భార్య పుట్టిన రోజు కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన భర్త.. వారి బంధాన్ని విడదీసిన అదే బహుమతి..!
ఒక డేటింగ్ వెబ్‌సైట్‌లో ఒక వ్యక్తి తన స్నేహితుడి వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాన్ని చెప్పాడు. అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. పుట్టినరోజు కానుక తన స్నేహితుడికి, అతని భార్యకు మధ్య బంధాన్ని ఎలా విడగొట్టిందో చెప్పాడు. ఆ వ్యక్తి తన స్నేహితుడి భార్య పుట్టినరోజు అని చెప్పాడు. పుట్టినరోజు కానుకగా అతను తన భార్య కోసం సీక్రెట్ కెమెరాతో కూడిన డోర్‌బెల్ కొన్నాడు. ఈ డోర్ బెల్ స్పెషాలిటీ ఏంటంటే.. దానికి బయట బటన్ తో పాటు కెమెరా కూడా అమర్చారు. ఆ కెమెరా లైవ్ రికార్డింగ్ కూడా ఫోన్‌లో చూసుకోవచ్చు.
ప్రతి సంవత్సరం వచ్చే ప్రత్యేకమైన రోజులలో పుట్టినరోజు ఒకటి. అందరూ ఆ రోజును ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రేమలో ఉన్నవారు, పెళ్లిచేసుకున్న జంటలకు ఈ పుట్టినరోజు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. మన పుట్టినరోజు గుర్తు లేకపోయినా, మన భాగస్వామి పుట్టినరోజును గుర్తుపెట్టుకుంటాం. అయితే, ప్రతి భర్త తన భార్య పుట్టినరోజును ఆమె జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజుగా చేయాలని కోరుకుంటాడు. ఆమె తన జీవితాంతం గుర్తుంచుకునే తనకోసం విలువైన బహుమతిని తీసుకువస్తాడు. ఆమెకు ఇష్టమైన నగలు, బట్టలు, మేకప్ కిట్, బ్యాగ్ లాంటివి ఇవ్వడం మామూలే. కొంతమంది ట్రిప్, లాంగ్ డ్రైవ్ లాంటి భార్యకు నచ్చిన పనులు చేస్తుంటారు. వారు స్నేహితులను ఆహ్వానించి పెద్ద పార్టీని ఏర్పాటు చేస్తుంటారు. అయితే, అలాంటిదే ఒక వ్యక్తి తన భార్యకు ఈ బహుమతులన్నింటినీ వదిలివేసి ఆమెకు డోర్‌బెల్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. డోర్ బెల్ అంటే అది మామూలుగా లేదు. గుమ్మం దగ్గరకు వచ్చేవారి ఫొటోలు, వీడియోలు తీయడం దాని ప్రత్యేకత. అయితే, భర్త ఇచ్చిన డోర్ బెల్ గిఫ్ట్ అందుకున్న ఆ ఇల్లాలు ఇంటి మెయిన్‌డోర్‌కు ఫిక్స్ చేసింది. దురదృష్టవశాత్తు అదే గిఫ్ట్ ఆ భార్య భర్తల మధ్య దూరానికి కారణమైంది.
నివేదిక ప్రకారం, ఒక డేటింగ్ వెబ్‌సైట్‌లో ఒక వ్యక్తి తన స్నేహితుడి వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాన్ని చెప్పాడు. అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. పుట్టినరోజు కానుక తన స్నేహితుడికి, అతని భార్యకు మధ్య బంధాన్ని ఎలా విడగొట్టిందో చెప్పాడు. ఆ వ్యక్తి తన స్నేహితుడి భార్య పుట్టినరోజు అని చెప్పాడు. పుట్టినరోజు కానుకగా అతను తన భార్య కోసం సీక్రెట్ కెమెరాతో కూడిన డోర్‌బెల్ కొన్నాడు. ఈ డోర్ బెల్ స్పెషాలిటీ ఏంటంటే.. దానికి బయట బటన్ తో పాటు కెమెరా కూడా అమర్చారు. ఆ కెమెరా లైవ్ రికార్డింగ్ కూడా ఫోన్‌లో చూసుకోవచ్చు.
ఇదిలా ఉండగా, ఒకసారి తన ఇంటికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చినట్లు డోర్‌బెల్ కెమెరా ద్వారా భర్త తన మొబైల్ ఫోన్‌లో చూశాడు. అంతలో తన భార్య తలుపు తీసి బయటకు వచ్చింది. కెమెరా ముందు తలుపు బయటే ఆ వచ్చిన వ్యక్తితో అభ్యంతరకరంగా ప్రవర్తించటం అతడు చూశాడు.. భార్య ప్రవర్తన చూసి భర్త బిత్తరపోయాడు. ఇదంతా చూసి అతని గుండె జారిపోయినంతపనైంది. తన భార్య తనను మోసం చేస్తుందని నమ్మలేకపోయాడు.. తన భార్య తనను మోసం చేసిందన్న నిజం తెలిసిన అతడు..వెంటనే ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు.. ఇంటికి రావడం రావడమే.. తన భార్యకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. అలా ఆ ఇద్దరు విడిపోయారని ఈ పోస్ట్ చేసిన వ్యక్తి వివరించాడు. ఈ డోర్‌బెల్ తన స్నేహితుడి వివాహాన్ని విచ్ఛిన్నం చేసిందని ఆ వ్యక్తి చెప్పాడు.
ఇక, ఈ పోస్ట్‌ని చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. భార్య చేసిన మోసం కెమెరాకు చిక్కిందని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు ఈ డోర్‌బెల్‌ను నిషేధించాలని అన్నారు. డోర్‌బెల్‌లో కెమెరా ఉందని తెలిసి కూడా ఆమె ఇలా ఎందుకు చేసిందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ బహుమతి కారణంగానే వారి బంధంలో విభేదం వచ్చిందంటూ చాలా మంది నెటిజన్లు భిన్నమైన ట్విట్లు చేశారు.
ఈ పోస్ట్‌ని చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. భార్య చేసిన మోసం కెమెరాకు చిక్కిందని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు ఈ డోర్‌బెల్‌ను నిషేధించాలని అన్నారు. డోర్‌బెల్‌లో కెమెరా ఉందని తెలిసి కూడా ఆమె ఇలా ఎందుకు చేసిందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..