AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raisin: డయాబెటిస్‌ పేషెంట్లు ఎండు ద్రాక్ష తినొచ్చా? తినకూడదా? నిపుణులు ఎం చెబుతున్నారంటే..

డయాబెటిక్ పేషెంట్లు ఏది తినాలన్నా, తాగాలన్నా అనేక షరతులు ఉంటాయి. షుగర్ పేషెంట్లు బయటి ఆహారాన్ని అస్సలు తినకూడదు. ముఖ్యంగా తియ్యగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. చలికాలంలో డ్రై ఫ్రూట్స్‌ వినియోగం పెరుగుతుంది. ముఖ్యంగా బాదం, వాల్‌నట్‌లు, ఎండుద్రాక్షలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఎండుద్రాక్ష ఇతర పండ్ల కంటే తియ్యగా ఉంటుంది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎండుద్రాక్ష తినొచ్చో? లేదో అనే విషయం చాలా..

Srilakshmi C

|

Updated on: Nov 02, 2023 | 1:53 PM

డయాబెటిక్ పేషెంట్లు ఏది తినాలన్నా, తాగాలన్నా అనేక షరతులు ఉంటాయి. షుగర్ పేషెంట్లు బయటి ఆహారాన్ని అస్సలు తినకూడదు. ముఖ్యంగా తియ్యగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.

1 / 5
చలికాలంలో డ్రై ఫ్రూట్స్‌ వినియోగం పెరుగుతుంది. ముఖ్యంగా బాదం, వాల్‌నట్‌లు, ఎండుద్రాక్షలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఎండుద్రాక్ష ఇతర పండ్ల కంటే తియ్యగా ఉంటుంది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎండుద్రాక్ష తినొచ్చో? లేదో అనే విషయం చాలా మందికి తెలియదు.

2 / 5
ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉన్న ఆహారాలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినికూడదు. ఇలాంటి ఆహారాలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. అయితే ఎండుద్రాక్షలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. అయితే ఎండుద్రాక్ష తినడం వల్ల షుగర్ లెవెల్ ఒక్కసారిగా పెరిగిపోతుందన్న భయం అక్కరలేదు. ఎందుకంటే ఈ ఆహారంలో ఫైబర్ ఉంటుంది.

3 / 5
ఫైబర్ చక్కెరను గ్రహించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం చాలా అవసరం. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

4 / 5
ఎండుద్రాక్షలో కేలరీలు ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుంది. కాబట్టి ఎండు ద్రాక్షను మితంగా తినడం మంచిది. ఎండుద్రాక్షలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తినాలి. అంటే, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎండుద్రాక్షను పరిమితంగా తినాలన్నమాట.

5 / 5
Follow us