చిన్నారి ఊపిరితిత్తుల్లో గుచ్చుకున్న కుట్టుమిషన్ సూది.. అయస్కాంతంతో తొలిగించిన వైద్యులు.. ఇదోక అద్భుతం
సీలంపూర్ కు చెందిన బాధిత బాలుడు సూది ఎలా మింగాడనేది తల్లికి కూడా తెలియదు. చిన్నారి శరీరంపై ఎలాంటి రంధ్రం కనిపించకపోవడంతో ఆడుకుంటూ సూది మింగినట్లు భావిస్తున్నారు. చిన్నారిని గురువారం ఆస్పత్రికి తరలించారు. ఆ మర్నాడు శుక్రవారం సర్జరీ చేసిన వైద్యులు..శనివారం రోజున ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి పూర్తిగా క్షేమంగా ఉందని చెప్పారు. బాలుడు తొలుత దగ్గుతున్నప్పుడు నోట్లోంచి రక్తం పడుతుండేది. దాంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువచ్చారు.
చిన్నారి ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న కుట్టు సూదిని అత్యంత జాగ్రత్తగా, చాకచక్యంగా తొలగించారు వైద్యులు. అది కూడా అయస్కాంతం సాయంతో లంగ్స్‌లో ఇరుక్కుపోయిన సూదిని తొలగించి అద్భుతం చేశారు డాక్టర్లు. ఈ అరుదైన సంఘటన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆస్పత్రిలో చోటు చేసుకుంది. 7 ఏళ్ల చిన్నారి ఎడమ ఊపిరితిత్తులో ఇరుక్కున్న సూదిని తొలగించేందుకు ఎయిమ్స్ వైద్యులు ఇలాంటి విశిష్టమైన దేశీ జుగాడ్‌ను ఉపయోగించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేయటంతో ఆసుపత్రి సిబ్బంది వైద్య బృందాన్ని చప్పట్లతో ప్రశంసించారు. చిన్నారి తల్లిదండ్రులు కూడా వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగం వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారి ఊపిరితిత్తుల్లో 4 సెంటీమీటర్ల పొడవున్న సూది ఇరుక్కుపోయిందని, కాంప్లెక్స్ ఎండోస్కోపిక్ సర్జరీ ద్వారా దాన్ని తొలగించినట్టుగా తెలిపారు.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, బాలుడు తొలుత దగ్గుతున్నప్పుడు నోట్లోంచి రక్తం పడుతుండేది. దాంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో ఎయిమ్స్‌కు తరలించారు. బాలుడు తీవ్రమైన దగ్గుతో ఇబ్బంది పడుతున్నాడు. దగ్గుతో పాటుగా నోటి నుంచి రక్తం పడటం క్రమంగా పెరిగింది. దీంతో ఎయిమ్స్ డాక్టర్లు అతనికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. చిన్నారికి రేడియోలాజికల్ టెస్ట్ చేయగా చిన్నారి ఎడమ ఊపిరితిత్తులో కుట్టు మిషన్ సూది ఉన్నట్టుగా తేలింది. ఊపిరితిత్తులకు గుచ్చుకుని ఉన్న సూదిని తీసివేయడం సులభం కాదని వారికి అర్థమైంది. డాక్టర్ విశేష్ జైన్, డాక్టర్ దేవేంద్ర కుమార్ యాదవ్ లు బాలుడికి అన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం చిన్నారికి అత్యవసర శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే చాందినీ చౌక్ నుండి 4 మిమీ వెడల్పు, 1.5 మిమీ మందం కలిగిన అయస్కాంతాన్ని ఆర్డర్ చేశారు. అయితే, వైద్యులకు ఎదురైన సవాల్ ఏంటంటే.. పిల్లవాడి శ్వాసనాళం దెబ్బతినకుండా అయస్కాంతాన్ని సూది ఉన్న ప్రదేశానికి ఎలా తీసుకువెళ్లాలనేది.
శస్త్రచికిత్సకు ముందు అయస్కాంతాన్ని ఎలాంటి కెమికల్స్‌తో, ఎలాంటి హాని కలిగించకుండా శుద్ధి చేశారు. దాంతో బాలుడికి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం బాలుడి ఊపిరితిత్తులలోని సూదిని గుర్తించడానికి శ్వాసనాళం ఎండోస్కోపీని నిర్వహించారు. దీని తర్వాత నోటి ద్వారా అయస్కాంతం ఊపిరితిత్తులకు చేర్చారు.. అయస్కాంతానికి సూది అంటుకునేలా చేసి ఊపిరితిత్తుల నుంచి అతి జాగ్రత్తగా బయటకు తీశారు. సూది బయటకు రావడంతో వైద్యులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్స్ చెప్పారు.
సీలంపూర్ కు చెందిన బాధిత బాలుడు సూది ఎలా మింగాడనేది తల్లికి కూడా తెలియదు. చిన్నారి శరీరంపై ఎలాంటి రంధ్రం కనిపించకపోవడంతో ఆడుకుంటూ సూది మింగినట్లు భావిస్తున్నారు. చిన్నారిని గురువారం ఆస్పత్రికి తరలించారు. ఆ మర్నాడు శుక్రవారం సర్జరీ చేసిన వైద్యులు..శనివారం రోజున ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి పూర్తిగా క్షేమంగా ఉందని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…