Saffron Benefits: కుంకుమ పువ్వుతో రంగు మాత్రమే కాదు.. గుండె జబ్బులు, డిప్రెషన్ మాయం!
కుంకుమ పూలు అనగానే వెంటనే గర్భిణీ స్త్రీలే గుర్తొస్తారు. ఎందుకంటే వీటిని వారే ఎక్కువగా ఉపయోగిస్తారు. కుంకుమ పూలను గర్భంతో ఉన్న మహిళలు పాల్లలో కలుపుకుని తాగితే పుట్టే పిల్లలు తెల్లగా ఉంటారని పెద్దలు నమ్ముతూంటారు. పూర్వం కుంకుమ పువ్వును టీలో కూడా కలుపుకుని తాగేవారు. అలాగే పలు రకాల ఆహార పదార్థాల్లో కూడా ఉపయోగించేవారు. కుంకుమ పువ్వుతో నేచురల్ గా కలర్, సువాసన వస్తూంటాయి. వంటల్లో కూడా ఒకలాంటి టేస్ట్ వస్తుంది. వీటిని..
కుంకుమ పూలు అనగానే వెంటనే గర్భిణీ స్త్రీలే గుర్తొస్తారు. ఎందుకంటే వీటిని వారే ఎక్కువగా ఉపయోగిస్తారు. కుంకుమ పూలను గర్భంతో ఉన్న మహిళలు పాల్లలో కలుపుకుని తాగితే పుట్టే పిల్లలు తెల్లగా ఉంటారని పెద్దలు నమ్ముతూంటారు. పూర్వం కుంకుమ పువ్వును టీలో కూడా కలుపుకుని తాగేవారు. అలాగే పలు రకాల ఆహార పదార్థాల్లో కూడా ఉపయోగించేవారు. కుంకుమ పువ్వుతో నేచురల్ గా కలర్, సువాసన వస్తూంటాయి. వంటల్లో కూడా ఒకలాంటి టేస్ట్ వస్తుంది. వీటిని ఆయుర్వేదంలో కూడా పలు రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంలా వాడేవారు. కుంకుమ పువ్వుతో ఈ ప్రయోజనాలే కాకుండా.. ఇంకా ఎన్నో ఉన్నాయి. రక్త పోటు, కడుపు లోపాటు, గుండె జబ్బులు, మతి మరపు వంటి సమస్యలను నయం చేయడంలో హెల్ప్ చేస్తుంది. అంతే కాదు కుంకుమ పువ్వులో డిప్రెషన్ ను పోగొట్టే లక్షణాలు కూడా ఉన్నాయి. ఇంకా కుంకుమ పువ్వుతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మానసిక సమస్యలు తగ్గిస్తుంది:
సాఫ్రాన్ తో మానసిక రుగ్మతలను తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. కొన్ని పరిశోధనల ప్రకారం కుంకుమ పువ్వును ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే.. ఒత్తిడిని కూడా దూరం చేస్తుందని తేలింది.
మెదడు పనితీరు మెరుగు పడుతుంది:
కుంకుమ పువ్వుతో మెదడు పని తీరు కూడా మెరుగు పడుతుంది. బ్రెయిన్ యాక్టీవ్ అవుతుంది. చిన్న పిల్లలకు సాఫ్రాన్ కు పాలల్లో కలిపి ఇస్తే చాలా మంచిది. అలాగే న్యూరో ప్రొటెక్షన్, జ్ఞాపక శక్తి, అభ్యాస సామర్థ్యాలను మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కంటి ఆరోగ్యం:
కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, క్రోసిన్.. కంటికి రక్షణగా ఉంటాయి. వయస్సు సంబంధిత కంటి సమస్యలను కూడా నివారిస్తుంది.
గుండె ఆరోగ్యం:
సాఫ్రాన్ తో గుండెకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రక్త పోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించి.. ఆరోగ్యాన్ని మెరుగు పరిచే సామర్థ్యాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఫ్రీ రాడికల్స్ ను నశింపజేస్తుంది:
సాఫ్రాన్ లో క్రోసిన్, క్రోసెటిన్, సఫ్రానల్ వంటి సమ్మేళనాలు యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ను నశింప జేసి, బాడీలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.
బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది:
రక్తంలె చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కుంకుమ పువ్వు బాగా హెల్ప్ చేస్తుంది. మధు మేహం ఉన్నవారు కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయని పలు అధ్యయనాల్లో తేలింది.
గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించడం మేలు.