Health Care: డెంగ్యూలో కొబ్బరి నీళ్లు, బొప్పాయి జ్యూస్ ని ఇలా తీసుకుంటున్నారా.. చాలా డేంజర్!

వాతావరణం మారింది.. శీతా కాలం వచ్చేసింది. మారుతున్న వెదర్ కి అనుగుణంగా.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యల బారిన పడిపోతాం. ముఖ్యంగా చలి కాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అందులోనూ శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గి పోతుంది. దీంతో మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాల బారిన పడతారు. ముఖ్యంగా చాలా మంది డెంగ్యూ వ్యాధి బారిన పడుతున్నారు. అందులోనూ లక్నోలో ఈ కేసుల సంఖ్య విపరీతంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రతి..

Health Care: డెంగ్యూలో కొబ్బరి నీళ్లు, బొప్పాయి జ్యూస్ ని ఇలా తీసుకుంటున్నారా.. చాలా డేంజర్!
Dengue
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 02, 2023 | 9:55 PM

వాతావరణం మారింది.. శీతా కాలం వచ్చేసింది. మారుతున్న వెదర్ కి అనుగుణంగా.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యల బారిన పడిపోతాం. ముఖ్యంగా చలి కాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అందులోనూ శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గి పోతుంది. దీంతో మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాల బారిన పడతారు. ముఖ్యంగా చాలా మంది డెంగ్యూ వ్యాధి బారిన పడుతున్నారు. అందులోనూ లక్నోలో ఈ కేసుల సంఖ్య విపరీతంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజూ డెంగ్యూ రోగుల సంఖ్య వెలుగులోకి వస్తుంది. దీంతో ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతూ ఉంటున్నాయి. డెంగ్యూ బారిన పడిన వాళ్లల్లో ప్లేట్ లేట్ కౌంట్ అనేది బాగా తగ్గిపోతుంది. ఇవి తగ్గిపోతే ప్రాణానికే ప్రమాదం. అయితే బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి పండు జ్యూస్, కొబ్బరి నీళ్లు, మేక పాలు వంటివి తాగితే ప్లేట్ లేట్స్ సంఖ్య అనేది పుంజుకుంటుందని చాలా మంది వాటి మీదనే ఆధారపడుతున్నారు. దీంతో వీటి రేటు అమాంతం పెరిగిపోయింది.

ఎక్కువ మోతాదులో అస్సలు తీసుకోకూడదు:

డెంగ్యూ వచ్చినప్పుడు మేక పాలు, కొబ్బరి నీళ్లు, బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడానికి సరైన మార్గం ఏంటి? ఎలా తీసుకోవాలో.. లక్నో ఆయుర్వేదిక్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ధర్మేంద్ర మాట్లాడుతూ.. చాలా మంది డెంగ్యూ వచ్చినప్పుడు విపరీతంగా బొప్పాయి ఆకుల రసం, కొబ్బరి నీళ్లు, మేక పాలు తీసుకుంటున్నారు. సాధారణంగా ఎలాంటి అనారోగ్యాలు లేనప్పుడు వీటిని తీసుకోవచ్చు. కానీ ప్రతి దానికీ స్థిరమైన పరిమాణం ఉంటుంది. దాన్ని సరైన విధంగా ఉపయోగించుకుంటేనే ప్రయోజనం ఉంటుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

డెంగ్యూలో బొప్పాయి ఆకుల రసాన్ని ఇలా తీసుకోవాలి:

డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు.. ఉదయం 5 ml, సాయంత్రం 5 ml మాత్రమే బొప్పాయి ఆకుల రసం తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుందని చెప్పారు. కానీ మంచిది కదా అని పదే పదే తాగితే మాత్రం వాంతులు, విరేచనాలు అయి.. మీ కాలేయంపై ప్రభావం పడుతుందని వివరించారు.

డెంగ్యూలో మేక పాలను ఇలా తీసుకోవాలి:

అలాగే మేక పాలను కూడా పరిమాణంలో తీసుకోవాలని సూచించారు. డెంగ్యూలో ఉన్నప్పుడు ఉదయం 15 మిల్లీ లీటర్లు, సాయంత్రం 15 మిల్లీ లీటర్లు తీసుకోవాలని డాక్టర్ ధర్మేంద్ర వెల్లడించారు. అంతే కానీ రోజంతా అధిక మోతాదులో తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. మేక పాలను ఎక్కువగా తీసుకుంటే అనేక పొట్ట సంబంధిత వ్యాధులు వస్తాయని సూచించారు.

డెంగ్యూలో కొబ్బరి నీళ్లను ఇలా తీసుకోవాలి:

కొబ్బరి నీళ్లు అనేవి చాలా మంచిది. వీటిల్లో ఔషధాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తాగితే బాడీ డీహైడ్రేషన్ కు కూడా గురి కాదు. కానీ డెంగ్యూ వ్యాధిగ్రస్తులు మాత్రం ఉదయం 15 15 మిల్లీ లీటర్లు, సాయంత్రం 15 మిల్లీ లీటర్లు తీసుకోవాలని చెప్పారు. మంచివని రోజంతా వీటిని తీసుకుంటే.. వారు అనేక తీవ్రమైన ఉదర సంబంధిత వ్యాధులకు గురవుతారని చెప్పారు. ఇది మూత్ర పిండాలు, కాలేయంపై ప్రభావం చూపిస్తుందని డాక్టర్ ధర్మేంద్ర వివరించారు.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో చేసే ముందు నిపుణులను సంప్రదించండి.

ధనుష్‌కు తమిళ నిర్మాతల షాక్.. ఇకపై ఆ కండీషన్స్‌కు ఒప్పుకుంటేనే..
ధనుష్‌కు తమిళ నిర్మాతల షాక్.. ఇకపై ఆ కండీషన్స్‌కు ఒప్పుకుంటేనే..
వారెవ్వా.. శ్రీశైలం ప్రాజెక్టులో అద్భుత దృశ్యం.. డ్రోన్ విజువల్స్
వారెవ్వా.. శ్రీశైలం ప్రాజెక్టులో అద్భుత దృశ్యం.. డ్రోన్ విజువల్స్
కనువిందు చేస్తున్న జలపాతలు.. తరలివస్తున్న పర్యాటకులు.!
కనువిందు చేస్తున్న జలపాతలు.. తరలివస్తున్న పర్యాటకులు.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!