AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger video: పులిని పెంపుడు కుక్కలా తిప్పుతున్న బుడ్డొడు.. వీడియో చూస్తే బాబోయ్‌ అనాల్సిందే..

వామ్మో పులిని ఇంట్లో పెంచుకోవటం ఏంటని షాక్‌ అవుతున్నారు కదా..? కానీ, అలాంటిదే ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒక విలాసవంతమైన ఇంట్లో పెంపుడు పులిని గొలుసుతో కట్టేసి కుక్కను తిప్పినట్టుగా నడిపిస్తున్న ఒక యువకుడి వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఈ క్లిప్‌ను పాకిస్థానీ యూట్యూబర్ నౌమన్ హసన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేయగా విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో షేర్ చేసినప్పటి నుండి వీడియో వైరల్‌గా మారింది. వేలాది మంది వీక్షణలను సంపాదించింది.

Tiger video: పులిని పెంపుడు కుక్కలా తిప్పుతున్న బుడ్డొడు.. వీడియో చూస్తే బాబోయ్‌ అనాల్సిందే..
Young Boy Walking Tiger
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 04, 2023 | 9:11 PM

చాలా మంది తమ ఇళ్లల్లో పెంపుడు జంతువులను పెంచుకుంటుంటారు. కొందరు కుక్కల్ని పెంచుకుంటే, మరికొందరు పిల్లుల్ని పెంచుకుంటారు. ఇక కొందరు ఇతర జంతువులు మేకలు, కుందేళ్లు వంటి వాటిని పెంచుకుంటే, కొందరు చిలుక, పావురాలు, బాతులు వంటి పక్షి జాతుల్ని కూడా పెంచుకుంటారు. అయితే, ఎవరైనా పులిని పెంపుడు జంతువుగా పెంచుకోవటం చూశారా..? వామ్మో పులిని ఇంట్లో పెంచుకోవటం ఏంటని షాక్‌ అవుతున్నారు కదా..? కానీ, అలాంటిదే ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒక విలాసవంతమైన ఇంట్లో పెంపుడు పులిని గొలుసుతో కట్టేసి కుక్కను తిప్పినట్టుగా నడిపిస్తున్న ఒక యువకుడి వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఈ క్లిప్‌ను పాకిస్థానీ యూట్యూబర్ నౌమన్ హసన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేయగా విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో షేర్ చేసినప్పటి నుండి వీడియో వైరల్‌గా మారింది. వేలాది మంది వీక్షణలను సంపాదించింది.

నౌమన్‌ ఇన్‌స్టాను 955,000 మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. యూట్యూబర్ నౌమన్‌ ఇన్‌స్టాలో తరచూ పులులు, పాములు, మొసళ్లకు సంబంధించిన అనేక వీడియోలను తరచూ పోస్ట్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఈ సారి షేర్‌ చేసిన వీడియోలో ఒక బాలుడు పులిని కట్టివేసిన గొలుసును పట్టుకుని ఒక లగ్జరీ బిల్డింగ్‌లోపలే చుట్టూ తిరుగుతున్నాడు. ఈ చిన్న క్లిప్‌లో కనిపించిన ఆ బాలుడు..క్రూర మృగాన్ని పట్టుకుని ఏ మాత్రం భయపడకుండా తిప్పుతున్నాడు. పాకిస్థానీ యూట్యూబర్ నౌమన్ హసన్ షేర్‌ చేసిన ఈ వీడియోపై చాలా మంది విమర్శలు గుప్పించారు. దీంతో ఇంటర్‌నెట్‌లో వీడియోపై తీవ్ర దుమారం మొదలైంది.

ఇవి కూడా చదవండి

ఐదు రోజుల క్రితం ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. చాలా మంది పాకిస్తానీ యూట్యూబర్ చిన్నారిని ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంచారని విమర్శించారు. మరికొందరు పులిని బంధించి, నిర్బంధించడాన్ని పలువురు ఖండించారు.

అయితే, వీడియోలో కనిపించిన ఆ పిల్లవాడికి, తనకు ఎలాంటి సంబంధం ఉందనే విషయాన్ని మాత్రం హసన్ తన వీడియోలో ఎలాంటి సమాచారం పేర్కొనలేదు, కానీ సోషల్ మీడియాలో కొందరు అతను యూట్యూబర్ మేనల్లుడు కావచ్చునని ఊహించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..