Andhra Pradesh: కాశీలో జరగనున్న కార్తీక పౌర్ణమి పూజలకు కడప శివలింగాలు.. హాజరుకానున్న ప్రధాని మోదీ..
Kadapa:ఈ శివలింగాల తయారీలో స్థానిక మహిళలందరూ పాల్గొని ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభించి, రాత్రి 9 గంటల వరకు వీటిని తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. శివలింగాల తయారీకి సంబంధించిన ట్రేలో మొత్తం 24 శివలింగాలు పడతాయని, ఒక్కొక్క ట్రే ద్వారా 24 శివలింగాలను తయారు చేస్తున్నామని మహిళలు తెలిపారు. గత నెల ఐదు నుంచి ఈనెల 5వ తేదీ వరకు ఈ నెల రోజుల కాలంలో మొత్తం పొద్దుటూరు కడప నగరాలలో కలిపి ఐదు లక్షల శివలింగాలను తయారు చేశామని చెప్పారు.
కార్తీక పౌర్ణమి శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు.. ఆ రోజు ప్రతి శివాలయంలో శివలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే కాశీలో కార్తీక పౌర్ణమిని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కోటిలింగాలను పెట్టి అక్కడ లక్షలాది మంది భక్తుల సమక్షంలో కార్తీక పౌర్ణమి ఘనంగా జరుపుతారు. అయితే, ఆ కార్తీక పౌర్ణమి రోజు నిర్వహించే కోటిలింగాల పూజా కార్యక్రమంలో వినియోగించే శివలింగాలను కొన్ని కడప నగరంలో తయారు చేయించారు. దీంతో ఇలాంటి పుణ్యకార్యంలో పాల్గొనటం తమకెంతో ఆనందంగా ఉందని స్థానిక మహిళలు అంటున్నారు.
కార్తీక పౌర్ణమి రోజు కాశీలో నిర్వహించే కోటిలింగాల పూజా కార్యక్రమానికి కొన్ని శివలింగాలను కడప నగరంలోని పలు ప్రాంతాలలో తయారు చేశారు. గత అక్టోబరు నెల పౌర్ణమి రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈనెల నవంబరు ఐదో తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు 20 నుంచి 25 వేల శివలింగాలను తయారు చేశారు. కడప జిల్లాకు సంబంధించి కడప పొద్దుటూరు ప్రాంతాలలో ఈ శివలింగాలను తయారు చేశారు. ఈ శివలింగాల తయారీకి సంబంధించిన వండు మట్టిని గంగానది పరివాహకం నుంచి సేకరించి ఇక్కడకు తీసుకొని వచ్చి ఆ వండ్రు మట్టితోనే శివలింగాలను తయారు చేశారు. ఒక్కొక్క శివలింగం చిటికెన వేలు చివరి పైభాగమంతా ఎత్తులో ఉండే విధంగా 30 గ్రాములకు మించకుండా ఈ శివలింగాలను తయారు చేశారు. వీటికి సంబంధించిన తయారీ పరికరాలు గానీ, సామాగ్రి అంతా కూడా కాశీ నుంచే వచ్చిందని స్థానిక మహిళలు తెలిపారు.
కార్తీక పౌర్ణమి కి కాశీకి పంపించే శివలింగాలను ఈ నెల రోజుల కాలంలో కడపలో రెండున్నర లక్షలు, ప్రొద్దుటూరులో మరో రెండున్నర లక్షలు తయారు చేశారు. వీటన్నింటినీ హైదరాబాదు చేరవేసి అక్కడి నుంచి కాశీకి పంపించనున్నారు. ఈ శివలింగాల తయారీలో స్థానిక మహిళలందరూ పాల్గొని ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభించి, రాత్రి 9 గంటల వరకు వీటిని తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. శివలింగాల తయారీకి సంబంధించిన ట్రేలో మొత్తం 24 శివలింగాలు పడతాయని, ఒక్కొక్క ట్రే ద్వారా 24 శివలింగాలను తయారు చేస్తున్నామని మహిళలు తెలిపారు. గత నెల ఐదు నుంచి ఈనెల 5వ తేదీ వరకు ఈ నెల రోజుల కాలంలో మొత్తం పొద్దుటూరు కడప నగరాలలో కలిపి ఐదు లక్షల శివలింగాలను తయారు చేశామని చెప్పారు.
ఇక్కడ తయారైన శివ లింగాలన్నింటిని హైదరాబాద్ తరలించి అక్కడి నుంచి కాశీకి పంపిస్తామని చెప్పారు. కార్తీక పౌర్ణమి రోజు జరిగే కోటిలింగాల పూజా కార్యక్రమంలో ప్రధాని కూడా పాల్గొననున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..