AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple Employee: యాపిల్‌ కంపెనీలో 10ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగికి ప్రత్యేక బహుమతి లభించింది.. వైరలవుతున్న వీడియో

ఇప్పుడీ ఉద్యోగి పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అతని పోస్ట్‌కు ఇప్పటికే 5 లక్షల 96 వేలకు పైగా వ్యూస్‌, 7 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అలాగే, వందలాది మంది వినియోగదారులు పోస్ట్‌పై వ్యాఖ్యానించారు. ఒక వినియోగదారు స్పందిస్తూ.. మీరు ఎంత అద్భుతమైన ఫోటో తీశారు అనగా, మరొకరు ఆ ఉద్యోగి10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు తెలిపారు. మరికొందరు

Apple Employee: యాపిల్‌ కంపెనీలో 10ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగికి ప్రత్యేక బహుమతి లభించింది.. వైరలవుతున్న వీడియో
Apple employee receives unique memento
Jyothi Gadda
|

Updated on: Nov 05, 2023 | 6:33 PM

Share

Apple కంపెనీ సాంకేతిక ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది. వారి ప్రీమియం పరికరాలు చాలా మంది వ్యక్తుల ఫస్ట్‌ ప్రాయరిటీ అవుతుంది. ఇటీవల యాపిల్ కొత్త ఐఫోన్ సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ స్టోర్‌ల ముందు కొనుగోలుదారుల భారీ క్యూలు కనిపించాయి. ఇకపోతే, యాపిల్‌లో పని చేయడం చాలా మందికి ఒక కల. ఎందుకంటే యాపిల్ ది బెస్ట్! అని భావిస్తారు చాలా మంది ఉద్యోగులు. అవును, దాని ఉత్పత్తులు ఎంత గొప్పవో.. యాపిల్‌ కంపెనీలో ఉద్యోగం కూడా అంతే గొప్పగా ఉంటుందని నమ్ముతారు..కంపెనీలో పని వాతావరణాన్ని కూడా ఇష్టపడతారు. ఒకసారి ఆపిల్ ప్రపంచంలోకి ప్రవేశించిన ఉద్యోగులు తమ జీవితంలో చాలా ఏళ్లపాటు అక్కడే ఉద్యోగంలో స్థిరపడిపోతుంటారు. అలాంటి యాపిల్ ఉద్యోగి చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి, ఆ వ్యక్తి ఇటీవలే కంపెనీలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఆ వ్యక్తికి ఓ గిఫ్ట్ ఇచ్చారు. మైక్రోబ్లాగింగ్ సైట్‌లో ఆ వ్యక్తి ఈ బహుమతి అన్‌బాక్సింగ్ వీడియోను పోస్ట్ చేశాడు. దాంతో పోస్ట్‌పై చాలా మంది నెటిజన్లు సైతం తీవ్రంగా స్పందించారు.

మార్కోస్ అలోన్సో (@మలోన్సో) అనే ఉద్యోగి ఆపిల్ కంపెనీలో హ్యూమన్ ఇంటర్‌ఫేస్ డిజైనర్. అక్టోబర్ 28న అతను మైక్రోబ్లాగింగ్ సైట్‌లో రెండు ఫోటోలు, అన్‌బాక్సింగ్ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ బహుమతిపై ఇలా ప్రింట్‌ చేసి ఉంది.. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు. ఈ ప్రయాణంలో మీరు చేసిన పని, మీరు ఎదుర్కొన్న సవాళ్లు.. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చే ‘యాపిల్ మిషన్’కి కూడా చాలా ముఖ్యమైన సహకారం అందించాయి. Apple కుటుంబం నుండి మీ ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు! అంటూ పేర్కొన్నారు.

ఇప్పుడీ ఉద్యోగి పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అతని పోస్ట్‌కు ఇప్పటికే 5 లక్షల 96 వేలకు పైగా వ్యూస్‌, 7 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అలాగే, వందలాది మంది వినియోగదారులు పోస్ట్‌పై వ్యాఖ్యానించారు. ఒక వినియోగదారు స్పందిస్తూ.. మీరు ఎంత అద్భుతమైన ఫోటో తీశారు అనగా, మరొకరు ఆ ఉద్యోగి10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు తెలిపారు. మరికొందరు స్పందిస్తూ.. 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా Apple సిల్వర్ బటన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిందా..? అని అడుగుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..