AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boosting Immunity in Winter: చలి కాలంలో రోగాల బారిన పడకుండా ఉండాలంటే వీటిని తినండి!

శీతాకాలం వచ్చేసింది. చలి కాలంలో కేవలం ఆరోగ్య సమస్యలే కాకుండా, చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువే. ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు, అనారోగ్య సమస్యలు అన్నీ ఎక్కువే. కాబట్టి ముందుగానే రోగాల బారిన పడకుండా ఉండాలంటే.. ముందుగానే జాగ్రత్తలు పాటించాలి. సరైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా, అందంగా ఉంటారు. ఈ కాలంలో ముఖ్యంగా జలుబు, దగ్గు వెంటాడుతూంటాయి. అయితే ట్యాబ్లెట్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా మనం..

Boosting Immunity in Winter: చలి కాలంలో రోగాల బారిన పడకుండా ఉండాలంటే వీటిని తినండి!
Winter Season
Chinni Enni
| Edited By: |

Updated on: Nov 03, 2023 | 8:50 AM

Share

శీతాకాలం వచ్చేసింది. చలి కాలంలో కేవలం ఆరోగ్య సమస్యలే కాకుండా, చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువే. ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు, అనారోగ్య సమస్యలు అన్నీ ఎక్కువే. కాబట్టి ముందుగానే రోగాల బారిన పడకుండా ఉండాలంటే.. ముందుగానే జాగ్రత్తలు పాటించాలి. సరైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా, అందంగా ఉంటారు. ఈ కాలంలో ముఖ్యంగా జలుబు, దగ్గు వెంటాడుతూంటాయి. అయితే ట్యాబ్లెట్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా మనం తినే ఆహారాలతోనే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. మరి చలి కాలంలో రోగాల బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యాపిల్:

యాపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉండొచ్చు. కాబట్టి ప్రతి రోజూ ఒక యాపిల్ ను మీ డైట్ లో చేర్చుకోండి. అందులోనూ పరగడుపున యాపిల్ తింటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. యాపిల్ లో విటమిన్ ఏ, బి, సి, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక్క యాపిల్ తింటే మన శరీరానికి కావాల్సినంత శక్తి కూడా అందుతుంది. చర్మం కూడా తేమగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మసాలా దినుసులు:

చలి కాలంలో బాడీలో హీట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ కాలంలో మసాలా దినుసులతో తయారు చేసే ఆహారాలు తినడం వల్ల అనేక రోగాలు నయం అవుతాయి.

ఆకు కూరలు:

ఆకు కూరల్లో ఉండే పోషకాలు, బెనిఫిట్స్ అన్నీ ఇన్నీ కావు. కాబట్టి వారంలో రెండు, మూడు సార్లైనే మీ ఆహారంలో ఆకు కూరలు ఉండేలా చూసుకోండి. అలాగే వాటిని వండే ముందు శుభ్రంగా చేసుకోవడం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వాటిపై క్రిమి, కీటకాలు ఎక్కువగా ఉంటాయి.

సూప్స్:

ఈ కాలంలో వెజ్ లేదా నాన్ వెజ్ సూప్స్ తాగడం చాలా బెటర్. సాధారణంగా రెస్టారెంట్స్, హెటల్స్ కి వెళ్లినప్పుడే తింటారు. అలా కాకుండా ఇంట్లో కూడా అప్పుడప్పుడు సూప్స్ వంటివి చేసుకుని తాగితే చాలా బెటర్. సూప్స్ లో ఎన్నో రకాలు ఉంటాయి. మీ టేస్ట్ కి తగ్గట్టుగా తయారు చేసుకుని తాగితే ఇవి చలి నుంచి కాపాడతాయి.

ఎక్సర్ సైజ్ చేయాలి:

వింటర్ సీజన్ లో చలి అనేది ఎక్కువగా ఉంటుంది. కాస్త బద్ధకంగా ఏ పని చేయాలనిపించదు. దీంతో బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చలి కాలంలో ఇంట్లో అయినా వాకింగ్, యోగా ఆసనాలు, ఎక్సర్ సైజ్ లు చేయడం చాలా మంచిది. ఇవి చేయడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో చేసే ముందు నిపుణులను సంప్రదించండి.

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?