Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: ఎన్నికల ప్రచారానికి ముందు జైన గురువు ఆశీస్సులు పొందిన ప్రధాని.. స్వయంగా ఫోటోలు షేర్‌ చేసిన మోదీ..

ఛత్తీస్‌గఢ్‌లో 20 నియోజకవర్గాల్లో తొలి విడత ఎన్నికలు నవంబర్ 7 మంగళవారం జరగనున్నాయి. ఆ 20 నియోజకవర్గాల్లో 12 స్థానాలు మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న బస్తర్ డివిజన్‌కు చెందినవే. నవంబర్ 17న రెండో దశ పోలింగ్ 70 నియోజకవర్గాల్లో జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాల ప్రకటన వెలువడనుంది. మావోయిస్టుల చేతిలో ఓ బీజేపీ నేత మృతి చెందడంతో రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

PM Narendra Modi: ఎన్నికల ప్రచారానికి ముందు జైన గురువు ఆశీస్సులు పొందిన ప్రధాని.. స్వయంగా ఫోటోలు షేర్‌ చేసిన మోదీ..
Pm Narendra Modi
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 05, 2023 | 7:40 PM

Chhattisgarh assembly election 2023: ఛత్తీస్‌గఢ్ ఎన్నికల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దిగంబర్ సంత్ దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం రాజ్‌నందంగావ్ జిల్లాలోని జైన్ కమ్యూని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన డోనాగర్‌ఘర్‌ను సందర్శించారు. ఆదివారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని గోండియా విమానాశ్రయానికి చేరుకున్న మోదీ అక్కడి నుంచి హెలికాప్టర్‌లో డొంగర్‌ఘర్ చేరుకున్నారు. కొండ దిగువన ఉన్న మా బామలేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం చంద్రగిరిలోని ప్రముఖ జైన దేవాలయానికి ప్రధాని వెళ్లారు. దిగంబర జైన గురువు ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ మహరాజ్‌ని కలిశారు.  ప్రధాని మోదీ తన X హ్యాండిల్‌పై పోస్ట్ చేసిన చిత్రంలో, మోడీ కర్జోదర్‌లోని జైన సాధువు పాదాలకు నమస్కరించారు. సాధువు కూడా చిరునవ్వుతో మోదీని ఆశీర్వదించారు. జైన దిగంబర సాధువు ఆశీర్వాదాలను పొందుతున్న మూడు ఫోటోలను మోదీ తన X హ్యాండిల్‌లో షేర్‌ చేశారు.. క్యాప్షన్‌లో ఇలా రాశారు, ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌ఘర్‌లోని చంద్రగిరి జైన దేవాలయంలో ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహారాజ్ జీ ఆశీర్వదించారు.

ఛత్తీస్‌గఢ్‌లో 20 నియోజకవర్గాల్లో తొలి విడత ఎన్నికలు నవంబర్ 7 మంగళవారం జరగనున్నాయి. ఆ 20 నియోజకవర్గాల్లో 12 స్థానాలు మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న బస్తర్ డివిజన్‌కు చెందినవే. నవంబర్ 17న రెండో దశ పోలింగ్ 70 నియోజకవర్గాల్లో జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాల ప్రకటన వెలువడనుంది. మావోయిస్టుల చేతిలో ఓ బీజేపీ నేత మృతి చెందడంతో రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

చత్తీస్ గఢ్ లో బీజేపీ నాయకుడు రతన్ దూబే నారయణ పూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడి గా పనిచేస్తున్నారు. నారాయణ పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ కు బీజేపీ ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నారు. మరో మూడు రోజుల్లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన స్థానికంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం మావోయిస్టులు అతి దారుణంగా తనను కత్తులతో నరికి చంపేశారు. ఈ ఘటన నారయణ పూర్ జిల్లాలోని కౌశల్నార్ గ్రామంలోని మార్కెట్ ఏరియాలో చోటు చేసుకుంది.  జరిగిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.  రాజకీయ నేత దారుణ హత్యతో  స్థానిక ప్రజలు, అధికార సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..