AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: బీఅలర్ట్.. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డయాబెటిక్ ప్రమాదంలో పడుతున్నట్లే..

Prediabetes Symptoms: ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్య అందరిలో కనిపిస్తోంది. అయితే, మధుమేహం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. కానీ నేటి కాలంలో మధుమేహానికి అత్యధికంగా ప్రధాన కారణం శారీరక శ్రమ తక్కువ. ఇది కాకుండా ఇంట్లో వండిన ఆహారాన్ని తక్కువగా తినడం.. మద్యం సేవించడం.. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం.. ఇవన్నీ కూడా కారకాలే..

Health: బీఅలర్ట్.. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డయాబెటిక్ ప్రమాదంలో పడుతున్నట్లే..
Prediabetes Symptoms
Shaik Madar Saheb
|

Updated on: Nov 03, 2023 | 6:53 AM

Share

Prediabetes Symptoms: ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్య అందరిలో కనిపిస్తోంది. అయితే, మధుమేహం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. కానీ నేటి కాలంలో మధుమేహానికి అత్యధికంగా ప్రధాన కారణం శారీరక శ్రమ తక్కువ. ఇది కాకుండా ఇంట్లో వండిన ఆహారాన్ని తక్కువగా తినడం.. మద్యం సేవించడం.. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం.. ఇవన్నీ కూడా కారకాలే.. మధుమేహం రాకుండా ఉండాలంటే ముందుగా జీవనశైలిని మార్చుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని, వ్యాయామం, యోగా వంటివి జీవితంలో ముఖ్యమైన భాగంగా చేసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మధుమేహాన్ని ఎలా నివారించాలి..? దాని ప్రారంభ లక్షణాలు ఏమిటి? ఈ విషయాన్ని తెలుసుకునేందుకు టీవీ9 ఫోర్టిస్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ అనిల్ గోంబర్‌తో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను పంచుకున్నారు.

మీరు అధిక బరువుతో బాధపడుతున్నా.. మీ కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉన్నా.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎందుకంటే అధిక బరువు.. తప్పుడు ఆహారపు అలవాట్లు మిమ్మల్ని ఈ వ్యాధి వైపు నడిపిస్తాయి. అందువల్ల, మీ బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నించాలని పేర్కొన్నారు. మంచి ఆహారం తీసుకోవాలని.. ఎక్కువ నీరు త్రాగాలని.. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేయాలని సూచించారు.

ప్రీ-డయాబెటిస్ లక్షణాలు?

ప్రీ-డయాబెటిస్ లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి.. ఇవి ఏ రోగిలోనైనా చాలా ఆలస్యంగా గుర్తించడం జరుగుతుంది. కానీ వారు దాని గురించి తెలుసుకునే సమయానికి, చాలా ఆలస్యం అవుతుందని డాక్టర్ తెలిపారు. అప్పటికే వారికి టైప్ 2 డయాబెటిస్ వస్తుందన్నారు. మనం ప్రీ-డయాబెటిస్ లక్షణాల గురించి మాట్లాడినట్లయితే, వాటిలో పెరిగిన లేదా తగ్గిన ఆకలి.. అలసట.. అధిక దాహం లాంటివి కనిపిస్తాయి.

హార్మోన్లపై మధుమేహం ప్రభావం

పురుష, మహిళ అనే తేడా లేకుండా మధుమేహం వారి హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తుందని.. పురుషుల్లో మధుమేహం ఉన్నప్పుడు టెస్టోస్టెరాన్ స్థాయి పడిపోతుందని డాక్టర్ వివరించారు. మహిళల్లో హార్మోన్ స్థాయిలు కూడా తగ్గుతాయి.

షుగర్ రోగులు ఏ పండ్లు తినాలి?

డయాబెటిక్ పేషెంట్లు అన్ని పండ్లను తినవచ్చని, అయితే డయాబెటిక్ రోగులు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఆరెంజ్, కివీ, సీజనల్ ఫ్రూట్స్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు బాగా మేలు చేస్తాయి.

వీటిని నివారించండి..

డయాబెటిక్ పేషెంట్లు మద్యం సేవించకూడదు.. ఇంకా వేయించిన ఆహారం, అన్నం, బంగాళదుంపలు ఎక్కువగా తినకూడదు. మామిడి, పైనాపిల్, సపోటా వంటి తీపి పండ్లను ఎక్కువగా తీసుకోకూడదని డాక్టర్ అనిల్ గోంబర్ వివరించారు. ప్రీ డయాబెటిక్ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిదని పేర్కొన్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..