుల్లి పండిస్తున్నారని వైరల్ వీడియో పేర్కొంది. అంతేకాదు తమ దేశంలో పండించే వెల్లుల్లి  తెల్లగా కనిపించేలా చేయడానికి కృత్రిమంగా ‘బ్లీచ్’ చేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీరు వాడే టూత్‌పేస్ట్‌ నకిలీదా, అసలైనదా.. ఇలా తెలుసుకోండి
మీరు వాడే టూత్‌పేస్ట్‌ నకిలీదా, అసలైనదా.. ఇలా తెలుసుకోండి
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్..
వామ్మో వీడు మాములోడు కాదు..!
వామ్మో వీడు మాములోడు కాదు..!
ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ హీరో, మరో హీరోయిన్‌గా ఈ అమ్మడు
ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ హీరో, మరో హీరోయిన్‌గా ఈ అమ్మడు
బుధుడి అనుగ్రహం.. వీరికి భారీ లాభాలు.. ఒక్క దెబ్బకు లైఫ్ సెట్టు..
బుధుడి అనుగ్రహం.. వీరికి భారీ లాభాలు.. ఒక్క దెబ్బకు లైఫ్ సెట్టు..
బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను
బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను
వీడు మహా కంత్రీ.. దోచుకున్న బంగారాన్ని ఎలా అమ్ముతాడంటే..!
వీడు మహా కంత్రీ.. దోచుకున్న బంగారాన్ని ఎలా అమ్ముతాడంటే..!
వైట్ వర్సెస్ బ్రౌన్ ఎగ్‌.. దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి..
వైట్ వర్సెస్ బ్రౌన్ ఎగ్‌.. దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి..
కుటుంబాన్ని కలిపిన ఫేస్‌బుక్.. 25 ఏళ్ల తర్వాత ఆ ఇంట మళ్లీ సందడి!
కుటుంబాన్ని కలిపిన ఫేస్‌బుక్.. 25 ఏళ్ల తర్వాత ఆ ఇంట మళ్లీ సందడి!
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..