Govt Hospital: తండ్రిని చేతులపై మోసుకుంటూ పరుగున ఆస్పత్రికి వచ్చిన కొడుకు.. తీరా చూస్తే..!!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని దేహత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రి వైద్యం కోసం వచ్చిన ఓ వ్యక్తి ప్రభుత్వాసుపత్రిలో స్ట్రెచర్ లేక చేతులతోనే ఎత్తుకుని ఆసుపత్రిలోకి పరుగు పరుగున వెళ్లాడు. తండ్రిని ఒడిలో పెట్టుకుని నిస్సహాయుడైన కొడుకు కనిపించాడు. బాధితుడికి ఆసుపత్రి నిర్వాహకులు స్ట్రెచర్ ఇవ్వకపోగా.. కనీసం వైద్యం కూడా చేయలేదు. దీంతో చేతులపై మోసుకొచ్చిన తండ్రిని..తిరిగి అదే చేతులతో..

Govt Hospital: తండ్రిని చేతులపై మోసుకుంటూ పరుగున ఆస్పత్రికి వచ్చిన కొడుకు.. తీరా చూస్తే..!!
Uttar Pradesh Govt Hospital
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 02, 2023 | 11:24 AM

కాన్పూర్, నవంబర్‌ 2: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని దేహత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రి వైద్యం కోసం వచ్చిన ఓ వ్యక్తి ప్రభుత్వాసుపత్రిలో స్ట్రెచర్ లేక చేతులతోనే ఎత్తుకుని ఆసుపత్రిలోకి పరుగు పరుగున వెళ్లాడు. తండ్రిని ఒడిలో పెట్టుకుని నిస్సహాయుడైన కొడుకు కనిపించాడు. బాధితుడికి ఆసుపత్రి నిర్వాహకులు స్ట్రెచర్ ఇవ్వకపోగా.. కనీసం వైద్యం కూడా చేయలేదు. దీంతో చేతులపై మోసుకొచ్చిన తండ్రిని..తిరిగి అదే చేతులతో మోసుకుంటూ నిరాశగా వెనుదిరిగాడు.

కాన్పూర్‌లోని దేహత్‌లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి పుష్పేంద్ర అనే వ్యక్తి తన తండ్రి శివలిని చేతులపై మోసుకుంటూ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఎలాగోలా అవస్థలు పడుతూ డాక్టర్ క్యాబిన్‌కు చేరుకున్నాడు. కానీ అక్కడ డాక్టర్ లేరని తెలిసింది. దీంతో అతను నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే కనీసం ఆ ఆసుపత్రి సిబ్బంది స్ట్రెచర్ కూడా ఇవ్వలేదని వాపోయాడు. 6 నెలల క్రితం డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేశారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Man Carrying His Father With His Hands

Man Carrying His Father With His Hands

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. త్వరలోనే జిల్లాలో ఆరోగ్య వ్యవస్థలు మెరుగుపడతాయన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని దుయ్యబట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సౌకర్యాలపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై ప్రశ్నలను లేవనెత్తిన కాంగ్రెస్‌పై డిప్యూటీ సీఎంపై కూడా విరుచుకుపడ్డారు. ఇక ఈ విషయంపై జిల్లాకు చెందిన ఏ వైద్యారోగ్యశాఖ అధికారి స్పందించకపోవడం కొసమెరుపు.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో మరో ఘటన.. కరీంనగర్‌ కలెక్టర్‌ బంగ్లాలో దొంగతనం

కరీంనగర్‌ కలెక్టర్‌ నివాసముండే బంగ్లాలో జరిగిన చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్‌ సీఐ రవికుమార్‌ మాట్లాడుతూ.. కరీంనగర్‌ కలెక్టర్‌గా పనిచేసిన డా బి గోపిని ఎన్నికల సంఘం ఇటీవల బదిలీ చేసింది. దీంతో ఆయన తనకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేసి హైదరాబాద్‌కు వెళ్లేందుకు సామాగ్రి మొత్తం ప్యాక్‌ చేశారు. అక్టోబరు 29న సామగ్రిని ప్యాక్‌ చేసి ఆ రోజు రాత్రి నిద్రించారు. మరుసటి రోజు అంటే అక్టోబర్‌ 30న ఉదయం చూడగా బంగ్లాలోని ఓ గదిలోని విలువైన ధ్రువపత్రాలతోపాటు ఓ ల్యాప్‌టాప్‌, కలెక్టర్‌ లాగిన్‌ డిజిటల్‌ కీ, పెన్‌డ్రైవ్‌ కనబడకుండా పోయాయి. సీసీ ఫుటేజీ పరిశీలించగా.. అర్ధరాత్రి దాటాక గుర్తుతెలియని వ్యక్తి బంగ్లా వెనుక గోడ దూకి వచ్చి గదిలో ఉన్న వస్తువులను అపహరించినట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రవికుమార్‌ బుధవారం (నవంబర్ 1) తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.