- Telugu News Photo Gallery Spirituality Tips: If you see these animals in your dream, you will be lucky, check here is details
Spirituality Tips: కలలో ఈ జంతువులు కనిపిస్తే అదృష్ట వంతులు అవుతారు!
సాధారణంగా నిద్ర పోతున్నప్పుడు కలలు రావడం సహజం. ఉదయం లేచిన తర్వాత చాలా మందికి ఆ కలలు ఏంటో అన్నది కూడా గుర్తుకు రాదు. కానీ కొన్ని కలలు మాత్రం బాగా గుర్తుంటాయి. అయితే కలలు బట్టి కూడా మనకు అదృష్టం కలిసి వస్తుందో.. లేదో తెలుసుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలీదు. కొన్ని కలలు వస్తే కష్టాలు ఎదురవుతాయన్న సంకేతాలు కూడా ఉంటాయి. మన ఆలోచనలు, నిర్ణయాలను బట్టే కలలు వస్తూంటాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ నాలుగు జంతువులు మాత్రం..
Chinni Enni | Edited By: Ram Naramaneni
Updated on: Nov 02, 2023 | 9:55 PM

సాధారణంగా నిద్ర పోతున్నప్పుడు కలలు రావడం సహజం. ఉదయం లేచిన తర్వాత చాలా మందికి ఆ కలలు ఏంటో అన్నది కూడా గుర్తుకు రాదు. కానీ కొన్ని కలలు మాత్రం బాగా గుర్తుంటాయి. అయితే కలలు బట్టి కూడా మనకు అదృష్టం కలిసి వస్తుందో.. లేదో తెలుసుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలీదు. కొన్ని కలలు వస్తే కష్టాలు ఎదురవుతాయన్న సంకేతాలు కూడా ఉంటాయి. మన ఆలోచనలు, నిర్ణయాలను బట్టే కలలు వస్తూంటాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ నాలుగు జంతువులు మాత్రం కలలో వస్తే మంచి లక్ ఉంటుందని.. పెద్దలు కూడా చెబుతూంటారు. మరి ఆ జంతువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవు: ఆవు అనేది శుభ సూచికం. హిందూ సంప్రదాయంలో ఆవును దేవతగా పూజిస్తారు. స్వప్న శాస్త్ర ప్రకారం ఆవు కలలో కనిపిస్తే.. మనం చేపట్టిన పనుల్లో ఎలాంటి అవరోధాలు లేకుండా విజయం సాధిస్తుందని అర్థం. ఈ కల వచ్చిన వాళ్లు ఆవుకు రొట్టెలు, గడ్డి, నానబెట్టిన పప్పులు వంటివి తినిపిస్తే మంచిది.

గుడ్లగూబ: చాలా మంది కలలోకి గుడ్ల గూబలు కూడా వస్తాయి. సాధారణంగా మనకు గుడ్ల గూబ కనిపిస్తే అపశకునంలా భావిస్తాం. కానీ కలలో వస్తే మాత్రం లక్ష్మీ దేవి అనుగ్రహం కలిగి, ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదని చెబుతూంటారు.

బరువు తగ్గాలనుకుంటే, వ్యాయామం, కఠిన ఆహార నియమాలు అనుసరించడం చాలా ముఖ్యం. అయితే నిద్ర పోవడం వల్ల కూడా బరువు తగ్గొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే మధుమేహం, ఊబకాయం, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కంటి నిండా నిద్రపోకపోతే బరువు తగ్గడానికి నిద్ర పెద్ద అడ్డంకిగా మారుతుంది.

పాములు: చాలా మందికి పాములు అనేవి కలలోకి వస్తూంటాయి. దీంతో ఆందోళనకు గురవుతారు. అయితే కలలో పాము కాటు వేసినట్టు వస్తే మాత్రం చాలా మంచిదని పెద్దలే కాకుండా.. శాస్త్ర నిపుణులు కూడా చెబుతూంటారు. అంతే కాకుండా ఆర్థికంగా ఇబ్బందులు తొలగి, జీవితంలో విజయం సాధిస్తారు.





























