AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic Benefits in Winter: వింటర్ సీజన్ లో వెల్లుల్లితో అన్ని బెనిఫిట్స్ ఉంటాయన్న సంగతి మీకు తెలుసా?

వెల్లుల్లితో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెల్లుల్లిని నిత్యం వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అంతే కాకుండా స్పెషల్ గా వింటర్ వెల్లుల్లి సూప్ కూడా చేసుకుని తాగుతూ ఉంటారు. ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా వెల్లుల్లిని ఔషధంలా ఉపయోగిస్తారు. వాటితో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా వింటర్ సీజన్ లో వెల్లుల్లి తీసుకోవడం వల్ల మరిన్ని..

Garlic Benefits in Winter: వింటర్ సీజన్ లో వెల్లుల్లితో అన్ని బెనిఫిట్స్ ఉంటాయన్న సంగతి మీకు తెలుసా?
Garlic
Chinni Enni
| Edited By: |

Updated on: Nov 01, 2023 | 10:08 PM

Share

వెల్లుల్లితో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెల్లుల్లిని నిత్యం వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అంతే కాకుండా స్పెషల్ గా వింటర్ వెల్లుల్లి సూప్ కూడా చేసుకుని తాగుతూ ఉంటారు. ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా వెల్లుల్లిని ఔషధంలా ఉపయోగిస్తారు. వాటితో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా వింటర్ సీజన్ లో వెల్లుల్లి తీసుకోవడం వల్ల మరిన్ని బెనిఫిట్స్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వెల్లుల్లిలో విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, క్యాల్షియం, మాంగనీస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. శీతా కాలంలో వెల్లుల్లి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు పెరిగి కణాలు దెబ్బ తినకుండా ఉంటాయి. రక్తాన్ని పలుచగా చేసి ధమనులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా శీతా కాలంలో వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చలి నుండి ఉపశమనం లభిస్తుంది:

ఇవి కూడా చదవండి

వెల్లుల్లిలో వేడి పుట్టించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి.. చలిని తగ్గిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెంచుతుంది. కాళ్లకు, చేతులకు వెచ్చదనాన్ని ఇస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల సహజంగా ఉష్ణోగ్రత పెరుగుతుంది. అయితే మరీ ఎక్కువగా తీసుకుంటే.. వేడి చేస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

చలి కాలంలో రోగ నిరోధక శక్తి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శీతా కాలంలో బ్యాక్టీరియా, వైరస్ లు, ఇన్ ఫెక్షన్లు ఎటాక్ చేస్తాయి. దీని వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి చలి కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే.. వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలను కలిగి ఉన్న అల్లిసిన్ అనే సమ్మేళనం.. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

జలుబు, దగ్గను కంట్రోల్ చేస్తుంది:

చలి కాలంలో సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం, ఉబ్బసం, శ్వాస కోశ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు. వెల్లుల్లి సహజంగా యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి వెల్లుల్లి తీసుకోవడం వల్ల జబులు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లితో చట్నీ, సూప్స్, కూరలు చేసుకోవచ్చు. ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి రెబ్బలు తిన్నా రోగ నిరోధక శక్తి వస్తుంది.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించడం మేలు.

సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్