Water: మీరు తాగే నీరు మంచివేనా..? లేకపోతే ప్రాణాలకే ప్రమాదం.. బీకేర్‌ఫుల్

Water pollution: ఉరుకులు పరుగుల జీవితంలో మన ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే, మన జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో నీటి సహకారం చాలా ముఖ్యమైనది. కానీ ప్రస్తుత కాలంలో కాలుష్యం కూడా తీవ్రమైన సమస్యగా మారింది. మనం తాగే నీరు ఎంత శుభ్రంగా ఉంటుంది? దీని గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం.

Water: మీరు తాగే నీరు మంచివేనా..? లేకపోతే ప్రాణాలకే ప్రమాదం.. బీకేర్‌ఫుల్
Water
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 05, 2023 | 4:06 PM

Water pollution: ఉరుకులు పరుగుల జీవితంలో మన ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే, మన జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో నీటి సహకారం చాలా ముఖ్యమైనది. కానీ ప్రస్తుత కాలంలో కాలుష్యం కూడా తీవ్రమైన సమస్యగా మారింది. మనం తాగే నీరు ఎంత శుభ్రంగా ఉంటుంది? దీని గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. కలుషితమైన నీరు మీ కడుపుకు హాని కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.. కలుషిత నీరు ఉదరానికి హాని కలిగిస్తుందని న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌లోని గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సుదీప్ ఖన్నా చెప్పారు. టీవీ9 భారత్‌వర్ష్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.

నీటిని కలుషితం చేసే కారకాలను గుర్తించడం చాలా ముఖ్యమని చెప్పారు. కాలుష్య కారకాలలో భారీ లోహాలు, పురుగుమందులు, రసాయన కణాలు ఉన్నాయి. ఇవి నీటిలో కలిసిపోయి దానిని పాడు చేస్తాయి. అలాంటి నీటిని తాగడం వల్ల మన శరీరం ఇన్ఫెక్షన్లకు గురవుతుంది.

ఇన్ఫెక్షన్ల ప్రమాదం..

గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్లు నీటిని కలుషితం చేసే సూక్ష్మజీవుల వల్ల తలెత్తుతాయని ఖన్నా వివరించారు . అవి నేరుగా మానవ ప్రేగులను వేటాడతాయి. ఎనాటోమెబిస్టోలిటికా, ఇ. కోలి, సాల్మొనెల్లా, గియార్డియా వంటి బ్యాక్టీరియా తీవ్రమైన కడుపు ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. అంతే కాదు ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తుంది.

ప్రాణాలకే ప్రమాదం..

ఈ వ్యాధుల ప్రమాదం ఏమిటంటే కలుషితమైన నీటిలో అధిక మొత్తంలో సీసం, ఆర్సెనిక్, పాదరసం ఉన్నాయి. ఇవి జీర్ణ ఆరోగ్యానికి మరింత హాని కలిగిస్తాయి. ఈ విష కణాల వల్ల జీర్ణక్రియ బలహీనమవుతుంది. దీని వల్ల పొట్టలో పుండ్లు, అల్సర్, పోషకాలు అందకపోవడం వంటి అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. కలుషితమైన నీటిని తాగడం వల్ల పేగు వ్యాధులు, డైస్బియోసిస్ వంటి వివిధ జీర్ణశయాంతర సమస్యలు వస్తాయి. ఇది రోగి జీవితానికి ప్రమాదం కలిగిస్తుంది.

ఎలా రక్షించుకోవాలి

కలుషిత నీటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించడానికి, కాచిన నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నీటిని మరిగించడం ద్వారా శుద్ధి చేయవచ్చు. చలికాలంలో, నీరు త్రాగడానికి లేదా పుక్కిలించడానికి ముందు ఎల్లప్పుడూ నీటిని మరిగించాలి. కలుషితమైన నీటిని మరిగించి కాసేపు చల్లార్చి వినియోగించాలి. అదనంగా, ఫిల్టర్లను కూడా ఉపయోగించవచ్చని తెలిపారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి