Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో పచ్చి బఠానీలు తినడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు!! తెలిస్తే..

పచ్చి బఠానీల రుచిని ఎవరు ఇష్టపడరు. చాలా మంది పోషకాహార నిపుణులు చలికాలంలో పచ్చి బఠాణీలను తినమని చెబుతుంటారు. ఎందుకంటే ఇందులో కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, శీతాకాలంలో తాజా పచ్చి బఠానీలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. గ్రీన్ పీస్‌లో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే అనేక ఖనిజాలు ఉన్నాయి. ఈ పోషకాలన్నీ రక్తపోటును సాధారణంగా ఉంచడంలో సహాయపడతాయి.

చలికాలంలో పచ్చి బఠానీలు తినడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు!! తెలిస్తే..
Green Peas In Winter
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 04, 2023 | 7:06 PM

పచ్చి బఠానీలు సాధారణంగా శీతాకాలంలో ఎక్కువగా మార్కెట్లోకి వస్తుంటాయి. కానీ, అవి ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. ఎండిన బఠాణీల కంటే పచ్చి బఠాణీలు తినడం ఆరోగ్యానికి మంచిది. అందువల్ల తాజా పచ్చి బఠానీలను తినమని సలహా ఇస్తారు ఆరోగ్య నిపుణులు. కానీ, పచ్చి బఠానీల రుచిని ఎవరు ఇష్టపడరు. చాలా మంది పోషకాహార నిపుణులు చలికాలంలో పచ్చి బఠాణీలను తినమని చెబుతుంటారు. ఎందుకంటే ఇందులో కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, శీతాకాలంలో తాజా పచ్చి బఠానీలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

చలికాలంలో పచ్చి బఠానీలతో కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..

1. ప్రోటీన్‌కు గొప్ప మూలం పచ్చి బఠానీలు: పచ్చి బఠానీలలో ఉత్తమమైన మొక్కల ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు బలపడతాయి. ఇది కండరాలను సరిచేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు, పిల్లల శరీరాభివృద్దికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

2. ఫైబర్ సమృద్ధిగా: పచ్చి బఠానీల్లో పుష్కలమైన ఫైబర్ లభిస్తుంది. పచ్చి బఠానీలను తినటం వలన మీరు ఎక్కువ సమయం కడుపు నిండిన అనుభూతిని కలిగి ఉంటారు. అలాగని పచ్చిబఠానీ అతిగా తినడం కూడా మంచిది కాదు.. పచ్చిబఠానీలను మితంగా తీసుకోవటం వల్ల క్రమంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి బఠానీలు సరైన ఆహారం.

3. డయాబెటిస్‌లో ప్రభావవంతంగా ఉంటుంది: పచ్చి బఠానీలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది ఆకస్మిక చక్కెర స్పైక్‌లను నివారిస్తుంది. ఫైబర్ కారణంగా కార్బోహైడ్రేట్ల శోషణను తగ్గిస్తుంది. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్లకు పచ్చి బఠానీలు బెస్ట్ ఫుడ్.

4. గుండె ఆరోగ్యానికి ప్రయోజనాలు : గ్రీన్ పీస్‌లో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే అనేక ఖనిజాలు ఉన్నాయి. ఈ పోషకాలన్నీ రక్తపోటును సాధారణంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఇది కాకుండా రక్త నాళాల నుండి చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది .

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..