Bengaluru: దారుణం..జియాలజీ శాఖ డైరెక్టర్‌ మహిళా అధికారిని నరికి చంపారు..! విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి..

ఇకపోతే, గనులు, భూగర్భ శాస్త్ర శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రతిమ హత్య కేసులో అక్రమ రాళ్ల మైనింగ్‌పై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోకి ప్రవేశించి హత్య చేయడమంటే.. ఇది పక్కా ప్రణాళికతో చేసిన పనిగా భావిస్తున్నారు. తెలిసిన వారే ఈ చర్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రతిమ సోదరుడు ఆ రోజు రాత్రి ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, లిఫ్ట్‌ చేయలేదని దాంతో.. మార్నాడు ఉదయాన్నే వారి ఇంటికి వచ్చేసరికి ఘటన వెలుగులోకి వచ్చింది.

Bengaluru: దారుణం..జియాలజీ శాఖ డైరెక్టర్‌ మహిళా అధికారిని నరికి చంపారు..! విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి..
Prathima
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 05, 2023 | 9:09 PM

కర్ణాటక గనులు, భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్ తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి భర్త, కుమారుడు లేని సమయంలో ప్రతిమ అనే ఉన్నతాధికారిని నరికి చంపారు దుండగులు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. పోలీసు వర్గాల కథనం ప్రకారం, బెంగళూరులోని సుబ్రమణపోరా ప్రాంతంలోని ఇంట్లో 45 ఏళ్ల ప్రతిమ, ఆమె కుటుంబం గత ఎనిమిదేళ్లుగా నివసిస్తున్నారు. గనులు, భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రతిమ భర్త, కుమారుడు శనివారం ఇంట్లో లేరు. శివమొగ జిల్లాలోని తీర్థహళ్లికి వెళ్లారు. శనివారం సాయంత్రం పని ముగించుకుని డ్రైవర్ ప్రతిమను ఇంటికి చేర్చాడు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ప్రతిమ దారుణ హత్యకు గురైంది.

ఆదివారం ఉదయం ప్రతిమ సోదరుడు వారి ఇంటికి వచ్చాడు. అక్కడ రక్తసిక్తమైన తన సోదరి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా భయపడిపోయాడు… వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శనివారం రాత్రి పదే పదే ఫోన్ చేసినా తన సోదరి ఫోన్‌ తీయలేదని ప్రతిమ సోదరుడు తెలిపాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉదయాన్నే ఇంటికి వచ్చానని చెప్పాడు..ఇంట్లో తన సోదరి పరిస్థితి చూసిన షాక్‌ తిన్నానని చెప్పాడు. ఇక మరో ఫోరెన్సిక్‌ బృందం, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ మేరకు దక్షిణ బెంగళూరు డీసీపీ రాహుల్‌ కుమార్‌ షహపూర్వాద్‌ తెలిపారు. విచారణ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతిమ హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నట్టుగా చెప్పారు. ఇంట్లో ఏలాంటి చోరీ వంటిది జరగలేదు. కాబట్టి ఇది ముందుగా నిర్ణయించిన హత్య అని స్పష్టమవుతోంది. తెలిసిన వారే హత్య చేసి ఉంటారని అనుమానం రావడంతో పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. డీసీపీ రాహుల్ షాపూర్వాద్ ఇంటిని పరిశీలించారు.

రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి హత్యపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి స్పందిచారు. అధికారి హత్యపై ముమ్మర దర్యాప్తు, విచారణ జరిపిస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, గనులు, భూగర్భ శాస్త్ర శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రతిమ హత్య కేసులో అక్రమ రాళ్ల మైనింగ్‌పై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోకి ప్రవేశించి హత్య చేయడమంటే.. ఇది పక్కా ప్రణాళికతో చేసిన పనిగా భావిస్తున్నారు. తెలిసిన వారే ఈ చర్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రతిమ సోదరుడు ఆ రోజు రాత్రి ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, లిఫ్ట్‌ చేయలేదని దాంతో.. మార్నాడు ఉదయాన్నే వారి ఇంటికి వచ్చేసరికి ఘటన వెలుగులోకి వచ్చింది.

పెళ్లయిన కొద్ది రోజుల్లోనే ప్రతిమకు మైన్స్ అండ్ జియాలజీ శాఖలో ఉద్యోగం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిమ గత 8 ఏళ్లుగా బెంగళూరులో అద్దె ఇంట్లో ఉంటోంది. 18 ఏళ్ల క్రితం ప్రతిమ, సత్యన్‌నారాయణ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం భర్త, కుమారుడు తీర్థహళ్లిలోని తూడుకి గ్రామంలో నివసిస్తున్నారు. 2017లో రామనగరలో సుమారు 3 సంవత్సరాలు గనులు, భూ శాస్త్రాల శాఖలో కూడా పనిచేశారు. తర్వాత బెంగళూరు సౌత్‌కు బదిలీ అయ్యారు. ప్రతిమ, సత్యనారాయణ వైవాహిక జీవితం సామరస్యంగా సాగింది. అలా అయితే, ప్రతిమను హత్య చేసింది ఎవరు? ఎందుకు చంపారు? అనేది మిస్టరీగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..