Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ముందుగానే ఇలా జాగ్రత్తలు తీసుకోండి!

శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన భాగం. బ్రెయిన్ సరిగ్గా పని చేస్తేనే.. శరీరంలోని ఇతర భాగాలన్నీ ఆరోగ్యా ఉంటాయి. మెదడు యాక్టీవ్ గా షార్ప్ పని చేస్తేనే ఏ పనినైనా చేయగలం. ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. దీన్ని తట్టుకోలేని వారు బ్రెయిన్ స్ట్రోక్ తో మరణిస్తున్నారు. ఇటీవల ఈ సంఖ్య బాగా ఎక్కువైంది. ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఆ తర్వాత ఏమీ చేయలేని పరిస్థితి..

Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ముందుగానే ఇలా జాగ్రత్తలు తీసుకోండి!
Brain
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 01, 2023 | 10:10 PM

శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన భాగం. బ్రెయిన్ సరిగ్గా పని చేస్తేనే.. శరీరంలోని ఇతర భాగాలన్నీ ఆరోగ్యా ఉంటాయి. మెదడు యాక్టీవ్ గా షార్ప్ పని చేస్తేనే ఏ పనినైనా చేయగలం. ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. దీన్ని తట్టుకోలేని వారు బ్రెయిన్ స్ట్రోక్ తో మరణిస్తున్నారు. ఇటీవల ఈ సంఖ్య బాగా ఎక్కువైంది. ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఆ తర్వాత ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటుంది.

మెదడులోని ఒక భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ జరగకుండా అంతరాయం ఏర్పడినప్పుడే ఈ స్ట్రోక్ వస్తుంది. ఈ స్ట్రోక్ వల్ల బ్రెయిన్ అందాల్సిన ఆక్సిజన్, ఇతర పోషకాలు అందవు. దీంతో ఆ కణాలు చనిపోతాయి. దీంతో శరీరంలో ఇతర భాగాలు సరిగా పని చేయవు. ఇది తీవ్రతరమై బ్రెయిన్ స్ట్రోక్ కు దారి తీస్తుంది. కాబట్టి ముందస్తుగానే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సరైన ఆహారం తీసుకోవాలి:

ఇవి కూడా చదవండి

మంచి ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం. మనం తీసుకునే ఆహారంలోనే అంతా ఉంది. కాబట్టి అన్నీ సమపాళ్లల్లో ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రెయిన్ ని యాక్టీవ్ గా ఉంచే ఆహారాలను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

సరిపడినంత నిద్ర:

ఆహారం ఎంత ముఖ్యమో.. దాని కంటే నిద్ర చాలా అవసరం. ఆహారం లేకపోయినా ఉంటారేమో కానీ.. నిద్ర లేకపోతే మాత్రం చాలా కష్టం. కాబట్టి రోజూ వారీ జీవితంలో సరిపడినంత నిద్ర ఉండేలా చూసుకోండి. నిద్ర లేకపోతే గుండె జబ్బులు, మధు మేహం, అధిక బరువు వంటి సమస్యలే కాకుండా మెదడుపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.

ఒత్తిడిని తగ్గించుకోవాలి:

ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా రోజూ ఒత్తిడికి గురవుతూనే ఉంటారు. కాబట్టి వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మీ పనులను ముందుగానే చేసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకవోచ్చు. ఈ ఒత్తిడి వల్ల బ్రెయిన్ స్ట్రోక్, గుండె పోటు వంటివి వచ్చే ప్రమాదం ఉంది.

ధూమపానం, మద్య పానం తగ్గించాలి:

ధూమా పానం, మధ్య పానం రెండూ బ్రెయిన్ పై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఇవి కాస్తా బ్రెయిన్ స్ట్రోక్ కు కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పొగాకు రక్త నాళాలను సంకోచించేలా చేస్తుంది. అలాగే ఆల్కాహాల్ వినియోగం కూడా రక్తా పోటుకు కారణం అవుతుంది.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించడం మేలు.