Feet Care in Winter: చలి కాలంలో అందమైన పాదాల కోసం.. వీటిని ట్రై చేయండి!

ఏ పని చేయాలన్నా కాళ్లు చాలా ముఖ్యం. కానీ కాళ్లను మాత్రం సరిగ్గా పట్టించుకోరు. వాటి గురించి సరైన కేర్ తీసుకోరు. ముఖానికి ఇచ్చే ఇంపార్టెన్స్ పాదాలకు ఇవ్వరు. అదే పాదాలపై డెడ్ స్కిన్ సెల్స్, మురికి బాగా పేరుకు పోయి.. అంద విహీనంగా కనిపిస్తాయి. దళసరిగా మారిపోవడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు వస్తూంటాయి. పాదాలు కూడా చాలా సున్నితమైనవే. వాటి పట్ల సరైన కేర్ తీసుకుంటే అవి కూడా ఎంతో అందంగా కనిపిస్తాయి. పాదాలను అందంగా మార్చడంలో..

Feet Care in Winter: చలి కాలంలో అందమైన పాదాల కోసం.. వీటిని ట్రై చేయండి!
Feet Care
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 01, 2023 | 10:07 PM

ఏ పని చేయాలన్నా కాళ్లు చాలా ముఖ్యం. కానీ కాళ్లను మాత్రం సరిగ్గా పట్టించుకోరు. వాటి గురించి సరైన కేర్ తీసుకోరు. ముఖానికి ఇచ్చే ఇంపార్టెన్స్ పాదాలకు ఇవ్వరు. అదే పాదాలపై డెడ్ స్కిన్ సెల్స్, మురికి బాగా పేరుకు పోయి.. అంద విహీనంగా కనిపిస్తాయి. దళసరిగా మారిపోవడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు వస్తూంటాయి. పాదాలు కూడా చాలా సున్నితమైనవే. వాటి పట్ల సరైన కేర్ తీసుకుంటే అవి కూడా ఎంతో అందంగా కనిపిస్తాయి. పాదాలను అందంగా మార్చడంలో ఉపయోగ పడే కొన్ని రకాల టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్క్రబ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:

పాదాలకు స్క్రబ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాదాల్లో రక్త ప్రసరణ మెరుగవుతుంది. నొప్పులు లాంటివి ఏమైనా ఉంటే తగ్గుతాయి. పాదాలపై పేరుకుపోయిన మురికి, మృత కణాలు తొలగి పోతాయి. మెదడు నుంచి పాదాలకు కొన్ని రకాల నాడులు ఉంటాయి. పాదాలకు మర్దనా చేయడం వల్ల మెదడు కూడా రిలీఫ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

కాఫీ పొడి – పంచదార:

ఒక చిన్న బౌల్ లోకి కాఫీ పొడిని, పంచదారను సమపాళ్లలో తీసుకోవాలి. ఇందులోకి కొబ్బరి నూనె లేదా ఆలీవ్ ఆయిల్ ని కానీ తీసుకుని పేస్ట్ లా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని పాదాలకు, మడమలకు రాసి.. బాగా మర్దనా చేసుకోవాలి. ఓ పది నిమిషాల తర్వాత కాళ్లను శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల పాదాలు శుభ్ర పడతాయి.

బ్రౌన్ షుగర్ – ఆలీవ్ ఆయిల్:

కొద్దిగా బ్రౌన్ షుగర్ లో ఆలీవ్ ఆయిల్ వేసి. పాదాలకు, మడమలకు సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా ఐదు నిమిషాల పాటు చేసుకోండి. ఆ తర్వత శుభ్రంగా పదాలను క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు ఫాస్ట్ గా, కాంతి వంతంగా తయారవుతాయి.

బేకింగ్ సోడా స్క్రబ్:

రోజుల్లో చాలా సేపు నిలబడటం వల్ల పాదాలు నొప్పులు పుడతాయి. ఈ నొప్పిని తగ్గించడంలో బేకింగ్ సోడా బాగా హెల్ప్ చేస్తుంది. కొద్దిగా బేకింగ్ సోడాకు నీటిని కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. కాసేపు సున్నితంగా మసాజ్ చేసుకుని, పది నిమిషాల తర్వాత కడిగేసుకోండి. లేదా గోరు వెచ్చని నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి అందులో ఓ పది నిమిషాలు కాళ్లను ఉంచండి. ఇలా చేసినా కూడా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు చర్మ నిపుణులను సంప్రదించడం మేలు.