Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కరువు కోరల్లో రైతన్నలు.. భవిష్యత్‌ ప్రమాదాన్ని ఊహించుకుని బలవన్మరణాలు..! దాతల సాయం కోసం ఎదురు చూపులు..

Kurnool: ఖరీఫ్ సాగు లో వివిధ రకాల పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే రైతు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. పత్తి పంట సాగు చేసిన రైతుకు ఎకరానికి రూ.35 వేలు, ఉల్లి సాగు చేసిన రైతుకు ఎకరానికి రూ. 25 వేలు, వేరుశనగ పంటను సాగు చేసిన రైతుకు ఎకరానికి రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా జిల్లాలో పలు రకాల పంటలు సాగు చేసిన వారికి కూడా నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

Andhra Pradesh: కరువు కోరల్లో రైతన్నలు.. భవిష్యత్‌ ప్రమాదాన్ని ఊహించుకుని బలవన్మరణాలు..! దాతల సాయం కోసం ఎదురు చూపులు..
Farmer Lost Crops
Follow us
J Y Nagi Reddy

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 04, 2023 | 4:33 PM

కర్నూలు, నవంబర్ 04; కర్నూలు జిల్లా పచ్చిమ ప్రాంతంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వేల ఎకరాల లో రైతులు సాగు చేసిన పంటలు వర్షాలు లేక ఎండిపోయాయి. పంటల సాగు పెట్టుబడులు కూడా చేతికి రాని పరిస్థితి ఏర్పడింది. అరకొర వర్షాల కారణంగా వివిధ రకాల పంటల దిగుబడులు ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటల సాగు పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. మరికొంతమంది రైతులు చేసేది ఏమీ లేక పిల్లా పాపలతో వలసలు వెళ్తున్నారు. ఇక, కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆలూరు. ఈ ఆలూరు ప్రాంతం వర్షాభావం పై పూర్తిగా ఆధారపడింది. ఇక్కడ సాగు నీటి వనరులు లేక ప్రతి ఏటా రైతులు అతివృష్టి, అనావృష్టి కారణాలతో పంటలు సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు. పంటల సాగుకు చేసిన అప్పులు తీర్చలేక మరి కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.

ఖరీఫ్ రైతు కుదేలు..

ఈ ఏడాది ఆలూరు వ్యవసాయ సబ్ డివిజన్ లో ఖరీఫ్ రైతులు పూర్తి స్థాయిలో కుదేలు అయ్యారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట దెబ్బతిని సాగు చేసిన పెట్టుబడులు కూడా చేతికి రాలేదు. ఆలూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 73 వేల హెక్టార్లు. ఈ ఏడాది అరకొర వర్షాల కారణంగా 69,669 వేల హెక్టార్లలో రైతులు సాగు చేశారు. అందులో ప్రధానంగా 37.842 హెక్టార్లలో పత్తి పంట,17,841 హెక్టార్లలో ఉల్లి 6వేల హెక్టార్లలో వేరుశనగతో పాటు వివిధ రకాల పంటలు సాగు అయ్యాయి. ఖరీఫ్ సాగు ప్రారంభం నుంచి రైతులు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. సాధారణ వర్ష పాతం కూడా నమోదు కాక అరకొర వర్షాలకు వివిధ రకాల పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. దిగుబడులు తగ్గిపోయాయి. రైతులు ఆర్థికంగా నష్టపోయారు.

ఇవి కూడా చదవండి

అప్పులు తీర్చేందుకు వలసలు..

ఖరీఫ్ సాగుకు రైతులు దాదాపు కోటి రూపాయలకు పైగా అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. అరకొర వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దిగుబడులు తగ్గిపోయాయి. ఆర్థికంగా నష్టం వాటిల్లింది. పెట్టుబడులుచేతికి రాక చేసిన అప్పులు తీర్చేందుకు కొందరు రైతులు వలస బాట పట్టారు. మరికొంత మంది రైతులు వ్యవసాయ, పాడి పశువులను అమ్మేస్తున్నారు. ఇంకొంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, వ్యవసాయ కూలీల పరిస్థితి మరింత దారుణంగా మారింది. వర్షాలు లేక పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్న కారణంగా వ్యవసాయ పనులు అంతంత మాత్రంగానే ఉండడంతో కూలీలు స్థానికంగా పనులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు..

నష్టపోయిన రైతును ఆదుకోవాలని డిమాండ్..

ఖరీఫ్ సాగు లో వివిధ రకాల పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే రైతు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. పత్తి పంట సాగు చేసిన రైతుకు ఎకరానికి రూ.35 వేలు, ఉల్లి సాగు చేసిన రైతుకు ఎకరానికి రూ. 25 వేలు, వేరుశనగ పంటను సాగు చేసిన రైతుకు ఎకరానికి రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా జిల్లాలో పలు రకాల పంటలు సాగు చేసిన వారికి కూడా నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..