AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIT-Delhi Student Suicide: ఐఐటీ- ఢిల్లీలో మరో విద్యార్ధి బలవన్మరణం.. ఈ ఏడాది వరుసగా మూడో ఆత్మహత్య

న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన మరో విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు. షహదారాలోని తన ఇంటికి వెళ్లిన విద్యార్ధి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఏడాది ఐఐటీ-ఢిల్లీలో చోటుచేసుకున్న విద్యార్ధుల ఆత్మహత్యల్లో ఇది మూడోది. ఐఐటీ-ఢిల్లీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐఐటీ ఢిల్లీలో మృతుడు (20) టెక్స్‌టైల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ బీటెక్ చదువుతున్నాడు. విద్యార్థికి తల్లిదండ్రులతో..

IIT-Delhi Student Suicide: ఐఐటీ- ఢిల్లీలో మరో విద్యార్ధి బలవన్మరణం.. ఈ ఏడాది వరుసగా మూడో ఆత్మహత్య
IIT-Delhi Student Suicide
Srilakshmi C
|

Updated on: Nov 02, 2023 | 9:11 AM

Share

ఢిల్లీ, నవంబర్‌ 2: న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన మరో విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు. షహదారాలోని తన ఇంటికి వెళ్లిన విద్యార్ధి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఏడాది ఐఐటీ-ఢిల్లీలో చోటుచేసుకున్న విద్యార్ధుల ఆత్మహత్యల్లో ఇది మూడోది. ఐఐటీ-ఢిల్లీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐఐటీ ఢిల్లీలో మృతుడు (20) టెక్స్‌టైల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ బీటెక్ చదువుతున్నాడు. విద్యార్థికి తల్లిదండ్రులతోపాటు ఒక తమ్ముడు కూడా ఉన్నారు. విద్యార్ధి వింధ్యాచల్ హాస్టల్‌లో నివసిస్తున్నాడు.

గత ఏడాది హాస్టల్ బాస్కెట్‌బాల్ జట్టుకు సాంస్కృతిక కార్యదర్శి, వైస్ కెప్టెన్‌గా కూడా పనిచేశాడు. ఏం జరిగిందో తెలియదుగానీ మంగళవారం అర్థరాత్రి అందరూ నిద్రపోయాక విద్యార్థి తన ఇంట్లోని గదిలో శవమై కనిపించాడు. దీనిపై కేసునమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రక్రియను ప్రారంభించారు. సూసైడ్ నోట్‌ను పోలీసులు ఇంకా స్వాధీనం చేసుకోలేదని సమాచారం. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబరులో తన స్నేహితుడు ఆత్మహత్య చేసుకుని మరణించినప్పటి నుంచి విద్యార్థి డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. విద్యార్ధి పరిస్థితి గురించి అతని కుటుంబ సభ్యులకు కూడా తెలుసని తెలిపారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో అనిల్‌కుమార్‌ (20) అనే విద్యార్ధి ఢిల్లీలోని ఐఐటీలోని హాస్టల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమార్ మ్యాథమ్యాటిక్స్‌, కంప్యూటింగ్‌లో టీటెక్ చదువుతున్నాడు. బ్యాక్స్‌ ఉన్నందున్న బీటెక్‌ డిగ్రీని సకాలంలో పూర్తి చేయలేక ఒత్తిడికి లోనయ్యాడు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు కుమార్‌కు గడువు పొడిగించినట్లు అధికారులు మీడియాకు తెలిపారు. అయినప్పటికీ కుమార్‌ సూసైడ్‌ చేసుకుని తనువు చాలించాడు. ఇక ఇదే ఏడాది జూలైలో ఐఐటి-ఢిల్లీలో మ్యాథమ్యాటిక్స్‌, కంప్యూటింగ్‌లో బిటెక్ చదువుతున్న ఆయుష్ అష్నా అనే మరో విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకుని మరణించాడు. మృతి చెందిన కుమార్, అష్నా ఇద్దరూ షెడ్యూల్డ్ కులాల (SC) కమ్యూనిటీకి చెందినవారు.

ఇవి కూడా చదవండి

కాగా 2018 నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఐఐటీల్లో 33 మంది, వివిధ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీలు) నుంచి 24 మంది, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో నలుగురు విద్యార్థులు సూసైడ్‌ చేసుకుని మరణించినట్లు విద్యాశాఖ సహాయ మంత్రి (MoS) సుభాస్ సర్కార్ ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంట్‌కు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి